శ్రీదేవి మరణానికి బోనీ కపూర్ మొదటి భార్య మరణానికి సంబంధం అదే

Written By:
Subscribe to Boldsky

తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని అలరించిన అతిలోక సుందరి శ్రీదేవి మరణ వార్త కోట్లాదిమందిని కలిచివేసింది. శ్రీదేవి మరణం తర్వాత ఓ విషయం ఇప్పుడు ఒక విషయం వైరల్ అవుతుంది.

తిరుగులేని హీరోయిన్

తిరుగులేని హీరోయిన్

శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌గా అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అంతసాఫీగా సాగలేదనే చెబుతుంటారు.

బోనీకపూర్ తో పెళ్లి

బోనీకపూర్ తో పెళ్లి

సినీ అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆమె నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. దీనిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

ఆసక్తికర వ్యాఖ్యలు

ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ అంశంపై బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహానికి ముందే బోనీ కపూర్‌కు శ్రీదేవితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు.

పెళ్లికి ముందే గర్భిణీ

పెళ్లికి ముందే గర్భిణీ

బోనీకపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే బోనీకపూర్... శ్రీదేవిని వివాహం చేసుకున్నారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బోనీ‌కపూర్‌ను పెళ్లి చేసుకున్న శ్రీదేవి ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది.

ఇద్దరి మరణాలతో ఒక విషయం ముడిపడి ఉంది

ఇద్దరి మరణాలతో ఒక విషయం ముడిపడి ఉంది

ఇక బోనీ కపూర్ మోనా కపూర్‌ లకు అర్జున్ కపూర్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే అప్పట్లో మోనా కపూర్, ప్రస్తుతం శ్రీదేవి మరణాలకు సంబంధించి ఒక విషయం ముడిపడి ఉంది.

క్యాన్సర్ తో మోనా కపూర్ చనిపోయారు

క్యాన్సర్ తో మోనా కపూర్ చనిపోయారు

బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ తన కుమారుడు అర్జున్ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలోనే మరణించింది. అర్జున్ కపూర్ సినిమా మరో రెండు నెలల్లో విడుదల అవుతుందనగా మోనా కపూర్ క్యాన్సర్ చనిపోయారు.

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే

సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే

ప్రస్తుతం శ్రీదేవి కూడా తన కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం విడుదల కాకుండానే, గుండెపోటుతో చనిపోయారు. బోనికపూర్ భార్యలు ఇద్దరూ ఇలా వారి వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే సమయంలోనే చనిపోవడం గమనార్హం.

శ్రీదేవితో అంతగా సంబంధాలు లేవు

శ్రీదేవితో అంతగా సంబంధాలు లేవు

ఇక బోనీ కపూర్‌తో మోనా శౌరే కుమారుడు అర్జున్ కపూర్‌కు శ్రీదేవితో అంతగా సంబంధాలు లేవంట. తను హీరోగా ఎదిగినప్పటికీ.. ఎప్పుడూ తన సవతి తల్లితో ఎదురుగా కూర్చోని మాట్లాడలేదని మూడేళ్ల క్రితం అర్జున్ చెప్పాడు.

మాట్లాడలేదు

మాట్లాడలేదు

శ్రీదేవితో సహృద్భావ సంబంధాలు ఉన్నాయని చెప్పినప్పటికీ ఆమెతో ఎప్పుడూ పెద్దగా మాట్లాడలేదని చెప్పాడు. శ్రీదేవిని తన తండ్రి భార్యగా మాత్రమే చెప్పిన ఆయన.. తండ్రి జీవిత భాగస్వామిగా తనను గౌరవిస్తానని చెప్పాడు.

షూటింగ్ క్యాన్సిల్

షూటింగ్ క్యాన్సిల్

కానీ శ్రీదేవి మరణం వార్త తెలుసుకున్న అర్జున్ కపూర్ తన చిత్రం ‘నమస్తే ఇంగ్లాండ్' షూటింగ్‌ను క్యాన్సిల్ చేసుకుని వెంటనే ముంబై చేరుకున్నాడు. అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయాన్ని దర్శించుకున్న అనంతరం పంజాబ్‌లో అర్జున్ కపూర్ షూటింగ్ ప్రారంభించాడు. శ్రీదేవి మరణం వార్త తెలియగానే విషణ్ణ వదనంతో ముంబైలోని అనిల్ కపూర్ నివాసానికి చేరుకున్నాడు.

English summary

mona kapoor and sridevi's deaths have a bizarre connection

mona kapoor and sridevi's deaths have a bizarre connection
Story first published: Monday, February 26, 2018, 9:47 [IST]