For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెహెందీ వేడుకలో మీరు బ్యూటిఫుల్ గా &స్టైలిష్ గా కనబడాలంటే

By Super
|

మీ జీవితంలో అందమైన కొత్త దశను స్వీకరించటానికి ఏర్పాటు చేస్తున్నప్పుడు,అది మీ పెళ్లి రోజు ముందు వచ్చే వేడుక కోసం ఆలోచన వచ్చినప్పుడు,మీరు ప్రతి చిన్న విషయాలను జాగ్రత్తగా ఖచ్చితంగా చూసుకోవాలి.

కానీ చాలా తరచుగా,అనేక మంది అమ్మాయిలు,ఈ మెహంది వేడుక కోసం మంచి దుస్తులను ధరించి మంచి లుక్ ఉండేలా చూసుకుంటారు. ఎందుకంటే ఈ వేడుక వారి ఇళ్ళల్లో జరుగుతాయి. అలాగే ఇది ఒక భారీ ఫంక్షన్ కాదు.

అయినప్పటికీ,ఎంత చిన్న మెహేంది ఫంక్షన్ అయిన, మీ ఇంటికి కుటుంబం మరియు స్నేహితులు వస్తారు. అది ఇప్పటికీ మీకు చాలా ప్రత్యేకమైన రోజుగా ఉంటుంది. అలాగే మొత్తం ఆ క్షణాలను పోటోలుగా తీసుకుంటాం. అందరి దృష్టి మీ మీదే ఉంటుంది. మీరు ప్రతిది క్షణంను అత్యుత్తంగా చూడవచ్చు.

కాబట్టి, మేము మీ మెహేంది వేడుక అద్భుతముగా చేయడానికి కొన్ని సూపర్ స్టైలిష్ చిట్కాలను చెప్పుతున్నాం.

 ప్రకాశవంతమైన రంగులను తీసుకోండి

ప్రకాశవంతమైన రంగులను తీసుకోండి

మీరు ఒక నిజమైన బాలీవుడ్ అభిమాని అయితే,ఆ నటీమణుల నుండి ప్రేరణ తీసుకోవచ్చు. ఈ మెహేంది వేడుకలు రీల్ లైఫ్ లేదా నిజమైనవి ఉంటాయి. అనేక శైలిల్లో ఉన్న ఈ వేడుకలలో మనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే కాజోల్ యొక్క ఆకు పచ్చని దుస్తులు లేదా జుబేదా లో కరిష్మా కపూర్ యొక్క వైట్ లుక్,నిజ జీవితంలో వధువులు అయిన ఐశ్వర్య రాయ్,విద్యా బాలన్, ఇషా లేదా అహనా డియోల్ లాంటి దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఫాలో అవండి. మీరు ఎంచుకోవడానికి ఉత్తమ రంగులుగా నారింజ, పసుపు, ఆకుపచ్చ లేదా ఆ రంగుల వివిధ షేడ్స్ కలయిక బాగుంటుంది. ఈ ప్రకాశవంతమైన రంగులు ఖచ్చితంగా మీ ఫోటో లకు చాలా బాగుంటాయి.

మీకు చాలా ప్రకాశవంతమైన రంగులు ఇష్టం లేకపోతే,మీరు లేత గోధుమరంగు, బేబీ గులాబీ, లేత పసుపు లేదా వైడూర్య రంగులను ఎంచుకోవచ్చు.కేవలం మీరు ప్రతిది పూర్తి రంగులను ఎంచుకోవాలని నిర్ధారించుకోండి. నిజానికి, మంచి రంగుల బోర్డర్ లేదా దుప్పటా ఉంటే మొత్తం లుక్ మారిపోతుంది.

 జాగ్రత్తగా మీ దుస్తులను ఎంచుకోండి

జాగ్రత్తగా మీ దుస్తులను ఎంచుకోండి

దుస్తులను నిర్ణయించే సౌకర్యం ఉంది. అయితే మొదట గుర్తు ఉంచుకోవాల్సిన విషయం ఏమిటంటే స్టైల్ ఫ్యాక్టర్ మర్చిపోకుండా ఉండాలి. అనార్కలీ లేదా సల్వార్ కమీజ్ లేదా కుర్తాలతో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. మీకు సాంప్రదాయ పద్దతిలో వెళ్ళాలని ప్రణాళిక ఉంటే,అప్పుడు చీరలు, లెహంగాలు లేదా గాగ్రాలు అత్యుత్తమ ప్రత్యామ్నాయాలుగా ఉన్నాయి. మీరు అనుకుంటే ఎంబ్రాయిడరీ దుస్తులను కూడా ఉపయోగించవచ్చు. కానీ నెక్ లైన్ అవసరం లేదు. ఎందుకంటే మీరు భారీ మెహేంది గురించి ఆందోళన చెందనవసరం లేదు.

అయినప్పటికీ,మీరు మీ రూపాన్ని ఆధునికంగా చేయాలనీ అనుకుంటే, ఒక సౌకర్యవంతమైన షాట్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. మోకాలి పొడవు ప్యాంటు లేదా మోకాలి పొడవు లంగాను ఉపయోగించవచ్చు. అలాగే ఒక మంచి ఎంబ్రాయిడరీ జాకెట్ లేదా టాప్ ను ఉపయోగించండి. ఈ రకమైన శైలి అందరికి నచ్చుతుంది. పై ఫోటో లో వధువు కోసం ఒక క్యూ పట్టవచ్చు.

ఆభరణాల విషయంలో రాజీ వద్దు

ఆభరణాల విషయంలో రాజీ వద్దు

ఫంక్షన్ మీ ఇంటిలో లేదా ఇతర వేదికల వద్ద జరిగినప్పుడు ఆభరణాల విషయంలో రాజీకి రావద్దు. అలాగే ఇవి మీ దుస్తులకు సమకాలీకంగా ఉండటం చాలా ముఖ్యమైనవి.

మీరు బోల్డ్ మరియు లౌడ్ గా ఉండాలని కోరుకుంటే,మీరు రంగు రత్నాలతో నిండిన ఆభరణాలను లేదా ఒక భారీ కుందన్ సెట్ ను ఎంచుకోవచ్చు. అలాగే మీరు మీ అమ్మగారి గోల్డ్ సెట్ ను పెట్టుకోవటానికి భయపడకండి. కానీ,మీరు సున్నితముగా వెళ్లాలనుకుంటే,తక్షణమే మీ రూపు మార్చుకొని ఒక అద్భుతమైన వాటిని ధరించండి.

వధువు

వధువు

మీ రూపు కొద్దిగా సాధారణ వధువు లుక్ రావాలంటే పురాతన ఆభరణాలను ధరించవచ్చు. మీరు అనుసరించటానికి మరోకటి పూల ఆభరణాల ట్రెండ్ ఉంది. ఐశ్వర్య రాయ్, విద్యా బాలన్, ఇషా లేదా అహనా డియోల్ వంటి సెలెబ్రిటీ వధువులు వారి మెహేంది వేడుకలలో నిజమైన పువ్వు ఆభరణాలతో కనబడ్డారు.

మేకప్ విషయాలు

మేకప్ విషయాలు

మీ అలంకరణను ఎంచుకున్నప్పుడు, మీకు మెహేంది కళాకారుడు మీ చేతులు మరియు కాళ్ళకు మెహేంది పెట్టినప్పుడు చాలా సేపు కూర్చోవాలని గుర్తుంచుకోండి. వారు చేసిన తర్వాత కూడా అది ఆరిపోయే వరకు ఇంకా అలాగే ఉండాలి. కాబట్టి,మీ అలంకరణను తాకడం దాదాపు అసాధ్యం. మీకు ఎవరైనా సహాయపడాలి.

వాటర్ ప్రూఫ్, దీర్ఘ శాశ్వత అలంకరణ ఎంచుకోవడం ఉత్తమంగా ఉంటుంది. ఇదే కాకుండా, మీ అలంకరణ రంగులు మీ దుస్తులతో సమకాలీకంగా ఉండాలని నిర్ధారించుకోండి. మీరు ఓవర్ గా వెళ్ళకుండా ఉండటానికి కావలసిన రంగులను వాడవచ్చు.

జుట్టు

జుట్టు

జుట్టు దగ్గరకు వచ్చినప్పుడు, ఒక విలక్షణ మైన ముడి బన్ను లేదా అల్లిక అనేవి మిమ్మల్ని మరింత సౌకర్యవంతముగా కొన్ని గంటలు కూర్చుని ఉండటానికి సహాయపడుతుంది. కానీ మీరు జుట్టును అలా విడిగా వదిలేయాలని అనుకుంటే, మీరు కేవలం ముందు భాగంలో పిన్ పెట్టాలి. ఈ విధంగా చేస్తే ముఖం మీద జుట్టు పడకుండా ఉంటుంది.

మీ మెహేంది పిక్చర్స్ వివాహం గురించి మీ ఆనందం మరియు ఉత్సాహం గురించి తెలియజేస్తుంది. కాబట్టి మీరు వధువు కోసం ఈ సాధారణ చిట్కాలు మనస్సులో ఉండాలని నిర్ధారించుకోండి.


English summary

How to Look Stylish on Your Mehendi Ceremony

As you are all set to embrace the beautiful new phase of your life, we are sure you are carefully going through every little detail when it comes to planning for even the ceremonies that precede the wedding day.
Desktop Bottom Promotion