For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టైల్ ఐకాన్ శ్రీదేవికి బాలీవుడ్ కెరీర్ స్టైల్ బుక్స్ మీకోసం

|

అతిలోకసుందరి శ్రీదేవి మరణం యావత్ సినీ ప్రపంచాన్ని కలచివేసింది. పరిశ్రమ ఒక గొప్ప టాలెంట్ ను కోల్పోయింది. అలాగే, సౌందర్యరాశిని కోల్పోయింది.

శ్రీదేవి ఎప్పుడూ స్టన్నింగ్ అవుట్ ఫిట్స్ లో అభిమానులను ఆకట్టుకుంటూ ఉండేది. ఆకాలంలో హీరోయిన్స్ అందరికంటే ఫ్యాషన్ పై అమితమైన అవగాహన శ్రీదేవికి ఉందనడం అతిశయోక్తి కాదు. శ్రీదేవి మన ఫెవరెట్ ఫ్యాషనిస్టాగా నిలిచిపోతుంది. తెరమీద గానీ తెరవెనుక గానీ శ్రీదేవి స్టయిల్ అనేది ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునేది.

"జూలీ" సినిమాతో 1975లో బాలనటిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి స్టన్నింగ్ స్టైల్ బుక్స్ తో విశేషదారణ పొందింది. ఇండస్ట్రీని తన అందంతో అభినయంలో ఏలడం ప్రారంభించింది.

శ్రీదేవికి నివాళులు అర్పించడానికి శ్రీదేవి కెరీర్ కి సంబంధించిన ఉత్తమ బాలీవుడ్ చిత్రాల గురించి ఇక్కడ ప్రస్తావించాము. శ్రీదేవి ధరించిన స్టైలిష్ అవుట్ ఫిట్స్ గురించి కూడా ప్రస్తావించాము.

జూలీ(1975)

జూలీ(1975)

టీనేజ్ నుంచే స్టైల్ ను అమితంగా ఫాలో అయ్యేది శ్రీదేవి. జూలీ అనే బాలీవుడ్ మూవీలో బాలనటిగా నటించింది. సింపుల్ స్వేటర్ ని ధరించి మ్యాచింగ్ హెయిర్ రిబ్బన్స్ తో క్యూట్ గా బ్యూటిఫుల్ గా మురిపించింది.

హిమ్మత్వాలా (1983)

హిమ్మత్వాలా (1983)

శ్రీదేవి కెరీర్ లో "హిమ్మత్వాలా" కూడా ఉత్తమ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ సినిమాలో శ్రీదేవి వివిధ రకాల అవుట్ ఫిట్స్ ను ధరించింది. డ్యాన్సర్ అవుట్ ఫిట్స్ కూడా ధరించింది. వీటన్నిటిలో శ్రీదేవి అద్భుతంగా కనిపించింది. అన్ని లుక్స్ ను శ్రీదేవి ఎంతో చక్కగా అందంగా క్యారీ చేయగలిగింది. మ్యాచింగ్ యాక్ససరీస్ తో తన లుక్ కి మరింత మెరుగులు దిద్దుకుంది.

మిస్టర్ ఇండియా (1987)

మిస్టర్ ఇండియా (1987)

ఈ సినిమా అనేది అన్ని వయసుల ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. స్టోరీ లైన్ తో పాటు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్ కూడా ప్రేక్షకుల మన్ననలు పొందింది. "హవా హవాయి" మరియు "కాటే నాహి కాటాటే" సాంగ్స్ ని ఎవరు మరచిపోగలరు. శ్రీదేవి ధరించిన కలర్ఫుల్ మరియు బ్రైట్ అవుట్ ఫిట్స్ గురించి వర్ణించడానికి మాటలు చాలవు. శ్రీదేవి తన లుక్స్ తో ప్రేక్షకులకు మరింత చేరువైంది.

చాందిని (1989)

చాందిని (1989)

శ్రీదేవికి బాలీవుడ్ లో ప్రత్యేకమైన ఇమేజ్ ను తేవడానికి చాందిని సినిమా దోహదపడిందని చెప్పుకోవాలి. ఈ సినిమాలో భాను అతైయా మరియు లీనా దారు డిజైన్ చేసిన వివిధ రకాల అవుట్ ఫిట్స్ ను ధరించింది. ఈ సినిమాలో శ్రీదేవి అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేసినందుకు గాను అథైయకు ఉత్తమ డిజైనర్ అవార్డు లభించింది. నీతా లల్లా ఈ సినిమాలో శ్రీదేవి అవుట్ ఫిట్స్ ను డిజైన్ చేయడంలో సహకారం అందించింది.

చాలబాజ్ (1989)

చాలబాజ్ (1989)

ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించినందుకు శ్రీదేవి ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా కోసం శ్రీదేవి ధరించిన అవుట్ ఫిట్స్ అనేవి ఆమె కెరీర్ లో బెస్ట్ అవుట్ ఫిట్స్ లో ఒకటిగా నిలిచిపోతాయి. ఆఫ్ షోల్డర్ డ్రెసెస్ తో పాటు ఫ్లోరల్ ప్రింటెడ్ శారీస్ ను కూడా ధరించిన శ్రీదేవి తన అందంతో ఆ అవుట్ ఫిట్స్ కే మరింత అందాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమాలో డబుల్ రోల్ పోషించిన శ్రీదేవి ఆయా పాత్రలకు తగిన అవుట్ ఫిట్ లో చక్కగా ఒదిగిపోయింది.

నాగినా (1986 మరియు 1989)

నాగినా (1986 మరియు 1989)

నాగినా సీక్వెల్ లో మరపురాని రోల్ లో శ్రీదేవి చక్కగా అభినయించి ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకుంది. 80లకు చెందిన స్టయిల్ బుక్స్ కి అడ్రెస్ గా నిలిచింది. రాయల్ అవుట్ ఫిట్స్ లో ఒదిగిపోయింది. ఈ మూవీ సీక్వెల్ లో అన్ని రకాల స్టయిల్ బుక్స్ ని ప్రయత్నించింది. ఈ సినిమాలో ట్రెడిషనల్ అటైర్ లో శ్రీదేవి ముచ్చటగా కనిపించిందని అభిమానుల అభిప్రాయం.

లమ్హే (1991)

లమ్హే (1991)

శ్రీదేవి కెరీర్ లో బెస్ట్ మూవీ గా లమ్హేను పరిగణించాలి. ఈ సినిమా 91లో విడుదలైంది. పీరియడ్ స్టైల్ ట్రెండ్స్ తో పాటు శ్రీదేవి వివిధ స్టైల్స్ లలో కనిపించింది. ఈ స్టైల్స్ అనేవి ఇప్పటికీ కూడా అందరికీ గుర్తుంటాయి. 20వ శతాబ్దం స్టైల్ బుక్స్ ను ఎలిగంట్ గా అలాగే స్టయిల్ గా క్యారీ చేసింది అతిలోకసుందరి.

ఇంగ్లీష్ వింగ్లిష్ (2012)

ఇంగ్లీష్ వింగ్లిష్ (2012)

దాదాపు 15 ఏళ్ళ సుదీర్ఘ విరామం తరువాత శ్రీదేవి "ఇంగ్లీష్ వింగ్లిష్" చిత్రంతో మళ్ళీ తన కెరీర్ ను ప్రారంభించింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. మహారాష్ట్ర మహిళగా అద్భుతమైన అవుట్ ఫిట్స్ ను ధరించింది. వివిధ రకాల శారీలను కట్టుకుంది. ప్రింటెడ్ శారీపై ట్రెంచ్ కోట్ ను క్యారీ చేసిన పద్దతి ఫ్యాషనిస్టాలను ఆకట్టుకుంది.

మామ్ (2017)

మామ్ (2017)

అఫీషియల్ గా మామ్ అనేది విడుదలైన శ్రీదేవి ఆఖరి సినిమా. ఈ సినిమాలో శ్రీదేవి విభిన్నమైన పాత్రలో కనిపించింది. మిగతా సినిమాలకంటే ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర వైవిధ్యంతో కూడినది. ఈ మూవీ కోసం శ్రీదేవి సాధారణ షేడ్స్ గలిగిన అవుట్ ఫిట్స్ ను ధరించింది. గ్రే మరియు బ్లాక్ షేడ్స్ ని ధరించింది.

శ్రీదేవి ముందుముందు ఇంకా మరెన్నో విభిన్నమైన పాత్రలలో రకరకాల స్టైల్ బుక్స్ తో ప్రేక్షకులను అలరించి ఉండేది. అయితే, అతిలోకసుందరి అకాల మరణం చిత్రపరిశ్రమతో పాటు ప్రేక్షకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

English summary

Sridevi's Style Evolution In Bollywood

Sridevi's early demise has shocked her worldwide fans and the industry suffers a great loss of a talented and gorgeous epitome of versatility. Sridevi will always remain as one of our favourite fashionistas. We have compiled the best Bollywood movies in Sridevi's career when she got to wear the best outfits and rocked them to the core.
Story first published:Tuesday, February 27, 2018, 18:06 [IST]
Desktop Bottom Promotion