Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
“మెట్ గాలా 2018” : కేటీ ఈ కార్యక్రమ నేపద్యాన్ని సీరియస్ గా తీసుకుందా ?
“మెట్ గాలా 2018” : కేటీ ఈ కార్యక్రమ నేపద్యాన్ని సీరియస్ గా తీసుకుందా ?
“మెట్ గల” నేపద్యాన్ని కొన్ని సంవత్సరాలుగా అనేకమంది అనుసరించకపోయినా కొందరు స్టార్లు మాత్రం సీరియస్ గానే తీసుకున్నారని చెప్పక తప్పదు. ఇది అక్షర సత్యం. ప్రతి ఒక్కరూ ఓవర్ - ది - టాప్ దుస్తులు ధరించలేరు కదా. కొందరు సుప్రీం స్టార్లు తప్ప. అందులో కేటీ ప్రధమoగా ఉంటుంది.
ఈ సంవత్సరం కేటీ పెర్రీ తన ప్రదర్శనలో అత్యంత నాటకీయతను జోడించి ఇచ్చిన ఎంట్రీ “ మెట్ గల 2018 ” కే సరికొత్త రికార్డ్ అని చెప్పవచ్చు. వర్సేస్ రూపొందించిన గ్లిట్టరీ గోల్డెన్ రంగు కలిగి, తొడల పైదాకా ఉన్న దుస్తులతో, గోల్డెన్ బూట్స్ తొడిగి ఇచ్చిన పోజుకు కెమరాలే కుళ్ళుకున్నాయి. కావాలంటే మీరే చూడండి. ఆగండాగండి, ఇంకా ఉంది. దుస్తుల వెనుక అటాచ్ చేసిన 8 అడుగుల ఈకలు కలిగిన రెక్కలతో ఏంజెల్ లుక్ ఇచ్చి అందరి అంచనాలను బ్రేక్ చేయడంలో మరియు “ హెవెన్లీ బాడీస్ : ఫాషన్ మరియు కాథలిక్ ఇమాజినేషన్ ” నేపద్యానికి సరైన జస్టిఫికేషన్ ఇవ్వడంలో కేటీ పెర్రీ సక్సెస్ అయిందనే చెప్పాలి.

తన వింటేజ్ రైడ్ దుస్తుల నుండి సెంటర్ స్టేజ్ లుక్ లోకి, అర్కాంజల్ గాబ్రియల్ రూపకంలో పూర్తిగా కాథలిక్ దుస్తులకు జస్టిఫికేషన్ ఇచ్చింది కేటీ పెర్రీ. షాంపేయిన్ రంగు రెక్కలు భుజాలకు గోల్డెన్ యాంకర్తో తొడగబడి శరీరాన్ని హావభావాలతో కేటీ పెర్రీ నిలబడిన విధానం, ఓ మై గాడ్ అని అనిపించేలా చూపరులను దాసోహం చేయగలిగింది.
ఏది ఏమైనా మంచి కళా నైపుణ్యం ప్రదర్శించి, నేర్పుగా తీర్చి దిద్దబడిన ఆడంబరాలతో కూడిన ఈ దుస్తులు అంతే అందం కలిగిన మహిళ ధరిస్తే ఇంకెలా ఉండాలి చెప్పండి. కానీ ఆమె అవాంట్ గార్డ్ వస్త్రధారణలో అందాన్ని విస్తారంగా పరచి కేటి పెర్రీ అనేక ప్రమాణాలను పునర్నిర్వచించింది అనడంలో ఆశ్చర్యమే లేదు.

ఆమె దుస్తులు మనల్ని ఆశ్చర్యానికి గురిచేసింది, అందులో అనుమానమే లేదు. కానీ ఎలా అనుకూలంగా ఉండగలిగింది ? 8 అడుగుల రెక్కలతో ఎలా కుర్చీలో ఆసీనులైంది? రెక్కలను పక్కన పెట్టి ఆసీనురాలైందా ? అంత పెద్ద రెక్కలను ఎలా భుజానికి తొడగగలిగారు? ఆ రెక్కల బరువు సంగతేమిటి ? బెల్ట్ ఏమన్నా కట్టారా ? లేదా గ్లూ తో అతుకులు వేశారా ? ఇలాంటి అనేక ప్రశ్నలు మెదళ్ళలో మెదులుతూనే ఉన్నాయి. ఒక్కసారి సామాజిక మాధ్యమాలలో ఈ ప్రశ్నలను చూస్తే మీకే అర్ధమవుతుంది ఎంత చర్చకి కేటీ తెరతీసిందో అని.
ఈ “ మెట్ గల 2018 ” లో మాత్రం కేటీ తన దుస్తులతో ఇచ్చిన ఎంట్రీ ఒక ప్రభంజనమనే చెప్పాలి. బెస్ట్ డ్రెస్స్డ్ స్టార్స్ లో కేటీ ని మేము టాప్ లో ఉంచాము ? మరి మీసంగతేమిటి ? కామెంట్ సెక్షన్లో తెలుపండి.



Click it and Unblock the Notifications