ప్రమోషన్ ఈవెంట్ లో భాగంగా, సెక్సీ లుక్ పునర్నిర్వచించిన వీరాస్ .. !

Subscribe to Boldsky

'వీరే ది వెడ్డింగ్' మూవీ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో, ఈ నలుగురు వీరాస్ తమ వినూత్నమైన సెక్సీ లుక్స్ తో స్టైల్ కోటాన్నిపెంచుతున్నారు. కరీనా కపూర్ ఖాన్, సోనమ్ కపూర్ - అహూజా, స్వర భాస్కర్ మరియు సాక్షి తల్సేనియాలు మైర్యాడ్ గ్లాం దుస్తులలో కనిపించి అబ్బురపరచారు. ఈ చిత్రం నలుగురు స్నేహితుల మద్య ఉన్న బలమైన ఆత్మ బంధంతో ముడిపడి ఉంటుంది.

చివరిసారిగా, ఈ నలుగురు వీరాస్ స్ప్రింగ్ దుస్తులు ధరించి కనిపించినా, ఈసారిమాత్రం భిన్నంగా సెక్సీ పోజులతో అలరించి మైమరపించారు. కరీనా కపూర్ ఖాన్, వీరందరిలో ఒక మెట్టు ఎక్కువే అన్నట్లుగా కనిపించింది, పూర్తిగా నలుపురంగు సపరేట్స్ దుస్తులను ధరించి, జనాల్లో వేడిని పెంచేలా కనిపించింది. కేన్స్ లో కంగనా రానౌట్ బాన్డ్యూ (బ్రాసెరీస్ రిలేటెడ్) దుస్తులను ధరించినప్పటికీ, కరీనా ఇంతకు ముందే వోగ్ మాగజైన్ ఫోటో షూట్లో కోర్సెట్ దుస్తులలో బికినీల్లో అలరించిన విషయం మనకు తెలుసు.

You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event

అదేవిధంగా ఇప్పుడు కూడా కరీనా నల్లటి బాన్డ్యూ, స్కర్ట్ మరియు సెక్సీ షీర్ స్టాకింగ్స్ జత చేసి అందరి చూపులనూ తనవైపుకి మళ్లేలా చేసుకోగలిగింది అనడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు.

మరియు ఫుల్ – లెంగ్త్ ష్రగ్ ధరించిన గెటప్లో ఇచ్చిన పోజ్, ఓమైగాడ్ లుక్ ఇచ్చింది. గిట్టని వాళ్ళు కూడా కుళ్ళుకునేలా చేసిన కరీనా, ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. మరియు లూస్ హెయిర్ తో ఇచ్చిన వైల్డ్ టచ్ దుస్తులకు సరిగ్గా సరిపోయేలా ఉంది.

సోనం కపూర్ అహుజా ఒక నాటకీయత జోడించిన సెక్సీ గౌన్ కై మొగ్గు చూపింది. కొత్తగా వివాహం చేసుకున్న ఈ ఫాషనిస్టా దాదాపు ఆడమ్స్ ఫామిలీ నుండి వచ్చిన మోర్టిసియా ఆడమ్స్ లుక్ ఇచ్చింది. సోనం ధరించిన మోర్టిసియా ఆకుపచ్చ గౌను, పోకా - చుక్కల అపారదర్శక పట్టు వస్త్రంతో రూపుదిద్దుకుంది, మరియు లోతైన స్లిట్ కలిగి ఉంది. ఇంచ్ ఇంచ్ లో అందాన్ని ఇనుమడింపజేసుకుందా అన్న భావనకు గురిచేస్తూ కనిపించింది. ఇక మేకప్ విషయానికి వస్తే, డీప్ లిప్ షేడ్ కలిగి, చేతిలో ఒక జ్యువెల్డ్ క్లచ్(వాలెట్), మరియు అద్భుతమైన చెవిపోగులతో తన రూపాన్ని పూరించింది.

స్వర భాస్కర్ మాత్రం మళ్ళీ సాధారణo గానే కనిపించింది కానీ ఆమె దుస్తులు మాత్రం ఖచ్చితంగా ముందు కంటే తక్కువగా ఉన్నాయి అనడంలో ఆశ్చర్యమే లేదు. హాఫ్ స్లీవ్స్ కలిగిన డ్రీమీ వైట్ దుస్తులు, అప్లిక్ బ్రైడ్ వర్క్ తో అందంగా రూపుదిద్దుకుని ఉన్నాయి. స్వర భాస్కర్ ధరించిన ఈ హై-నెక్ దుస్తులు నిర్మాణాత్మకంగా మరియు ఆమె సన్నని ఫ్రేమ్ కు నప్పినట్లుగా ఎంతో అందంగా కనిపించింది. పింక్ లిప్ షేడ్ తో, బుజాలపై వాలుగా వదిలిన జుట్టుతో అబ్బురపరచేలా కనిపించింది.

సాక్షి మాత్రం నిజంగా కార్యక్రమంలో ఒక అద్భుతమనే చెప్పాలి. సాధారణంగా సంప్రదాయబద్దంగా దుస్తులు ధరించే సాక్షి ప్లంగింగ్ నెక్లైన్ ఎల్.బి.డి లో చూపరులను ఊపిరిసలుపుకోనీయకుండా చేసింది. సూపర్-హాట్ లుక్ తో, కర్వీ, జీరో సైజ్డ్ తారలకు ఒక గోల్ ఇచ్చినట్లు కనిపించారు సాక్షి తల్సేనియా. ఆమె తన నల్లటి దుస్తులకు, నల్లని పెన్సిల్ హీల్ పాదరక్షలను జతగా ధరించి, బెబో లాగే జుట్టును వదులుగా విడిచి, తానెవరికీ తీసిపోను అన్నట్లు కనిపించింది.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నలుగురు వీరాస్ సోనమ్ కపూర్ సోదరి రియా కపూర్ మరియు బాద్షాతో కలిసి చేరారు. రియా ఒక హై – నెక్ టైప్ తెల్లటి టాప్, మరియు హై -వైస్ట్ ప్యాంటుతో కనిపించగా, బాద్షా సిగ్నేచర్ దుస్తులలో ఫ్లోరోసెంట్ గ్రీన్ మరియు బ్లాక్ ఫుల్ ఓవర్ కలిగి పైజామా తో అలరించారు. వీరి ప్రమోషన్ ఈవెంట్స్ చూస్తుంటేనే, వీరే ది వెడ్డింగ్ మీదా భారీగా అంచానాలు పెరుగుతున్నాయని చెప్పక తప్పదు.

పై నలుగురిలో ఎవరికీ ఎవరూ తీసిపోకపోయినా, మాకు మాత్రం కరీనా కపూర్ అబ్బురపరచేలా కనిపించిoది, ఈ నలుగురిలో మీ మనసు దోచుకుంది ఎవరు ?. క్రింది వ్యాఖ్యల విభాగంలో మీ అభిప్రాయాలను పంచుకోండి.

You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event
You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event
You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event
You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event
You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    You Got To Check Out How Veeras Redefined Sexy At The Promotion Event

    The veeras in the movie, 'Veere Di Wedding'- Kareena Kapoor Khan, Sonam Kapoor-Ahuja, Swara Bhasker, and Sakshi Talsania switched to sexier outfits this time for the promotion of their movie, which rejoices the soul sister like bond between four bffs. Each one of them donned distinctive attires. While Kareena was the hottest of all but Sakshi pulled off a surprise.
    Story first published: Thursday, May 24, 2018, 18:30 [IST]
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more