For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ ముఖాకృతికి ఎట్రాక్టివ్ లుక్ తీసుకొచ్చే ఇయర్ రింగ్స్

By Nutheti
|

రకరకాల రంగులు, ఆకారాల్లో ఆకట్టుకుంటున్నాయి చెవి రింగులు. ఒకప్పటి ఫ్యాషన్ ఇప్పుడు ట్రెండీగా మారింది. బుట్టలు, పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోవడం అందరికీ ఇష్టంగా మారింది. డ్రెస్ కి తగ్గట్టు మ్యాచింగ్, ట్రెండీగా ఉండే.. చెవి రింగులు పెట్టుకోవడానికి ప్రతి అమ్మాయి ఆసక్తి చూపుతోంది.

మీరు పెట్టుకునే ప్రతి ఇయర్ రింగ్ పర్ఫెక్ట్ లుక్ ని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే.. మీ ఎంపికలో పొరపాట్లు ఉంటాయి. మీ ముఖాకృతిని బట్టి చెవి రింగులు పెట్టుకోవడం వల్ల మరింత ఎట్రాక్టివ్ గా కనిపించవచ్చు. కొన్ని రకాల ఇయర్ రింగ్స్ మీకు నచ్చకపోవచ్చు.. కానీ అలాంటివే మీ ఫేస్ షేప్ గా బాగా నప్పుతాయి. లేదా ఇప్పటివరకు ట్రై చేయని ఇయర్ రింగ్స్ మీకు మరింత అందాన్ని తీసుకొస్తాయి.

కాబట్టి ఈసారి ఇయర్ రింగ్స్ కొనేటప్పుడు మీ ఫేస్ షేప్ ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇంకేముంది మీ ఫేస్ షేప్ ఎలా ఉంటే.. ఎలాంటి చెవి రింగులు అందంగా కనిపిస్తాయో ఇప్పుడే చెక్ చేసుకుని.. ఫాలో అయిపోండి.

రౌండ్ షేప్

రౌండ్ షేప్

గుండ్రటి ముఖాకృతి కలిగిన వాళ్లకు బుగ్గల భాగంలో తప్ప ఫోర్ హెడ్ దగ్గర, గడ్డం దగ్గర ఎక్కువ వెడల్పు ఉండదు. ఇలాంటి ఫేస్ షేప్ కలిగిన అమ్మాయిలు స్టడ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు. ఎప్పుడు పొడవాటి ఇయర్ రింగ్స్ ని వాడటం వల్ల చాలా ఎట్రాక్టివ్ గా కనిపిస్తారు.

హార్ట్ షేప్

హార్ట్ షేప్

మీ ముఖం హార్ట్ షేప్ లో ఉందా.. ? అంటే బుగ్గల కంటే.. ఫోర్ హెడ్ ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. నుదురుభాగం నుంచి కిందకు వచ్చే కొద్దీ.. ముఖం సన్నగా ఉంటుంది. పొడవుగా, త్రిభుజాకారంలో ఉంటే చెవి రింగులు ధరిస్తే ఆకర్షణీయంగా ఉంటుంది.

స్క్వేర్ షేప్

స్క్వేర్ షేప్

స్క్రేర్ షేప్ లో మీ ముఖం ఉందా.. అంటే నుదురు, బుగ్గలు వెడల్పుగా ఉంటే మీ ముఖం చతురస్రాకారంలో ఉన్నట్టు. పొడవాటి ఇయర్ రింగ్స్ ఇలాంటి ముఖాకృతికి బాగా సెట్ అవుతాయి. అయితే.. చెవి రింగులు కిందకి వచ్చే సరికి సన్నగా లేదా ఒక పూసతో ఎండ్ అయ్యేవి అయితే బావుంటాయి.

రెక్టాంగిల్

రెక్టాంగిల్

మీ నుదురుభాగం, గడ్డం సైజు ఒకేలా ఉండి.. ముఖం పొడవుగా అనిపిస్తే.. మీది రెక్టాంగిల్ షేప్ ముఖమని అర్థం. ఇలాంటి ముఖాకృతి కలిగిన అమ్మాయిలు వెడల్పాటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే బావుంటుంది. స్టోన్స్ తో ఉండే స్టడ్స్ ఎంపిక చేసుకోవాలి. అవి కూడా కాస్త వెడల్పుగా కనిపిస్తే బావుంటుంది.

డైమండ్ షేప్

డైమండ్ షేప్

నుదురుభాగం, గడ్డం చాలా సన్నగా ఉండి.. బుగ్గల్లో ఎముకలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా ఉన్నవాళ్లది డైమండ్ షేప్ ఫేస్. కొద్దిగా వంపులు తిరిగిన కమ్మలు, చిన్న స్టడ్స్, వెడల్పుగా ఉండే.. పొడవాటి ఇయర్ రింగ్స్ నప్పుతాయి. పొడవు కంటే.. వెడల్పు ఎక్కువగా ఉండే చెవి పోగులు బాగా కనిపిస్తాయి.

ట్రైయాంగిల్ షేప్

ట్రైయాంగిల్ షేప్

హార్ట్ షేప్ ఫేస్ కి వ్యతిరేకంగా ఉంటుంది ట్రైయాంగిల్ షేప్ ఫేస్. మీ నుదురు కంటే.. గడ్డం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. ఇలాంటి ముఖాకృతి కలిగిన అమ్మాయిలు బుట్టలు, రౌండ్ గా ఉండే.. స్టడ్స్ అందంగా కనిపిస్తాయి.

ఓవెల్ షేప్ ఫేస్

ఓవెల్ షేప్ ఫేస్

మీ నుదురు భాగం మరీ వెడల్పుగా లేకుండా ఉండే మీది ఓవెల్ షేప్ ఫేస్. ఇలాంటి ముఖాకృతి కలిగిన వాళ్లకు ఎలాంటి ఇయర్ రింగ్స్ అయినా చాలా ఎట్రాక్టివ్ గా ఉంటాయి. డ్రాప్స్, స్టడ్స్, డాంగ్లర్స్ ఇలాంటి ఫేస్ షేప్ ఉన్నవాళ్లకు బాగా కనిపిస్తాయి.

English summary

Pick Right Type Of Earrings According To Your Face Shape

Earrings sometimes work as the fashion saviours that not just completes, but complements almost any outfit or look. Having the perfect set of earrings can make you look like a diva.
Story first published: Monday, December 21, 2015, 13:28 [IST]
Desktop Bottom Promotion