Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
అల్లావుద్దీన్ ఖిల్జీ రూపంలో రవిదూబే అచ్చు రణ్వీర్ సింగ్ లా.. !
అల్లావుద్దీన్ ఖిల్జీ రూపంలో రవిదూబే అచ్చు రణ్వీర్ సింగ్ లా.. !
ప్రజాదరణ పొందిన టీవీనటుడైన రవిదూబే, ఇటీవలే తన ఇన్స్టాగ్రామ్ నందు అల్లాఉద్దీన్ ఖిల్జీ గెటప్లో తీసుకున్న ఫోటోలను భాగస్వామ్యం చేసాడు. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. రణ్వీర్ సింగ్ అల్లావుద్దీన్ ఖిల్జీ రూపాన్ని రణ్వీర్ కన్నా మెరుగ్గా ఈ “జామై రాజా” స్టార్ చూపగలిగాడని అనేకమంది అభిప్రాయం కూడా.
రణ్వీర్ సింగ్ సంజయ్ లీలా భన్సాలి చిత్రమైన పద్మావతి సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకు జీవంపోసినట్లుగా నటించాడు అన్నది ఒప్పుకోవాల్సిన సత్యం. కానీ అంతకాకపోయినా, మేము కూడా ఆ పాత్రలకు నప్పుతామని చూపించే ప్రయత్నాలలో భాగంగా తీసుకున్న ఈ ఫోటో విజయవంతమైందనే చెప్పవచ్చు. ఇప్పుడు “సబ్సే స్మార్ట్ కౌన్” అనే గేం షో ప్రోమోలో భాగంగా ఈ రూపంలో కనిపించిన రవిదూబే కూడా వావ్ అనిపించేలా కనిపించి ప్రజలందరి ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఆకర్షణీయమైన మెరూన్ మరియు గులాబీ ఎంబ్రాయిడరీ దుస్తులను ధరించి, అతను విలక్షణమైన మాటలతో, ఆత్మవిశ్వాసం కూడుకుని సింహాసనంపై కనిపిస్తాడు. అతని పటిష్టమైన పింక్ తలపాగా మరియు గోధుమ రంగు బూట్లు ఖిల్జీ రూపాన్ని మరింతగా పూర్తి చేశాయి అనడంలో ఆశ్చర్యమే లేదు.
రణ్వీర్ సింగ్ కార్బన్ కాపీ వలె ఎలా కనిపించాడు? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. కానీ రవిదూబే చెప్పిన ప్రకారం, తన అలంకరణకు పద్మావతి సినిమాలో “రణ్వీర్ సింగ్” ని అల్లావుద్దీన్ ఖిల్జీగా చూపిన మేకప్ ఆర్టిస్ట్ “ప్రీతి షీల్” కారణమని ధృవీకరించాడు.

ఒకరి రూపాన్ని ఖచ్చితత్వంతో కూడిన విలువలతో ప్రదర్శించేలా చేయడం ఒక అద్భుతమైన కళ, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా రవిదూబే చేసిన ఈ ప్రయత్నాన్ని దేశమంతా మెచ్చుకోక మానదు. ముఖ్యంగా జనాల మనస్సులో పాతుకుపోయిన రూపాలు కొందరివే ఉంటాయి, అలాంటి రూపాలకు అభిమానులూ ఎక్కువే. ఈ మద్య వచ్చిన బాహుబలి, పద్మావతి ఆ కోవకే చెందినవి. మన తెలుగులో కూడా మహానటి సినిమాలో కీర్తిసురేష్ హావభావాలు సావిత్రిని మైమరపించేలా చేసి, అందరి ప్రశంసలనూ అందుకుంది. అలా పాత్రకు జీవంపోయడం అనేది, అందరివల్లా కాదు ఎన్నటికీ. ఇక్కడ రవిదూబే కూడా అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రకు సరిగ్గా సరిపోయాడు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదని మేము భావిస్తున్నాం.

ఈ రవిదూబే ప్రయత్నం మీకెలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని క్రింది వాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
