Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
సోనమ్ మరియు ఆనంద్ రిసెప్షన్ వేడుకలో తమ వస్త్రాలంకరణతో ఉన్నత ప్రమాణాలను నిర్వచించారు
సోనమ్ తన్న వివాహ మహోత్సవానికి ఎర్రని సంప్రదాయ దుస్తులలో మెరిపించి, మైమరపించి ఎవరినీ చూపు మరల్చుకోనివ్వలేదు. నిన్నటి నుండి శ్రీమతి ఆహూజాగా పిలిపించుకుంటున్న, ఈ బాలీవుడ్ సొగసుకత్తె తన రిసెప్షన్ కు ఆధునిక సోబగులద్దిన లెహెంగా ధరించింది. ఏదేమైనప్పటికీ ఆమె పాశ్చాత్య వస్త్రసరళిని అనుసరించక, భారతీయతను ప్రతిబింబించే దుస్తులకే ప్రాముఖ్యతను ఇచ్చింది.
ఆమె ధరించిన లేహంగా చూపులకు పేలవంగా ఉన్నప్పటికీ, ఆధునికత కొట్టొచ్చినట్లు ఉంది. ఆమె ఆ దుస్తులలో తన భర్తతో కలిసి ముంబైలోని, ది హోటల్ లీలలో అడుగుపెట్టినప్పుడు, వారిని చూసిన ఆహూతులందరూ ముచ్చటైన జంట అనే భావన పొందారు. మెహెంది వేడుకలో వలె ఇద్దరి దుస్తులలో రంగులు సమన్వయం కలిగి ఉన్నాయి.

ఈ "ప్యాడ్ మ్యాన్" నటి సాధారణంగా ప్రతిఒక్కరూ మూసధోరణిలో ధరించే సెక్విన్లు, మెరుపుల- జిలుగుల దుస్తులను కాక గ్రే ఛాయలలో ఉండే గ్రాఫిక్ చేవ్రోన్ లెహెంగాను ఎంచుకుంది. దీనికి జతగా వేసుకున్న తెలుపు మరియు బంగారు రంగులున్న దుపట్టా, ఆమె వస్త్రాలంకరణకే వైభవోపేతమైన శోభను తెచ్చిపెట్టింది.
మరొకపక్క వరుడు ఆనంద్, నల్లని బంధ్ గలా షేర్వాణికి జతగా స్నీకర్స్ ధరించడం విశేష అంశంగా వార్తలకెక్కింది. అతను ఒక ఉన్నతవర్గానికి చెందిన భారతీయ వరుడు పాటించే వస్త్రధారణ ప్రమాణాలను మించిపోయాడనడంలో అతిశయోక్తి లేదు. అతని వస్త్రధారణ గంభీరత్వం మరియు సాదాసీదాతనాల సమ్మేళనంలా అనిపించింది.

సోనమ్ మరియు ఆనంద్ తమ వస్త్రధారణకు జతగా ధరించిన ఆభరణాలు కూడా విశిష్టతతో వైవిధ్యంగా ఉన్నాయి. సోనమ్ నిండైన కంఠ ఆభరణం ధరిస్తే, ఆనంద్ అందమైన బ్రూచ్ ను తన కుర్తాకు తగిలించుకున్నాడు.
ఫ్యాషన్ పరంగా చూస్తే, ఈ నూతన జంట వస్త్రాలంకరణ ప్రమాణాలు శిఖరాలను అధిరోహించాయనేనే చెప్పాలి. ఇది వారి సమిష్టి జీవితానికి శుభారంభం. మనందరం ఈ జంటకు బహుమతిగా, ఎప్పటికి ఆనందోత్సాహలతో తులతూగుతూ ఉండాలని కోరుకుంటూ, శుభాకాంక్షలను అందజేద్దాం.



Click it and Unblock the Notifications