Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
అమ్మో! విలక్షణ నటుడు రణవీర్ సింగ్ జుట్టు పిలక అవతారాన్ని చూస్తే షాకవ్వాల్సిందే..
ఐఫా అవార్డ్స్ 2019లో పద్మావత్ సినిమాలో విలన్ గా నటించిన తర్వాత మరోసారి బయట కూడా అలాగే కనిపించే ప్రయత్నం చేశాడు.
బాలీవుడ్ విలక్షణ నటుడు, హీరో, పొడుగు కాళ్ల సుందరీ దీపికా పదుకొనే భర్త రణవీర్ సింగ్ సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో చాలా వినూత్నంగా ఉండి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాడు. అలాగే దీపికాను కూడా మాయ చేసి పెళ్లి చేసుకున్నాడని బాలీవుడ్ లో టాక్. దీపికాతో వివాహం అయ్యాక ఈ నటుడు ఇంతవరకు ఎక్కడా వినూత్నంగా కనిపించలేదు.

పెళ్లి అయిన తర్వాత ఎక్కడికి వెళ్లినా అందరిలాగే చాలా పద్ధతి సూటు, బూటు వేసుకుని వెళ్లేవాడు. అంతలో ఏమయిందో తెలీదు కానీ మళ్లీ తన వేషం మార్చేశాడు. ఆ వేషం గురించి తెలుసుకునేందుకు కిందికి స్క్రోల్ చేయండి.

అందరి చూపు తన వైపు..
ఐఫా అవార్డు 2019లో బాలీవుడ్ అగ్ర తారలంతా ఇటీవల అందరినీ అలరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ హీరోయిన్లే తమ అందచందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ల మతి పోగొట్టారు. సరిగ్గా ఈ తరుణంలో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్.

ఆకట్టుకునే ప్రయత్నం..
ఐఫా అవార్డ్స్ 2019లో పద్మావత్ సినిమాలో విలన్ గా నటించిన తర్వాత మరోసారి బయట కూడా అలాగే కనిపించే ప్రయత్నం చేశాడు. ఆ సినిమాలో కనిపించినంత భయంకరంగా కాదులేండి. ఇక్కడ మాత్రం కొంచెం ఆకట్టుకునేందుకే ప్రయత్నించాడు.

చమత్కారమైన అవతారం..
ఇక తన ట్రెండీ ఫ్యాషన్ దుస్తులతో ఎప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచే రణవీర్ ఈసారి కూడా అలాగే చేశాడు. తన దుస్తులతో పాటు తన వేషధారణను పూర్తిగా మార్చేశాడు. ఏకంగా జుట్టు పిలక అవతారం కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.
రణవీర్ దుస్తులను పరిశీలిస్తే..
రణవీర్ తన కొత్త సూటు, బూటు అవతారంతో అందరికీ మాటలు లేకుండా చేశారు. తన బ్రాండ్ ప్రీఫాల్ 19 నుండి సేకరించాడు. బూడిద రంగు గల ప్యాంటు, బ్లేజర్ తో పాటు బ్లాక్ షూస్ తో అతని వేషధారణ నిర్మాణత్మకంగా కనబడింది. వాటితో పాటు ధగధగ మెరిసే ఓ రెడ్ కలర్ శాలువను తన శరీరంపై వేసుకున్నాడు. ఇది తన అందాన్ని మరింత పెంచింది. ఇలా కొత్త స్టైల్ తో అదరగొట్టాడు.
అదనపు మెరుగులు..
తన దుస్తులకు తగ్గట్టు అతని రూపానికి సరిపడా బంగారు గొలుసు ధరించాడు.బ్లాక్ గ్లాసెస్ తో మరింత అందంగా కనిపించాడు. ఇంకా చిన్నహూప్ చెవిరింగులను ధరించాడు. ఇక అందరి చూపు అతని కేశాలంకరణ వైపు ఉందని మీరు అనుకుంటున్నారా? అది చూసి జీర్ణించుకోవడం కష్టమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ బాక్స్ లో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
