వేసవిలో సూర్యుడికి సైతం తాపం పుట్టించిన కిమ్ కర్ధాషియన్

Posted By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఏదో ఒక న్యూస్ తో తరచూ వార్తల్లోకెక్కే ప్రపంచ ప్రఖ్యాత మోడల్ కిమ్ కర్ధాషియన్, మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయింది. తరచుగా తన ఫోటోలతో సోషల్ మీడియాలో అత్యధిక అభిమానుల మనసు గెల్చుకున్న కిమ్ కర్ధాషియన్ మళ్ళీ అదే ప్రభంజనాన్ని సోషల్ మీడియాలో కొనసాగించేoదుకు సిద్దమైంది.

గత వారం రోజులుగా, ఈ సోషల్ మీడియా సూపర్ స్టార్, తన సరికొత్త ఫోటోలతో ఇంటర్నెట్ ప్రపంచాన్నే వేడెక్కిస్తూ ఉంది. ఈ వేసవి ఉష్ణోగ్రతల స్థాయిలను ఇంకాస్త పెంచే దిశగా ప్రయత్నిస్తున్నట్లు.

Kim kardashian hot pics

మూడవసారి తల్లైన దగ్గర నుండి తన సరికొత్త మేకప్ హంగులతో అభిమానుల మనసులను కొల్లగొడుతూ ఉంది. తన జీవితంలో ఎదురైన అనేక ప్రతికూల పరిస్థితుల కారణంగా సోషల్ మీడియాకు కొంతకాలం దూరమయింది కూడా.

కానీ, ఈ మద్య తన బికినీ ఫోటోలతో సోషల్ మీడియాలో ఒక సంచలనం సృష్టించింది. దీనికి సోషల్ మీడియాలో ఫోటో షేరింగ్ దిగ్గజమైన ఇన్స్టాగ్రామ్ వేదికైంది.

తన నాజూకైన ఆకృతి, అందులో కిమ్ కి అత్యంత ప్రాధాన్యత తెచ్చిన హిప్ అందాలతో ఇన్స్టాగ్రామ్ నందు నెటిజన్ల కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. అందాలు అలాంటివి మరి...

Kim kardashian hot pics

కిమ్ , తన వేసవి విడిదిలో బాగంగా బీచ్ లో దిగిన ఎరుపు మరియు నలుపు రంగులలోని బికినీలలోని మూడు ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రకృతి సైతం అసూయపడే ఆకృతి ఆవిడ సొంతం అని నెటిజన్ల కామెంట్లు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.

కానీ అనేకులు ఇవి నిజమైన ఫోటోలు కాదని, కిమ్ తరచుగా తన హాలిడే ఫోటోలను ఫోటో షాప్ చేసిన ఫోటోలనే ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుందని నమ్ముతూ తమ భావాలను కామెంట్ల రూపంలో కూడా పెడుతున్నారు. ఇది కొన్ని చర్చలకు కూడా దారితీసింది.

కిమ్, ఇలాంటి పుకార్లకు చెక్ పెట్టడం కోసం ఒక వీడియో కూడా షేర్ చేసింది. ఈ వీడియోలో తాను బికినీలో తిరుగుతూ, తన ఆకృతి ఫోటోషాప్ కాదని నమ్మించే ప్రయత్నం కూడా చేయాల్సి వచ్చింది. కానీ ఇంకా కొందరు నమ్మకం లేదనే వాదిస్తున్నారు.

ఏది ఏమైనా, ప్రపంచ వ్యాప్తంగా కిమ్, సెక్సీ అనే పదానికే ఒక ఐకాన్ గా మారింది అని చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల పాటు ఎన్నో రకాల ప్రతికూల ప్రభావిత పరిస్థితులను ఎదుర్కొన్నా కూడా, కిమ్ తన ప్రాబల్యాన్ని ఏమాత్రం కోల్పోలేదు అన్నది నిజం.

Kim kardashian hot pics
Kim kardashian hot pics

English summary

Hotness Alert! Kim Kardashian Is Putting The Summer Sun To Shame

Kim was on a beach vacay and, in the photos she is wearing a red and a black bikini which is perfectly complementing her envious figure and boy! she is looking hotter than ever. But there are people who are not believing that this could be her real body and she has been constantly trolled for supposedly "photoshopping" her pics.
Story first published: Saturday, April 14, 2018, 14:00 [IST]