ప్రియాంక చోప్రా అలెక్స్ పారిష్ పాత్రలో ధరించిన స్టైల్స్ అదుర్స్

By: Deepthi
Subscribe to Boldsky

మీరు ప్రియాంక చోప్రా అదే మన అలెక్స్ పారిష్ పాత్రలో ఈ శీతాకాలం ధరించిన స్టైల్స్ ను చేరాల్సిన గోల్స్ గా అనుకోకపోతే, మీకసలు ఫ్యాషన్ గురించే తెలీదు!

మనం అబ్బా ఇలాంటివి ఎప్పటికైనా వేసుకోగలగాలి అనే స్టైల్స్ గోల్స్ చాలామంది నటీమణులు మనకు ఏర్పరచటం చూసాం; కానీ శీతాకాలం స్టైల్స్ కు వచ్చేసరికి క్వాంటికో సీజన్ 3 లో అలెక్స్ పారిష్ పాత్ర పోషిస్తున్న ప్రియాంకా చోప్రా తీరే వేరు.

మనకెంతో ఇష్టమైన పీసి న్యూయార్క్ లో తన సిరీస్ షూటింగ్ లో ధరించిన దుస్తులు ఈ చలికాలంలో అద్భుతమైన స్టైల్స్ గా నిలిచాయి. న్యూయార్క్ లో ఎముకలు కొరికే చలికి తగ్గట్టుగా, ప్రియాంక కొన్ని అద్భుతంగా డిజైన్ చేసిన లుక్స్ లో కన్పించారు, ఇవి ఏ అమ్మాయినైనా అసూయపడేలా చేస్తాయి.

న్యూయార్క్ లో ప్రియాంక అలరించిన కొన్ని స్టైల్స్ మీకోసం ఇక్కడ అందిస్తున్నాం, మీరు కూడా మీ చలికాలాన్ని అందంగా మార్చుకోండి.

కొంచెం రంగు

కొంచెం రంగు

ఈ లుక్ లో, ప్రియాంక ఎర్రని గ్రాఫిక్ ప్రింటెడ్ స్వెట్ షర్టును అడ్డదిడ్డంగా గీతలున్న ఒకే రంగు జాకెట్, చిరిగినట్లున్న జీన్స్, స్యూడె బూట్లు మరియు ప్రింటెడ్ ఊలు బీనీ క్యాప్ తో కలిపి ధరించారు. అరె ఆగండి! ఈ లుక్ క్లాసీగా ఉన్న నల్ల క్యాట్ ఐ కళ్లద్దాలతో పూర్తయింది.

మొత్తం పెర్మింగే

మొత్తం పెర్మింగే

ప్రియాంక ఈ అద్భుతమైన లుక్ తో కొన్నిరోజుల క్రితం మనల్ని ఆశ్చర్యపోయేలా చేసారు. ఆమె పొడవైన గ్రాఫిక్ టీషర్టును, మౌవె జాకెట్, మరియు పొడవు బూట్లతో ధరించారు. ఈ లుక్ తన పొట్టి జుట్టును పెర్మింగ్ చేయించుకోటంతో మరింత హాట్ గా మారింది. ఈ చలికాలంలో పీసి కన్పించిన సెక్సీయెస్ట్ అవతారాలలో ఇదొకటి.

ఊసరవెల్లి మానియా

ఊసరవెల్లి మానియా

చాలామందికి ఈ ఊసరవెల్లి ప్రింట్ల ట్రెండ్ ఇప్పటికే పాకి,కొన్ని నెలలుగా బాలీవుడ్ స్టైల్ ట్రెండ్ గా కూడా కొనసాగింది. ప్రియాంక ఈ క్లాసీ మరియు ఆత్మవిశ్వాసంతో కన్పించే లుక్ ను ఒక కార్యక్రమానికి ధరించారు, తను ఊసరవెల్లి ప్రింట్ ప్యాంట్లను, క్రౌ-నెక్ టాప్ మరియు ఆలివ్ గ్రీన్ జాకెట్ తో కలిపి వేసుకున్నారు. మంచువర్షాన్ని ఆనందిస్తున్న ఆమె చెవులకి కఫ్స్ అందంగా మెరిసి మిగతా లుక్ కి చక్కగా సరిపోయాయి.

పెద్ద సైజు కామోఫ్లాజ్ ప్రింట్

పెద్ద సైజు కామోఫ్లాజ్ ప్రింట్

ప్రియాంక ఈ పెద్దసైజు అవతారాన్ని ఫర్ఫెక్ట్ గా ధరించి అందర్నీ అబ్బురపరిచింది. క్రౌ నెక్ నల్ల స్వెట్ షర్టు మరియు బీజ్ ట్రౌజర్లపై పీసి ఊసరవెల్లి రంగుల ప్రింట్ ఉన్న జాకెట్, నల్ల బూట్లు మరియు గుండ్రటి కళ్లద్దాలు ధరించారు. ఈ లుక్ చాలా సెక్సీగానే ఉంది.

డిస్ట్రెస్ జీన్స్ తో హాట్ నెస్ పెరిగిపోయిందా?

డిస్ట్రెస్ జీన్స్ తో హాట్ నెస్ పెరిగిపోయిందా?

ప్రియాంక ఈ చలికాలంలో వివిధ లుక్స్ తో హాట్ నెస్ స్థాయిలన్నీ ఈ లుక్ తో సహా దాటేసారు.ఈ లుక్ లో డిస్ట్రెస్డ్ జీన్స్ ను నల్లటి లెదర్ జాకెట్ మరియు నల్లని స్వెట్ షర్ట్ తో కలిపి సెక్సీగా ధరించారు. స్యూడె బూట్లు మరియు గుండ్రటి కళ్ళద్దాలు ఈ లుక్ ను మరింత హాట్ గా మార్చేసాయి. క్వాంటికో షూట్ లో ఈ లుక్ తో ఆమె మెరిసారు, మనకు చాలా నచ్చింది కదా.

English summary

Priyanka Chopra Setting Winter Style Goals

We have seen many actresses setting style goals to us; but when it comes to winter style goals, Priyanka Chopra playing the character of Alex Parrish in Quntico Season 3 takes the cake. Our beloved PeeCee has donned some amazing winter-style books while shooting for her series in New York.
Subscribe Newsletter