నల్ల చీర ఎప్పటికీ సెక్సీ లుక్ ఇవ్వగలదని నిరూపించిన కత్రినా కైఫ్

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky
Katrina Proves, Black Saree Is Forever Sexy!

అనేక మంది బాలీవుడ్ తారల అందాలకు చిరునామా అయిన ఇన్స్టాగ్రామ్ లో కత్రినా కైఫ్ చాలా ఆలస్యంగా చేరినా, అతి తక్కువ సమయంలోనే ఇన్స్టాగ్రామ్ స్టార్ గా వెలిగిపోతుంది.

ఆమె ఇన్స్టాగ్రామ్, చూపరుల గొంతు తడారిపోయేలా చేయడమే కాకుండా, తన ఉల్లాసవంతమైన శీర్షికలతో ఇన్స్టాగ్రామ్ లోనే కొత్త ఒరవడి సృష్టించేలా తయారయింది. బాంబ్ షెల్ గా పిలవబడే కత్రినా కైఫ్ పోస్ట్ చేసిన ఒక పిక్చర్లో ఎంతో అందంగా ఆకర్షణీయంగా కనిపించి అభిమానుల కళ్ళకు నిద్ర లేకుండా చేసింది అనడంలో అతిశయోక్తి లేదు.

Katrina Proves, Black Saree Is Forever Sexy!

నల్లచీరని సగం బుజానికి ధరించి, ప్లంగ్ నెక్ జాకెట్ (డీప్ వి-నెక్)లో ఎంతో అందంగా సెక్సీగా కెమరాకు పోజిచ్చిన ఈ ఎక్ థా టైగర్ హీరోయిన్ ఇన్స్టాగ్రామ్లో ఉన్న మిగిలిన తారలను వెనక్కి నెట్టే పనిలో ఉన్నట్లుగా తోస్తుంది.

అనేక ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసినా, ఇలా జనాల్లో కిక్కెక్కించిన ఫోటో మాత్రం ఇదే. కత్రినా కైఫ్ ఇన్స్టాగ్రామ్ లో రెగ్యులర్ పోస్ట్స్ చేస్తుంది, తద్వారా తన 10 మిలియన్ ఫాలోవర్లను ఎలా నిర్వహించాలో ఒక అవగాహన కలిగి ఉంది అని వేరే చెప్పనవసరం లేదు.

అదే జ్యూయలరీ కంపెనీ నుండి వచ్చిన మరో ఫోటోషూట్లోని ఫోటో మీకోసం.

Katrina Proves, Black Saree Is Forever Sexy!

ఆమె శోభాయమానంగా కనపడడం లేదా?

ఈమధ్యనే కత్రినా కైఫ్ ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కు ఆమోదం తెలిపింది. కొన్ని నమ్మదగిన మూలాలు మరియు వెబ్సైట్ల ప్రకారం, ఈ 34 ఏళ్ళ అందాల తార, తన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాన్ని రచించనుందని తెలుస్తుంది.

నివేదికల ప్రకారం ఈ పుస్తకం పేరు బార్బీ డ్రీమ్స్ అని ఉండనుంది. నిజానికి బార్బీ డాల్ బొమ్మకి మన దేశం నుండి ఎంపికైన మొదటి తారగా కత్రినా ఉంది. మరియు ఈ పుస్తకంలో కత్రినా బాల్యం నుండి తాను తిరిగిన ఇతర దేశాల అనుభవాలతో పాటు, బాలీవుడ్లో తన మొదటి దశకంలో ఎదుర్కొన్న సమస్యలు కూడా పొందుపరచనున్నట్లు తెలుస్తుంది.

ఈ బయోగ్రఫీ ఖచ్చితంగా నలుగురికి ప్రేరణ ఇచ్చేలా ఉంటుంది అనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు.

English summary

Katrina Proves, Black Saree Is Forever Sexy!

Katrina posted a picture on Instagram from one of her photoshoots and she looks smoking hot! Clad in a black saree and off-shoulder, plunge neck blouse, the 'Ek Tha Tiger' actress is seen giving the sexiest pose for the camera. Well, as all of us know, this is not the first time Katrina has posted a sultry picture on Instagram.