వావ్! సోనమ్ వివాహ వస్త్రాలంకరణ చూపరులను మంత్రముగ్దులను చేసింది

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

భారీ బంగారు ఆభరణాలతో, సోనమ్ ఒక వధువుగా, సమకాలీన సౌందర్య పోకడలను అనుసరించకుండా, భారతీయ వధువు యొక్క మూలతత్వాన్ని ప్రతిబింబించే స్థాయి ముస్తాబుతో ముంబైలోని బ్యాండుస్టాండ్ , బాంద్రాలో అట్టహాసంగా జరిగిన తన వివాహ మహోత్సవం కొరకై సన్నద్ధమయింది.

ఈ సౌందర్యరాశి, అనురాధ వకీల్ చేత డిజైన్ చేయబడిన దుస్తులలో తన ఆనంద్ కా రాజ్ వేడుకలో వన్నెలొలికించింది. నిజానికి , గత కొన్ని సంవత్సరాలుగా వివిధ నటీమణులు తమ వివాహ వేడుకలకు ధరిస్తున్న వేషధారణతో పోల్చిచూస్తే, ఇది ఒక తాజదనంతో కూడుకున్న మార్పుగా కనిపిస్తుంది. ఎందుకంటే, వారంతా పేస్టల్ ఛాయలతో కూడిన దుస్తులనే ధరిస్తూ వచ్చారు. సోనమ్ తీరు ఎంతకాదన్నా ఆశ్చర్యకరమైనదే!

Wow! Sonam Is A Vision To Behold In Her Wedding Attire

సోనమ్ పూర్తిగా సంప్రదాయ వస్త్రధారణ వైపే మొగ్గు చూపింది. వధువులకు వన్నె తెచ్చే ఎర్రని దుస్తులలో వివాహ వేదికకే అందాన్ని అద్దింది. ఆమె దుస్తులపై పూల ప్రింట్లు, ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే, కలువపూల మోటిఫ్స్ కొట్టోచ్చేటట్లు కనిపించాయి. సోనమ్ పెండ్లి దుస్తులకున్న బంగారు మరియు ఎరుపు రంగుల అంచులు , ఆమె అందాన్ని రెట్టింపు చేసాయి.

అందరూ ఎప్పుడో మర్చిపోయిన పొడుగాటి హారాల ధోరణితో కూడిన, కలీరాలు, మాంగ్ టీకా, ఎర్రని గాజులు మరియు వెడల్పాటి చోకర్ ధరించి పాత కాలపు శైలిని తిరిగి బాలీవుడ్ కు జ్ఞప్తికి తెచ్చింది.

ఆమెకు బాలీవుడ్ ఫేవరేట్ అలంకరణ నిపుణుడైన నమ్రత సోని, సహజత్వం చెక్కుచెదరకుండా అలంకరణ చేసాడు. స్మోకీ కళ్ళు, పల్చని లేలేత వన్నెల లిప్స్టిక్ ఆమె రూపాన్ని ఇంకా అపురూపంగా తీర్చిదిద్దాయి.

ఆమె ప్రతి అంగుళంలో రాజసం ఒలికిస్తూ, ఆహూతులను చూపు తిప్పుకోనివ్వలేదు. ఆమె తప్పకుండా, ముందు ముందు కాబోయే సమకాలీన వధువులకు ఒక సౌందర్య లక్ష్యాన్ని సిద్దం చేసిందనే చెప్పాలి.

Wow! Sonam Is A Vision To Behold In Her Wedding Attire

హుందాతనంతో, వన్నెతరగని సోనమ్ వివాహ వస్త్రశైలి, ఈ దశాబ్దపు అత్యుత్తమమైన వస్త్రాలంకరణలలో ఒకటిగా పేర్కొనవచ్చు.

మనమందరం కలిసి సోనమ్ కు హార్దిక వివాహ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె రెడ్ కార్పెట్ పై ఎప్పటికీ తన హోయలుతో చూపరులను మంత్రముగ్దులు చేయడంలో సఫలీక్రుతమవ్వాలని కోరుకుందాం.

English summary

Wow! Sonam Is A Vision To Behold In Her Wedding Attire

Adorned in heavy gold jewellery, Sonam Kapoor ditches the contemporary bridal look and instead opts to be the quintessential Indian bride for her wedding ceremony at Bandstand, Bandra in Mumbai. The diva looks stunning in Anuradha Vakil's creation for her Anand Karaj ceremony. Sonam also revives the long-forgotten traditional wedding jewelleries
Story first published: Wednesday, May 9, 2018, 12:30 [IST]