For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Diwali Outfits:దీపాల పండుగ వేళ ఈ డ్రస్సులతో మతాబుల కంటే ఎక్కువగా మెరుస్తారు...

|

ఇటీవలే దసరా పండుగ ముగిసింది.. ఇప్పుడు దీపావళి పండుగ వచ్చేస్తోంది. ఈ సమయంలో మహిళలంతా సంప్రదాయ దుస్తులతో తమ రూపాన్ని మరింత మెరుగుపరచుకోవాలని కోరుకుంటారు.

అయితే ప్రతి ఒక్క పండుగ వేళ ఒకే రకమైన డ్రస్సులను వేసుకోవడం చాలా బోరింగ్ గా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్ ముద్దుగుమ్మలు, బుల్లి తెర యాంకర్లు వేసుకున్న ఈ ఎథ్నిక్ వేర్ తో మీ వార్డ్ రోబ్ ని అప్ డేట్ చేయండి.

అయితే ప్రస్తుతం పండుగ సీజన్ కావడంతో మార్కెట్లో కొత్త కొత్త రకాల డ్రస్సులు, వెరైటీలు వచ్చేస్తున్నాయి. అయితే అక్కడ ఎన్ని రకాలున్నా.. మగువలకు ఎలాంటి డ్రస్సులు నచ్చుతాయో.. ఏవి బాగుండవు అనే విషయాలు తెలీక ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఈ నేపథ్యంలో ఈ దీపావళికి మీరు వేసుకునే అద్భుతమైన డ్రస్సుల గురించి.. కొత్త కొత్త మోడల్స్ గురించి మేం ఓ జాబితా తయారు చేశాం. సంప్రదాయ బద్ధంగా కనిపిస్తూనే దీపావళి వెలుగుల్లో, పార్టీల్లో, ఇతర వేడుకల్లో మెరిసిపోవాలనుకున్నవారు ఈ రకమైన డ్రస్సులను ఎంపిక చేసుకోవచ్చు.

కంగనా అందమైన చీర కట్టు..

కంగనా అందమైన చీర కట్టు..

మన దేశంలో ఏ పండుగ వచ్చినా సంప్రదాయంగా కనిపించేందుకు ప్రతి ఒక్క మహిళ చక్కని చీర కట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఇక చీరల్లో కంచి పట్టుకు చీర మరొకటి లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. కంగనా కట్టుకున్న ఈ చీరలో మీరు నిజమైన తారలా మెరిసిపోతారు. ఇది చాలా గ్రాండ్ గా మరియు సౌకర్యవంతంగా కనిపిస్తుంది. ఈ చీరలు రక రకాల కలర్లో లభిస్తుంది. కాబట్టి మీ బడ్జెట్ ని బట్టి ఈ రకమైన చీరను సెలెక్ట్ చేసుకోండి.

రకుల్ సింపుల్ శారీ..

రకుల్ సింపుల్ శారీ..

కొండ పొలం భామ రకుల్ ప్రీత్ సింగ్ కట్టుకున్న చీరలోనూ గ్రాండ్ గా మరియు సౌకర్యవంతంగా కనిపించొచ్చు. సాధారణ చీరను లేదా కుచ్చిళ్లు పెట్టే విధానం మార్చి కట్టుకునే చీర రకం ఇది. ఈ చీరను ధరిస్తే దీపాల మాదిరిగా వెలిగిపోతారు. అయితే లావుగా ఉన్న వారికి మాత్రం ఇది అంతగా సెట్ కాదనే చెప్పొచ్చు. అయితే పండుగ వేళ లేదా ఏదైనా వేడుకలకు ప్రత్యేకంగా కనిపించాలంటే మాత్రం ఈ తరహా చీరకట్టును సెలెక్ట్ చేసుకుని దానికి తగ్గట్టు సింపుల్ జ్యువెలరీ రెడీ అయితే చాలా అందంగా కనిపిస్తారు.

రష్మీ ప్యాంట్ సూట్..

రష్మీ ప్యాంట్ సూట్..

ఈ కాలం అమ్మాయిలు మోడ్రన్ గా ఉండానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే చీరల స్థానంలో ప్యాంట్ సూట్ వంటివి వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి డ్రస్సులు కార్పొరేట్ పార్టీలకు, ఏదైనా ముఖ్యమైన మీటింగులకు వేసుకోవడానికి బాగా నప్పుతుంది. అయితే అచ్చం సూట్ లా కనిపిస్తూనే చుడీదార్ లుక్ ను గుర్తుకు తెచ్చేలా ఇండియన్ ప్యాంట్ సూట్ ని ఎంచుకోవచ్చు. ఈ తరహా డ్రస్సులను ఆఫీసుకు సంబంధించి ఏమైనా దీపావళి వేడుకల్లో పాల్గొంటుంటే.. ఇలాంటివి సెలెక్ట్ చేసుకోవడం మంచిగా ఉంటుంది.

ఇండో వెస్ట్రన్ లెహంగా..

ఇండో వెస్ట్రన్ లెహంగా..

సంప్రదాయ దుస్తుల విషయానికొస్తే.. లెహంగా గురించి మాట్లాడకుండా ఉండలేం. అయితే క్లాసిక్ లెహంగా ధరించే బదులు ఇండో-వెస్ట్రన్ లెహంగా ధరిస్తే మీ లుక్ మరింత ప్రత్యేకంగా మారిపోతుంది. మీరు ఈ దీపావళికి కత్తిరించిన ఆఫ్ షోల్డర్ బ్లౌజ్ తో లేదా అందమైన పెప్లమ్ టాప్ తో పొడవాటి లెహంగాను ట్రై చేయొచ్చు. దీని వల్ల మీ రూపం మరింత పెరిగిపోతుంది.

వెస్ట్రన్ దుస్తుల్లోనూ..

వెస్ట్రన్ దుస్తుల్లోనూ..

దీపావళి వేళ కేవలం భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే కాదు.. వెస్ట్రన్ డ్రస్సుల్లోనూ అందంగా కనిపించొచ్చు. జబర్దస్త్ జడ్జి రోజా, రష్మీ వేసుకున్న ఈ డ్రస్సుల్లో మీరు మరింత అందంగా కనిపించొచ్చు. కొంచెం లావుగా ఉండే వారు కూడా ఇలాంటి డ్రస్సులను వేసుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీని వల్ల మీరు చాలా అందంగా కనిపించొచ్చు. కాబట్టి ఈ పండుగ వేళ ఇలాంటి డ్రస్సులను సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిది.

దుస్తులతో పాటు..

దుస్తులతో పాటు..

దీపావళి వేళ కేవలం అందమైన డ్రస్సులు మాత్రమే వేసుకుంటే సరిపోదు. అందుకు తగ్గట్టు మ్యాచింగ్ యాక్సెసరీస్ కూడా ధరించడం చాలా ముఖ్యం. అప్పుడే మీ లుక్ కంప్లీట్ గా అందంగా కనిపిస్తుంది. యాంకర్ శ్రీముఖి వేసుకున్న ఈ డ్రస్సును చూడండి. ఈ డ్రస్సుకు తగ్గట్టు తను చెవులకు పెద్ద రింగులను జత చేసింది. చూడటానికి కొంచెం బొద్దుగా ఉన్నప్పటికీ చాలా అందంగా కనిపిస్తుంది.

All Images Credited to Twitter

English summary

Tollywood Actresses Inspired Ethnic Outfit Ideas For Diwali in Telugu

Here are the tollywood actresse inspired ethnic outfit ideas for diwali in Telugu. Take a look