For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చీకట్లోనూ మెరిసిన విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ, కృతి సనోన్..

|

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల భామ అనుష్కశర్మలు ముంబై ఎయిర్ పోర్టులో మరోసారి హైలెట్ అయ్యారు. క్రికెట్లో శతకాల మీద శతకాలు కొడుతూ రికార్డులు తిరగరాసే కోహ్లీ ఈసారి తన భార్య అనుష్క శర్మతో కలిసి కొత్తగా కనబడ్డారు. దీంతో వీరిద్దరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. వీరి జంటను చూస్తే చూడముచ్చటగా ఉందని తెగ మెచ్చుకుంటున్నారు. అది చిమ్మచీకట్లో వారి ముఖాలు కాంతివంతంగా కనిపిస్తున్నాయని, మన దేశంలో అందమైన జంటల్లో విరుష్క జంటకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెబుతున్నారు. వీరితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనోన్ కూడా చిక్ స్టైల్ డ్రస్ తో కొంచెం కొత్తగా కనిపించారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవల విండీస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని అతని భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఈ సందర్భంగా వారు ధరించిన దుస్తులను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ట్రెండీగా ఉండేందుకు ఎల్లప్పుడూ ముందుండే విరుష్క ఈసారి ఒకేరకమైన దుస్తులను ధరించారు. విరాట్ కోహ్లీ, అనుష్క మాత్రమే కాదు బాలీవుడ్ నటి కృతి సనోన్ కూడా చిక్ స్టైల్ డ్రస్ తో స్నాప్ చేయబడ్డారు. ఆమె న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ కోసం సోదరి నుపూర్ సనోన్ తో కలిసి సింపుల్ గా కనిపించింది.

వారి దుస్తులను ఒకసారి నిశితంగా పరిశీలించి డీకోడ్ చేద్దాం. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ సౌకర్యవంతమైన బ్లూ కలర్ లో ఉండే ఒకే రకమైన దుస్తులను ధరించారు. కానీ కోహ్లీ బ్లూ కలర్ జాకెట్ మీద మధ్యభాగానికి కొంత భాగం పైన వైట్ కలర్ కూడా జతచేసి ఉంది. కోహ్లీ దానిని అదిదాస్ నుంచి వచ్చిన డెనిమ్స్ మరియు వైట్ స్నీకర్లతో కలిపేశాడు. అందుకు తగ్గ మ్యాచింగ్ ప్యాంటు ధరించాడు. ఇక బాలీవుడ్ మోస్ట్ బ్యూటీఫుల్ భామ అనుష్క శర్మ తన కళ్లకు బ్లాక్ సన్ గ్లాసెస్, గోల్డెన్-టోన్డ్ రిస్ట్ వాచ్ మరియు, బ్లాక్ చోకర్ ఆమె రూపాన్ని మరింత అందంగా కనబడేలా చేశాయి. ఈ అందాల భామ తన క్లాసీ సెయింట్ లారెంట్ టోటె బ్యాగ్ ను కూడా తనతో పాటు తీసుకొచ్చింది. ఇలా ఒకేరకమైన, మ్యాచింగ్ డ్రస్సులతో విరుష్క జంట ముంబై ఎయిర్ పోర్టులో అలరించింది.

మరోవైపు సనోన్ సోదరీమణులు తమదైన రీతిలో సొగసైన వారిగా కనిపించారు. కృతి సనోన్ స్టైలిస్ మోకాలి వరకు పొడవు ఉండే ఆఫ్-వైట్ కలర్ తో ఉన్న దుస్తులను ధరించగా, అది పూలమాలలతో అలంకరించినట్టుగా కనిపించింది. ఆమె తన దుస్తులకు తొడ ఎత్తైన బ్లాక్ షూస్ తో కలిపేసింది. ఈ బాలీవుడ్ భామ ఒక పెద్ద ముదురు బ్లూ కలర్ బ్యాగ్ ను తీసుకెళ్లి వదులుగా ఉండే కర్ల్స్ మరియు పింక్ లిప్ షేడ్ తో తన రూపానికి మరింత మెరుగులు దిద్దుకుంది.

నుపూర్ సనోన్ కూడా పూర్తి స్లీవ్ పర్పుల్ టాప్ ను ధరించింది. ఇది క్లిష్టమైన పూలస్వరాలతో కలిపి ఉంది. దీనికి బ్లాక్ డిస్ట్రెస్ట్ జీన్స్ మరియు లేస్డ్ షూతో యాడ్ చేసింది. నుపూర్ సనోన్ తన మధ్య విడిపోయిన ఉంగరాల ఆకారంలో ఉన్న వస్త్రాలను తెరిచి, కృతి సనోన్ వంటి గులాబీ నీడతో ఆమె కూడా తన రూపాన్ని మెరుగుపరుచుకుంది. ఈ అక్కాచెల్లెళ్లు కూడా వారి పూల దుస్తులతో ఫుల్లు అందంగా కనిపించారు. సో, మీరు ఇంతవరకు మీరు ముంబై విమానశ్రయంలో చూసిన వారిలో ఎవరిని మీరు ఎక్కువగా ఇష్టపడ్డారు- విరుష్క జంటనా లేదా సనోన్ సోదరీమణులనా? కామెంట్స్ విభాగంలో మీకు నచ్చిన పేర్లను రాసి మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి.

English summary

Virat-Anushka And Kriti-Nupur Sanon Have Coordinated Airport Outfit Ideas For Us

Team India captain Virat Kohli recently landed at Mumbai airport with his wife Anushka Sharma after successfully completing the tour of Windies. Everyone was amazed at the dress they were wearing on this occasion. This is because Virushka always wore the same outfit to be trendy. Not only Virat Kohli, Anushka but also Bollywood actress Kriti Sanon are also snapped with a chic style dress.
Story first published: Tuesday, September 10, 2019, 16:20 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more