నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ లో అదిరిపోయిన లుక్స్ తో తారలు

Subscribe to Boldsky

నిన్న రాత్రి ముంబైలోని జెడబ్యూ మారియట్ హోటల్ లో నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ 2018 ఫంక్షన్ జరిగింది.

ఈ గ్లామరస్ వేడుకలో చాలామంది బాలీవుడ్ తారలు తమ మేటి లుక్స్ లో దర్శనమిచ్చి,ఆ వేడుకకే వన్నె తెచ్చి తళుక్కుమన్నారు. అంతమందిలో ఎవరు ఎక్కువ అందంగా ఉన్నారో తేల్చడం చాలా కష్టమైంది ఎందుకంటే ప్రతిఒక్కరూ అద్భుతంగా తయారయ్యారు.

నైకా ఫెమినా బ్యూటీ అవార్డ్స్ లో మేటిగా తయారయినవారు చాలా మందే ఉన్నారు.

1. ఆకర్షించారు

1. ఆకర్షించారు

కానీ వారిలో కూడా, కొంతమంది మా కళ్ళను ఆకర్షించారు, అందుకే వారి గురించి మీకు తెలపకుండా ఉండలేకపోతున్నాం. ఈ గ్లామర్ నిండిన రాత్రి, రెడ్ కార్పెట్ లుక్స్ లో అలరించిన కొంతమంది సెలబ్రిటీల లుక్స్ ను మీకు లిస్టుచేసి అందిస్తున్నాం, చదివి ఎంజాయ్ చేయండి.

2. ఐశ్వర్యారాయ్ బచ్చన్; రెడ్ కార్పెట్ యువరాణి

2. ఐశ్వర్యారాయ్ బచ్చన్; రెడ్ కార్పెట్ యువరాణి

ఐశ్వర్యారాయ్ మనల్ని 90'ల నుంచి నోటమాట రానివ్వకుండా చేస్తూనే ఉంది మరియు ఇప్పుడు కూడా ప్రతిసారీ తను కన్పించినప్పుడల్లా, అది క్యాజువల్ లుక్ అయినా సరే, రెడ్ కార్పెట్ లుక్ అయినా సరే, ఒకేలాగా అలరిస్తోంది. ఈ సారి కూడా తన సెక్విన్ రెడ్ కార్పెట్ ప్రత్యేక దుస్తుల్లో ఆమె చాలా అందంగా మెరిసిపోయారు.

ఆమె లేబర్ జోయిసి వారి నలుపు మరియు బీజ్ షేడ్ ఉన్న సెక్విన్ బాల్ గౌన్ ను ధరించి రాజరిక దివా లాగా ఠీవిగా ఉన్నారు. ఆమె పట్టాభిషేకం జరిగేముందు ఉత్సవానికి విచ్చేసిన యువరాణిలాగా కార్పెట్ పై నడుచుకుంటూ వచ్చారు.

3. అదితిరావు హైదరి; మారువేషంలో దేవత

3. అదితిరావు హైదరి; మారువేషంలో దేవత

అదితిరావు హైదరిలో ఉన్న సహజ కరిష్మా ఏ స్టైల్ ను అనుసరించినా ఆమెను కన్నులపండువగానే కన్పించేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ స్టైల్ లో, ఆమె ఒక దేవతలాగానే అందంగా కన్పిస్తోంది.శ్రియా సోం సెక్విన్ తెల్లని దుస్తుల్లో మొత్తం శరీరం చుట్టూ అల్లుకుని ఉన్న ఎంబెలిష్ ఫర్ లో ఆమె చాలా స్టైలిష్ గా కన్పించింది.

4.దిశా పటానీ; ధైర్యంగా తయారయిన దివా

4.దిశా పటానీ; ధైర్యంగా తయారయిన దివా

దిశా మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక భుజం ఉన్న గౌన్ లో అలరించారు. ఈ డ్రస్ కి టుల్లె బేస్ ఉండి,డ్రస్ మొత్తం బంగారు సెక్విన్ ఎంబ్రాయిడరీ ఉంది.దానికి ఉన్న లెనిన్ ఛాతీ భాగంలో కవరింగ్ లాగా వచ్చి, పొడుగ్గా వదిలేసిన స్లీవ్ నేలమీద పారాడుతూ ఉందిఃదిశా చాలా అందంగా మరియు సెక్సీగా కూడా ఉన్నది.

కియారా అద్వానీః పేస్టెల్ రంగుల రాణి

5. కియారా రెండు రకాల పేస్టెల్ షేడ్లున్న డ్రస్ వేసుకున్నారు.

5. కియారా రెండు రకాల పేస్టెల్ షేడ్లున్న డ్రస్ వేసుకున్నారు.

ఈ డ్రస్ శుభిక డిజైన్ చేసిన పాపా డోన్ట్ ప్రీచ్ వారిది. దీనితో టయర్డ్ టుల్లెట్ స్కర్టు మరియు క్రాప్డ్ స్ట్రాప్ లెస్ బికినీ టాప్ వచ్చింది. ఈ ప్రత్యేకమైన డ్రస్ ను కియారా ధరించి చాలా హుందాగా కన్పించారు.

6. ఎవెలిన్ శర్మ; ఫ్రిల్స్ మరియు క్రీమ్ తో ఆటలు

6. ఎవెలిన్ శర్మ; ఫ్రిల్స్ మరియు క్రీమ్ తో ఆటలు

ఎవెలిన్ ఫ్రిల్సన్ ద బార్డోట్ స్లీవ్స్ మరియు నడుం దగ్గర పట్టీ ఉన్న సాదా క్రీమ్ కలర్లో అందమైన షీత్ గౌన్ వేసుకున్నారు. ఈ గౌన్ తో పాటు వేలాడుతున్న ఇయర్ రింగ్స్ మరియు పేస్టెల్ రంగులున్న హీల్స్ ను ధరించారు. ఈ రకమైన స్టైలింగ్ తో ఆమె చాలా అందంగా మరియు హుందాగా కన్పించారు.

7. కృతి కర్బందా

7. కృతి కర్బందా

ఈ అందమైన టివి నటి, కృతి కర్బందా తన స్టైల్స్ తో అలరించడం ఎప్పుడూ ఆపరు. ఈ రెడ్ కార్పెట్ కార్యక్రమంలో కూడా, ఆమె తన స్టన్నింగ్ లుక్ తో అందంగా కన్పించారు. ఆమె లేబుల్ డి పేస్టెల్ గ్రీన్ టుల్లె గౌన్ మరియు ట్రెస్ మోడ్ వారి హీల్స్ ధరించారు. ఆమె ఇందులో చాలా సెక్సీగా మరియు అందంగా కూడా కన్పించారు.

8. అదా శర్మ; యాటిట్యూడ్ ఉన్న సూపర్ హీరోయిన్

8. అదా శర్మ; యాటిట్యూడ్ ఉన్న సూపర్ హీరోయిన్

అదాశర్మ తన రెడ్ కార్పెట్ లుక్ ను ఇతరులతో పోల్చలేనంత అందంగా తయారయ్యారు. రెడ్ కార్పెట్ కార్యక్రమాలలో తెల్ల గౌన్స్ ఎప్పుడూ అనాదరణకి గురౌతాయి. కానీ అదా తన యాటిట్యూడ్ తో కూడిన సూపర్ హీరోలాంటి అవతారంలో కన్పించారు. ఆమె జూమ్ బర్గ్ వారి నల్లని సెక్విన్ ప్రింటెడ్ ప్లంజ్ షర్ట్ డ్రెస్ ధరించారు. ఆమె రివర్ ఐలాండ్ నుంచి ఛాంబ్రే జాకెట్ మరియు టాప్ షాప్ చాంబ్రే వారి థైస్ ఎత్తువరకు వచ్చే బూట్లను ధరించారు.

ఆమె పింక్ రంగులోని జుట్టు తన సెక్సీ సూపర్ హీరో అవతారానికి సరిపోయింది. నిజానికి, ఆమె హార్లే క్విన్ యొక్క భారతీయ వర్షన్ లాగా కన్పించారు.

9. మలైకా అరోరా

9. మలైకా అరోరా

మలైకా ఆంటోనియో రివా మిలానో వారి సాటిన్ ఒక భుజం ఉన్న నీలి గౌన్ ధరించారు. దానికి చెదిరివున్న మెడ మరియు చిన్న వేలాడుతున్న గుడ్డ ఉన్నది. ఆమె ఆ డ్రస్ కు ఫరాఖాన్ వరల్డ్ వారి నగలు మరియు ఈ అద్భుతమైన స్టైలింగ్ ను మనేకా హరిసింఘానీ చేసారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Aishwarya's Royal Look To Adah's Superhero Avatar; Best From The Nykaa Femina Beauty Awards

    Sometimes, shaving and other forms of hair removal that we use may lead to painful bumps on the body. These bumps grow because your hair gets stuck under your skin while it is growing back. Apart from being unsightly, these bumps can really be painful and at times itchy, especially if they grow in the pubic area.
    Story first published: Saturday, February 17, 2018, 15:00 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more