For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ల నొప్పులు నివారించే 8 నేచురల్ రెమెడీస్

By Super
|

వయస్సు పెరిగే కొద్ది ఒంట్లో శక్తి, వ్యాధినిరోధకత తగ్గడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టు ముడుతుంటాయి. ముఖ్యంగా ప్రారంభంలో ముడుతలు, అలసట, చర్మం వదులవ్వడం, ఇతర అనారోగ్య సమస్యలు వంటివి వయస్సురిత్యా వచ్చే సమస్యలు.

వయస్సు రిత్యా వచ్చే వ్యాధులు వివిధ రకాలున్నాయి. బాధాకర విషయమేమిటంటే వీటిలో కొన్ని కొంత మందిలో నయం కాకపోవచ్చు. అలాంటి వారిలో, వ్యాధిలక్షణాలు తెలుసుకోవడం, ముందుగానే గుర్తించడం వల్ల ప్రారంభంలోనే లక్షణాలను, దానికి సంబంధించిన ఇతర అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవచ్చు.

అలాంటి అనారోగ్య సమస్యల్లో ఆర్ధరైటిస్ ఒక డిజనరేటివ్ డిజార్డర్. వయస్సు రిత్యా వచ్చే చాలా సాధారణ సమస్య ఇది. ఇది వయస్సైన వారిలో చాలా సాధారణం. దీనికి నివారణ అంటూ ఉండదు. అయితే లక్షణాలను మాత్రం కట్టడి చేయవచ్చు.

ఆర్ధరైటిస్ అనేది జాయింట్ పెయిన్స్ , జాయింట్స్ పట్టేసినట్లు, ఇన్ఫ్లమేషన్ కలిగి ఎక్కువగా నొప్పులకు గురి చేస్తుంది. దీన్నే కీళ్ళ నొప్పులని కూడా పిలుస్తుంటాము. ఆర్థరైటిస్ కి వివిధ కారణాలున్నాయి. గాయాలు, అబ్ నార్మల్ మెటబాలిజం, ఇన్ఫెక్షన్స్ , జెనెటిక్స్ వల్ల వస్తాయి. ఇంతకు మునుపు మనం ఆర్థరైటిస్ ను నివారించలేమని , నయం చేసే వ్యాధికాదని చెప్పుకున్నాము. కానీ కొన్ని థెరఫిటిక్ పద్దతుల వల్ల ఆర్థరైటిస్ పెయిన్ ను నివారించుకోవచ్చు.

ఆరోగ్యకర బరువు:

ఆరోగ్యకర బరువు:

అధికబరువు లేదా ఊబకాయంతో ఉన్నవారిలో ఆర్థరైటిస్ పెయిన్ మరింత తీవ్రంగా ఉంటుంది. మీ శరీర బరువు కీళ్ల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా మోకాలు, హిప్స్, పాదాల మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడం లేదా హెల్తీ బిఎంఐ మెయింటైన్ చేయడం వల్ల మీ ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించుకోవచ్చు.

హాట్ బాత్:

హాట్ బాత్:

ఆర్థరైటిస్ తో బాధపడే వారికి థెరఫిస్ట్ లు ప్రతి రోజూ ఉదయం హాట్ బాత్ లేదా వార్మ్ బాత్ చేసుకోమని సూచిస్తుంటారు. ముఖ్యంగా హాట్ బాత్, వార్మ్ బాత్ చేసేటప్పుడు నొప్పులన్న భాగాలను ఎక్కువ సేపు వేడినీటిలో డిప్ చేయడం వల్ల కొంత వరకు ఉపశమనం కలుగుతుంది. నొప్పి తగ్గతుంది. జాయింట్ స్టిఫ్ నెస్ నుంచి కొద్దిగా ఉపశమనం కలిగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ హీటెడ్ పాడ్స్ కూడా నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి.

ఐస్ ప్యాక్స్:

ఐస్ ప్యాక్స్:

కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఐస్ ప్యాక్ వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఐస్ ప్యాక్ ఫ్రోజోన్ వెజిటేబుల్ బ్యాగ్స్ లో వేసి మసాజ్ చేసుకోవాలి. ఈ కోల్డ్ ప్యాక్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. నొప్పి తగ్గుతుంది.

ఆక్యుపంక్చర్:

ఆక్యుపంక్చర్:

ఇది చాలా పురాతన పద్ధతి. చైనీస్ థెరఫీ సూదులను ఉపయోగిస్తారు. ఇలా ఆర్థరైటిస్ తో బాధపడే వారికి నొప్పి తగ్గించడం కోసం నొప్పి ఉన్న ప్రదేశంలో సూదలతో గుచ్చుతారు. అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ థెరఫీని కేవలం అనుభవజ్ఝుల వద్ద మాత్రమే చేయించుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.

శారీరక శ్రమ:

శారీరక శ్రమ:

ఆర్థరైటిస్ తో బాధపడే వారికి, సూచించే సలహా ప్రతి రోజూ రెగ్యులర్ గా వ్యాయామం చేయాలి . ప్రతి రోజూ కనీసం 30నిముషాల వ్యాయాం చేయడం వల్ల జాయింట్స్ మరింత ఫ్లెక్సిబుల్ గా మారుతాయి .దాంతో కండరాల పట్టివేత నుండి ఉపశమనం కలుగుతుంది. అంతే కాదు వ్యాయామం వల్ల ఆరోగ్యం బాగుంటుంది మరియు శరీరం ఫిట్ గా ఉంటుంది.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు . ఈ ఫ్యాటీ యాసిడ్స్ బోన్స్ కు పోషణ అందిస్తుంది మరియు జాయింట్స్ పెయిన్స్ తగ్గుతాయి . ఫిష్ ఆయిల్ సప్లిమెంట్ ను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సి వుంటుంది.

పసుపుతో తయారుచేసిన వంటలు:

పసుపుతో తయారుచేసిన వంటలు:

రెగ్యులర్ వంటల్లో తప్పనిసరిగా పసుపును చేర్చాలి. ఆర్థరైటిస్ లక్షణాలు కనిపించిన వెంటనే పసుపును మరింత ఎక్కువగా ఉపయోగించడం మంచిది . పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది జాయింట్ పెయిన్ మరియు స్టిఫ్ నెస్ ను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

మసాజ్ మరియు మెడిటేషన్:

మసాజ్ మరియు మెడిటేషన్:

రీసెర్చ్ ప్రకారం, ప్రొఫషినల్స్ చేత మసాజ్ చేయించుకోవడం , రెగ్యులర్ గా యోగా చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది . దాంతో ఆర్థరైటిస్ పెయిన్ స్టిఫ్ నెస్ నుండి ఉపశమనం కలుగుతుంది.

English summary

8 Simple Natural Ways To Reduce Arthritis Pain

8 Simple Natural Ways To Reduce Arthritis Pain. Arthritis is a condition in which inflammation and stiffness of the joints occur, causing a lot of pain.
Desktop Bottom Promotion