Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
సుస్మితాసేన్ ధరించిన ఈ నల్లటి చీర, మీ తదుపరి ఫంక్షన్ లేదా పెళ్లి వేడుకల్లో ధరించేందుకు ఒక ఐడియా ఇస్తున్నట్లు ఉంది ….
నిజానికి నలుపు అంటేనే అనేకమంది ఆలోచిస్తుంటారు, కొన్ని నమ్మకాలు మరియు ఆచారాల ప్రకారం. కానీ, అవన్నీ తోసిరాజని నలుపులో కూడా అందం ఉందని నిరూపిస్తున్నారు నేటి తారలు, సెలెబ్రిటీలు. క్రమంగా వివాహాది వేడుకలలో
సుస్మితాసేన్ ఎప్పటికీ ఒక సెన్సేషన్ గానే ఉంటుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పటికప్పుడు, భిన్నమైన దుస్తులతో, ఫాషన్ పోకడలతో అభిమానులను అలరించే సిస్మితాసేన్ మరలా కొత్త లుక్లో దర్శనమిచ్చి ఔరా అనిపించేలా చేసింది. క్రమంగా ఇటీవల ఒక వివాహానికి హాజరైన సుస్మితా సేన్, నీతా లుల్లా రూపొందించిన ఈ అందమైన నల్లని చీరలో కూడా సాంప్రదాయ సొగసును మేళవించేలా కనిపించి అబ్బురపరచారు. ఒకరకంగా చెప్పాలంటే, ఎప్పటిలాగే ఇప్పుడు కూడా సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్తో మనల్ని అలరించిందనే చెప్పాలి. ఒకసారి ఆమె లుక్, మరియు దుస్తుల గురించిన వివరాలను పరిశీలిద్దాం.
నిజానికి నలుపు అంటేనే అనేకమంది ఆలోచిస్తుంటారు, కొన్ని నమ్మకాలు మరియు ఆచారాల ప్రకారం. కానీ, అవన్నీ తోసిరాజని నలుపులో కూడా అందం ఉందని నిరూపిస్తున్నారు నేటి తారలు, సెలెబ్రిటీలు. క్రమంగా వివాహాది వేడుకలలో కూడా నలుపుకు ప్రాధాన్యతనిస్తున్నారు.

సుస్మితాసేన్, తేలికపాటి సాంప్రదాయ దుస్తులను పోలినట్లుగా లేస్, నెట్ వంటి అంశాలు జోడించిన చీరలో ఎంతో అందంగా కనిపించింది. చీర కుచ్చిళ్ల వరకు ఉన్న, నల్లని జాకెట్టు స్పగెట్టి లుక్ కలిగి, సరికొత్త రూపాన్ని అందించింది. ఒకరకంగా చీరను కట్టే విధానంలో స్మార్ట్ లుక్ జోడించింది. అంతేకాకుండా, బ్రాస్లేట్, చోకర్ ఈ చీరకు అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఆమె చోకర్ అన్మోల్ నుండి వచ్చింది.

ఇక మేకప్ పరంగా చూస్తే , తేలికపాటి రెడ్ లిప్ షేడ్, సుస్మితా సేన్ సంప్రదాయక రూపకానికి అదనపు హైలెట్ గా కనిపించింది. కోహ్ల్ మరియు మిడిల్ -పార్టెడ్ హెయిర్ కూడా ఆమె అందాన్ని సరికొత్తగా చూపగలిగింది. సుస్మితాసేన్ ఈ నల్లటి చీరలో కలువలా ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ..! మాకైతే సుస్మితాసేన్, చీరలో స్పగెట్టి లుక్ జోడించిన జాకెట్ ధరించి, కొత్త ఫాషన్ చూపించినట్లుగా తోచింది. మీకెలా అనిపించిందో క్రింది వ్యాఖ్యల విభాగంలో మాకు తెలియజేయండి

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర, ఫాషన్, జీవనశైలి, ఆరోగ్య, మాతృత్వ, శిశు సంబంధ, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి



Click it and Unblock the Notifications