పర్మ్యూమ్స్ కొంటున్నారా, అయితే ఈ చిట్కాలు మీకోసమే

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

పెర్ఫ్యూమ్ ఎంచుకోవడం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాని వాటిని ఎంచుకోవడంలో సమయాన్ని ఆదాచేయడానికి కొన్ని ప్రామాణికాలు పాటించవలసిన అవసరం ఉంది. అన్నిటికన్నా ముందుగా స్టోర్ కి వెళ్లబోయే ముందు కొనుగోలు చేయవలసిన విషయాల గురించి పూర్తిగా ఆలోచన చెయ్యాలి. ఆ పరిమళాల గురించిన అవగాహన మీకు లేనట్లయితే స్టోర్ లో కనిపించే వందలరకాల పర్ఫ్యూమ్స్ లో ఒకటి ఎన్నుకోవడం కష్టతరంగా మారుతుంది. పైగా ఆశ్చర్యానికి లోనవడం మీవంతు అవుతుంది.

EDT (Eau de toilette) , EDP (eau de parfum) అను రెండు రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి.

EDT (Eau de toilette) , EDP (eau de parfum) అను రెండు రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి.

1)EDT (Eau de toilette) , EDP (eau de parfum) అను రెండు రకాల పర్ఫ్యూమ్స్ ఉంటాయి. వీటిలో EDP ఎంచుకోవలసిన అవసరం ఉంటుంది. EDP యొక్క సువాసన ఎక్కువగా ఉండడంతో పాటు ఎక్కువ సమయం కూడా ఉంటుంది. దీని గాడత 8 నుండి 15 శాతం ఉంటుంది. కాని EDT లో కేవలం 4 నుండి 8 శాతం గాడత ఉండడంతో పాటు సమయం కూడా తక్కువగా ఉంటుంది. కావున వీటి ప్రామాణికాలు తెలుసుకోవడం ఉత్తమం.

2) ఏ సువాసనను పరీక్షించాలన్నా ముందు

2) ఏ సువాసనను పరీక్షించాలన్నా ముందు

ఏ సువాసనను పరీక్షించాలన్నా ముందు ఒక స్ట్రిప్(కాగితం) పై దాన్ని స్ప్రే చేసి సువాసన చూశాక, నచ్చితే చర్మంపై అప్లై చేసుకుని ఎంత సేపు ఆ సువాసన ఉంటుందో పరీక్షించాలి. మొదట స్ప్రే చేసిన పర్ఫ్యూమ్ మోతాదును టాప్ నోట్ గా వ్యవహరిస్తారు. ఇది గరిష్టంగా కంపెనీ రూపకల్పన ఆధారంగా 5 నుండి 10 నిమిషాలు ఉంటుంది.

3)మొదటి పదినిమిషాల తర్వాత వచ్చే సువాసనను

3)మొదటి పదినిమిషాల తర్వాత వచ్చే సువాసనను

మొదటి పదినిమిషాల తర్వాత వచ్చే సువాసనను బేస్ నోట్ గా వ్యవహరిస్తారు. ఇది గరిష్టం గా పది నుండి 45 నిమిషాల నుండి బేస్ నోట్ ప్రారంభం అవుతుంది. ఇది మొదటి పది నిమిషాల అంత గాడత ఉండదు. ఇది సువాసన కొనసాగింపు గా ఉంటుంది. దీనిని ప్రామాణికంగా తీసుకునే మీకు నచ్చిన పర్ఫ్యూమ్ ఎంచుకోవలసి ఉంటుంది. ఒక పర్ఫ్యూమ్ కొనడానికి ఇంత సమయమా అని భావించేవారు కూడా ఉన్నారు, కాని ప్రత్యేకంగా కనపడాలి అని ఆలోచించేవారికి కొన్ని తప్పవు మరి.

సువాసనను ఎంచుకోవడం:

సువాసనను ఎంచుకోవడం:

ఇది చాలా ముఖ్యమైన ప్రక్రియ, మూడు నుండి నాలుగు సువాసనలను చూశాక తర్వాత చూసే సువాసనల దగ్గర ఖచ్చితమైన నిర్ణయాన్నితీసుకోవడం కష్టతరం అవుతుంది. దీనికి పరిష్కారం గా కాఫీ బీన్స్ (కాఫీ గింజల) సువాసనను చూడడం.ఒక్కోసారి ఇది పర్ఫ్యూమ్ షాపుల్లో కూడా ఉంటుంది , వారిని అడిగి తీసుకోండి. ఇది సువాసనల ఆలోచనా సరళిని తటస్థం చేయడంలో మీకు సహాయం చేస్తుంది. తద్వారా మీరు అనేక సువాసనలను ఆస్వాదించవచ్చు.

సువాసనలను ప్రయత్నిస్తున్నప్పుడు కే

సువాసనలను ప్రయత్నిస్తున్నప్పుడు కే

సువాసనలను ప్రయత్నిస్తున్నప్పుడు కేవలం మణికట్టు లాంటి ఒకే ఒక ప్రదేశానికి కట్టుబడి ఉండడం సరికాదు. ప్రదేశాలు మారుస్తూ ఉండడం మంచిది.

పర్ఫ్యూమ్ బాటిల్స్

పర్ఫ్యూమ్ బాటిల్స్

పర్ఫ్యూమ్ బాటిల్స్ పై రాసిన వివరణల ద్వారా అభిప్రాయానికి రావడం సరైనది కాదు, నాలుగురకాల పర్ఫ్యూమ్స్ ని ప్రయత్నించి, తద్వారా మీకు నచ్చిన పర్ఫ్యూమ్ ఎంపిక చేసుకోవడం ముఖ్యం.

 పర్ఫ్యూమ్స్ గాడతను తనిఖీ చేయడం

పర్ఫ్యూమ్స్ గాడతను తనిఖీ చేయడం

పర్ఫ్యూమ్స్ గాడతను తనిఖీ చేయడం ముఖ్యమైన విషయం. సాధారణంగా 20-40 శాతం గాడత కలిగిన పర్ఫ్యూమ్ అత్యుత్తమ ఒప్పందాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి, వాటి తీవ్రతను తనిఖీ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా ఫంక్షన్లకు హాజరైనప్పుడు ఈ గాడత ఇబ్బంది కలిగించేలా ఉండకూడదు.

English summary

Things to keep in mind while shopping for perfumes

Picking perfumes can be hard. Be specific beforehand to save time while choosing fragrance notes, say experts. First of all, have an idea of what you ar