For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

High Heels: హై హీల్స్ తో ఇబ్బందిగా, నొప్పిగా ఉందా.. ఈ చిట్కాలు పాటించండి

హీల్స్ వేసుకోవాలనుకునే వారి కొన్ని చిట్కాలు పాటిస్తే హీల్స్ ధరించి అందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.

|

High Heels: ఆడవాళ్లు అందంగా కనిపించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని తెలిసిందే. ఔట్ లుక్ బాగుండాలని చాలా తాపత్రయపడుతుంటారు. తల నుండి అరికాళ్ల వరకు ప్రతీది తమకు నచ్చిందే, తమకు సూట్ అయ్యేదే ఉండాలని పట్టుపట్టి మరీ వేసుకుంటారు. అయితే కొన్ని అధ్యయనాల ప్రకారం ఆడవాళ్లు ఎదుటివారిలో మొదట గమనించేది కాళ్లు, చెప్పులేనట. అందుకే వాళ్లు చెప్పులను ఏరికోరి కొంటారు.

How to Wear High Heels Without Pain in telugu

హై హీల్స్ వేసుకోవడాన్ని చాలా మంది ఇష్టపడతారు. దాని వల్ల పర్ఫెక్ట్ లుక్ వస్తుందని అనుకుంటారు. కానీ హీల్స్ వేసుకుంటే కాళ్లు నొప్పి పెడుతున్నాయని కంప్లైంట్ చేస్తుంటారు. అయితే హీల్స్ వేసుకోవాలనుకునే వారి కొన్ని చిట్కాలు పాటిస్తే హీల్స్ ధరించి అందంగా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండవచ్చు.

1. కరెక్టు సైజ్ హీల్స్ ధరించాలి

1. కరెక్టు సైజ్ హీల్స్ ధరించాలి

చాలా మంది మహిళలు చేసే తప్పు ఏమిటంటే.. వారికి కాలికి కరెక్టుగా సరిపోయే షూ సైజ్ ను ఎంచుకోకపోవడం. పాదాల పరిమాణం మారుతుంది. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత పాదాల పరిమాణంలో మార్పులు వస్తాయి. వాటిని గమనించి షూ సైజును ఎంచుకోవాలి. మీరు బూట్లు కొనుగోలు చేస్తున్నప్పుడు వెడల్పు, పొడవు కొలిచి షూను ఎంచుకోవాలి.

2. మీ కాళ్ల రకంపై అవగాహన పెంచుకోవాలి

2. మీ కాళ్ల రకంపై అవగాహన పెంచుకోవాలి

మీ పాదాల రకాన్ని తెలుసుకోండి. మీరు పాడియాట్రిస్ట్ వద్దకు వెళ్లలేకపోతే, మీకు ఫ్లాట్ ఫుట్ లేదా హై-ఆర్చ్ ఫుట్ ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని చక్కని మార్గాలు ఉన్నాయి. మీ పాదాలను తడిపి కాగితంపై అడుగు పెట్టండి. మీరు ఒక ముద్ర వేసినప్పుడు, మీ పాదం ఎంత చదునుగా ఉందో లేదా మీరు ఎంత ఎత్తులో వంపుని కలిగి ఉన్నారో అది మీకు చూపుతుంది. మీరు ఒక వ్యక్తి యొక్క పాదాల రకాన్ని చూడవచ్చు.

3. హీల్ మందంగా ఉండాలి

3. హీల్ మందంగా ఉండాలి

సన్నగా ఉండే హీల్స్ ను ఎంచుకోవద్దు. స్టిలెట్టోస్ ఎంచుకోకపోవడమే ఉత్తమమైనది. అవి పాదాలపై విపరీతమైన ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని డ్రెస్సులపైకి స్టిలెట్టోసే చక్కగా సూట్ అవుతుంటాయి. సన్నని హీల్ ఉండేవి అప్పుడప్పుడు బాగుంటాయి.. కానీ రోజూ వేసుకోవాలంటే మాత్రం ఇబ్బంది తప్పదు. మీరు ప్రతి రోజూ స్టిలెట్టోస్‌ ని ధరిస్తున్నట్లయితే మీరు చంకియర్ హీల్ స్టైల్‌ ఎంచుకోవడం మంచిది.

4. సన్నని సోల్ ఉన్నవి ఎంచుకోవద్దు

4. సన్నని సోల్ ఉన్నవి ఎంచుకోవద్దు

సోల్ సన్నగా ఉంటే అరికాళ్లు నొప్పి పెడతాయి. అరికాళ్ల కింద సోల్ మందంగా ఉండాలి. లేదా ఫ్లాట్ గా ఉండాలి. ఇది మీరు నడుస్తున్నప్పుడు కొంత ఒత్తిడిని భర్తీ చేస్తుంది.

5. విరామాలు తీసుకోండి

5. విరామాలు తీసుకోండి

హీల్స్ పైనే రోజంతా ఉండాల్సి వస్తే వాటిని అప్పుడప్పుడు విడవాలి. అరికాళ్లు, చీలమండలను కాస్తంత మసాజ్ చేయాలి. పాదాలను సాగదీయాలి. వేళ్లను, అరికాళ్ల నొక్కాలి.

6. కాలిని కవర్ చేసే షూ ఎంచుకోవాలి

6. కాలిని కవర్ చేసే షూ ఎంచుకోవాలి

మీ పాదాల పైభాగంలో మీరు ఎంత ఎక్కువ కవరేజీని కలిగి ఉంటే అంత మంచిది. కొన్ని సార్లు హై-హీల్డ్ బూట్లు మీరు రోజంతా ధరించవచ్చు. అవి మీ పాదాలను అంతగా ఇబ్బంది పెట్టవు.

7. షూ ఇన్సర్ట్స్ ప్రయత్నించండి

7. షూ ఇన్సర్ట్స్ ప్రయత్నించండి

షూ వేసుకున్నప్పుడు ఇబ్బందిగా అనిపిస్తే షూ ఇన్సర్ట్స్ ను ప్రయత్నించండి. అవి మీ కాలి ఆకారానికి తగినవి ఎంచుకుంటే, అరికాళ్ల నొప్పుల నుండి బయటపడవచ్చు. షూ ఇన్సర్ట్స్ సాధారణంగా సిలికాన్ జెల్ తో తయార చేస్తారు.

English summary

How to Wear High Heels Without Pain in telugu

read on to know How to Wear High Heels Without Pain in telugu
Desktop Bottom Promotion