Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
సాంప్రదాయ-ఆధునికతల మేలుకలయికతో రూపొందించబడిన వస్త్రాలలో, లాక్మే ఫ్యాషన్ వారోత్సవ - శీతాకాల వేడుకలలో సందడి చేసిన సుస్మిత!
సాంప్రదాయ-ఆధునికతల మేలుకలయికతో రూపొందించబడిన వస్త్రాలలో, లాక్మే ఫ్యాషన్ వారోత్సవ - శీతాకాల వేడుకలలో సందడి చేసిన సుస్మిత!
మాజీ మిస్ యూనివర్స్, సుస్మితా సేన్ లాక్మే ఫ్యాషన్ వారోత్సవ - శీతాకాల వేడుకలు, 2018లో, అందరి దృష్టిని ఆకర్షించింది. ఎక్కువగా చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తూ, ఆధునిక రూపకల్పన మరియు సంప్రదాయ విధానాల మేలు కలయికతో దుస్తులను సృష్టించే ఢిల్లీకి చెందిన డిజైనర్ సునీతా శంకర్ కొరకు షో స్టాపర్ గా సుస్మితా సేన్ వ్యవహరించారు. మూలాన్ని కలుపుతూ డిజైనింగ్ స్పర్శ.
94 ఏళ్ల చరిత్ర కలిగిన ఆర్.ఎం.కె.వి సిల్క్స్ తో కలిసి, రూపకల్పన చేసిన కాంజివరం పట్టు వస్త్రశ్రేణిని ఈ సంవత్సరం ప్రదర్శించారు. సమాజం ఏర్పాటు చేసిన హద్దులను దాటి ఆలోచించే నేటి యువ తరాన్ని దృష్టిలో పెట్టుకుని, ఆమె సమకాలీన నమూనాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ దుస్తుల రూపకల్పన చేసింది.

సుస్మితా షో స్టాపర్ గా ప్రదర్శించిన దుస్తులు, తాజా డిజైన్ లతో ఆధునికతను ప్రతిబింబించేలా ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. ఆమె అలంకరణ, రోజురోజుకు పరిణామం చెందుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి ఉదాహరణగా ఉన్నప్పటికీ, భారతదేశ ఘన వస్త్ర వారసత్వానికి వేడుకలా నిలిచింది. ఆమె ప్రదర్శించిన దుస్తులు ధరించడానికి సౌకర్యవంతంగా ఉండేలా కనిపించాయి. వేడుకలు మరియు ఉత్సవాలలో మనం తప్పక ధరించాలనుకునే దుస్తులకు, ప్రేరణగా ఇవి నిలిచాయి.

ఆమె వస్త్రధారణ కొట్టొచ్చే వర్ణాల సమ్మేళనంలా, పరిపూర్ణతకు అద్దం పట్టేలా రూపొందించబడింది. ఈ పవర్ సూట్ తో కూడిన చీర, చూపరులకు వస్త్రధారణను సరికొత్త స్థాయికి తీసుకువెళ్లినట్లు అనిపించింది. ఆమె తన నడుము భాగాన్ని కప్పి ఉంచేలా రూపొందింపబడిన లోతైన మెడ కలిగిన ఎరుపు రంగు స్లీవ్ లెస్ జాకెట్టును, దానికి జతగా ఎర్రని పట్టు ప్యాంటును ధరించింది.

ఇక్కడే చీరటి, ఒక ఆసక్తికరమైన మెలికనిచ్చింది! బహుళ వర్ణ పట్టు చీర మీదగా నడుము వద్ద పట్టీతో కూడిన జాకెట్టు ధరించడమే కాక, చీరను కుచ్చిళ్ళగా మలచి ప్యాంటు మీదుగా ధరించిది. అంతేకాదు, కుచ్చిళ్ళు పెట్టగా మిగిలిన అద్భుతమైన గులాబీ చీరను ఆమె వీపు మీదుగా పైట మాదిరిగా చేతితో పట్టుకుంది. ఈ దుస్తులలో ఆమె రాజసం ఉట్టిపడేలా ఉన్న వీక్షకుల హృదయ సామ్రాజ్ఞిలా సందడి చేసింది.

సాంప్రదాయ-ఆధునికతల మేలుకలయికతో రూపొందించబడిన ఈ వస్త్రాలలో, సుస్మితా ఎంతో సౌకర్యవంతంగా కనిపించింది. మేము కూడా వెంటనే ఈ శైలిని ప్రయత్నించాలని అనుకుంటున్నాము. మరి మీ విషయం ఏమిటి?



Click it and Unblock the Notifications