ఫాషన్ క్వీన్ లేడీ గాగా కు జన్మదిన శుభాకాంక్షలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఆడుకోవలసిన బాల్యాన్ని కష్టాల సుడిగుండంలో గడిపింది, యుక్త వయసులో దాడులకు గురై వెలివేయబడింది, అయినా సంగీతాన్ని ఆయుధంగా మలుచుకుని తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న యువతి లేడీ గాగా. బార్లలో పాటలు పాడడం, తద్వారా చిన్న చిన్న ఈవెంట్లు పాల్గొనడం నుండి యువత ఉర్రూతలూడే పాప్ సాంగ్స్ తో తనకంటూ గుర్తిoపు తెచ్చుకున్న లేడీ గాగా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వచ్చింది. లేడీ గాగా అసలు పేరు Stefani Joanne Angelina Germanotta.

ఎన్నో కష్టాలను ఎదుర్కుంటూ తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేసిన లేడీ గాగా కు AKON , తన పాప్ ఆల్బమ్ ద్వారా మంచి బ్రేక్ ఇచ్చారనే చెప్పుకోవచ్చు. Akon తన ఆరాధ్య దైవంగా ఎన్నోసార్లు గాగా తెలిపింది. తద్వారా ఈ ప్రపంచమే ఉర్రూతలూగే పాప్ గాయని లేడీ గాగా స్టీఫానీకి సరికొత్త జన్మ గా ఈ బ్రేక్ చెప్పవచ్చు.

On Her Birthday, Lets Bow Down To The Ultimate Fashion Queen

"Never let a single soul tell you that you can't be exactly who you are." - Lady Gaga.

తన ప్రభంజనాన్ని పాప్ సంగీతంతో ఆపకుండా తన వేషధారణతో ఫాషన్ రంగంలో ఒక సరికొత్త సునామీని తీసుకుని రాగలిగింది గాగా. విలక్షణమైన శైలితో , హావభావాలతో , సరికొత్తగా తాను డిజైన్ చేసిన దుస్తులతో ప్రపంచానికే ఫాషన్ ఐకాన్ గా మారింది.

On Her Birthday, Lets Bow Down To The Ultimate Fashion Queen

లేడీ గాగా పాటలంటే సంగీతం కన్నా, ఆమె వస్త్రధారణ , విచిత్రమైన ఎన్నడూ చూడని అలంకరణ, చూపులతో పలికే మాటలు ఇలాంటి అంశాలన్నో గుర్తుకువస్తాయి. ఏదైనా ఆల్బమ్ రిలీజ్ అయితే, ఈ అంశాల మీదనే నెలల తరబడి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతాయి అంటే అతిశయోక్తి కాదు. చిన్న ఈవెంట్లు చేసుకునే గాగా, ఈవెంట్స్ కి డేట్స్ సైతం కేటాయించలేని స్థాయిలో ఉందంటే తన ఎదుగుదలకోసం ఎంతగా కష్టపడిందో వేరే చెప్పనవసరంలేదు.

On Her Birthday, Lets Bow Down To The Ultimate Fashion Queen

ఎంతోమంది గాగా వ్యతిరేకులు ఉన్నా, అంతకు రెట్టింపు అభిమానులు ఉన్నారు. ఈరోజు ప్రపంచం గర్వించదగిన ఫాషన్ ఐకాన్లలో గాగా ఒకరు. అంతకు మించి ఏం కావాలి. వ్యతిరేకులు ఎందరు ఉన్నా , వారి అసూయా ద్వేషాల ను మెట్లుగా మలచుకుని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తున్న లేడీగాగాకు 32(మార్చి 28) వ పుట్టిన రోజు శుభాకాంక్షలు .

హ్యాపి బర్త్ డే లేడి గాగ

English summary

On Her Birthday, Let's Bow Down To The Ultimate Fashion Queen

Bullied as a child, rejected as a youngster and deceived by certain music labels initially, Lady Gaga became a phenomenon, not for nothing. As she turned 32 yesterday we salute her for all her unconventional fashion choices that shattered stereotypes. After winning million hearts across the globe she now emerged as the biggest fashion icon the world had ever seen.