For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోని దురద(వైజినల్ ఇచ్చింగ్ )ను నివారించుకోవడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!

యోని దురద సమస్య ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మంట అనిపిస్తుంది. దీనిని తగ్గించుకోవటానికి ఇంటి నివారణలు ఉన్నాయి. ఈ పరిస్థితి రోజు రోజుకి పెరగక ముందే నివారించుకోవడం మంచిది.

By Lekhaka
|

యోని దురద సమస్య ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో మంట అనిపిస్తుంది. దీనిని తగ్గించుకోవటానికి ఇంటి నివారణలు ఉన్నాయి. ఈ పరిస్థితి రోజు రోజుకి పెరగక ముందే నివారించుకోవడం మంచిది. ఈ సమయంలో కొన్ని చిట్కాలను పాటించినట్లైతే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

యోని దురదకు కొన్ని రసాయన చికాకులు, ఈస్ట్ సంక్రమణ, రుతువిరతి లేదా లైంగిక సంక్రమణ వ్యాధులు వంటివి కారణాలుగా చెప్పవచ్చు.

యోని దురదతో పాటు జననాంగం చుట్టూ ఎర్రదనం లేదా వాపు, తెల్లని డిశ్చార్జ్ , విపరీతమైన వాసన ఉన్నాయేమో అని తనిఖీ చేయాలి. ఈ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితమైన కారణం మరియు తదుపరి పరిష్కారం కొరకు డాక్టర్ ని సంప్రదించాలి.

10 Home Remedies To Get Rid Of Vaginal Itching!,

యోని లోపల ప్రాంతంను శుభ్రం చేయటానికి ఎప్పుడు కఠినమైన రసాయనాలు లేదా సబ్బును ఉపయోగించకూడదు. కేవలం బయట సాదా నీటితో శుభ్రం చేయాలి. యోనిలో మంచి మరియు చెడు బాక్టీరియా రెండూ ఉంటాయి. జననేంద్రియ ప్రాంతంలో వ్యాధి కారకాలను మంచి బ్యాక్టీరియా చంపుతుంది.

శరీరం నుండి విషాన్ని బయటకు పంపటానికి సహాయపడే ఫైబర్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. వదులుగా ఉండే దుస్తులను ధరించటం మరియు నీటిని ఎక్కువగా త్రాగాలి.

అంతేకాక యోని దురదను తగ్గించటానికి ఇక్కడ కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటి మీద ఒక లుక్ వేద్దాం.

 కోల్డ్ కంప్రెస్

కోల్డ్ కంప్రెస్

ఒక శుభ్రమైన క్లాత్ లో కొన్ని ఐస్ ముక్కలను వేసి వ్రాప్ చేయాలి.

యోనికి వ్యతిరేకంగా కంప్రెసర్ తో నొక్కండి. ఆలా కొన్ని సెకన్ల పాటు చేయాలి.

మరల రిపీట్ చేయాలి. ఐస్ కారణంగా మంట స్వాంతన మరియు దురద నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్

ఒక కప్పు గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి కలపాలి.

ఈ ద్రావణంతో మంట ఉన్న ప్రాంతాన్ని కడిగి మెత్తని టవల్ తో తుడవాలి. ఈ విధంగా రోజులో రెండు సార్లు చేయాలి.

వెనిగర్ లో యాంటి ఫంగల్ లక్షణాలు ఉండుట వలన బాక్టీరియాను చంపడానికి మరియు మళ్ళీ రాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది.

పెరుగు

పెరుగు

పెరుగులో లాక్టిక్ ఆమ్లం మరియు ప్రోబైయటిక్ లక్షణాలు ఉండుట వలన యోని లో మంచి బ్యాక్టీరియా సంతులనంను పునరుద్ధరించడానికి సహాయపడుతుంది.

ఒక కప్పులో ఒక స్పూన్ పెరుగును తీసుకోని ఒక కాటన్ బాల్ సాయంతో యోని ప్రాంతంలో రాసి 15 నిముషాలు అయ్యాక సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

సముద్రపు ఉప్పు

సముద్రపు ఉప్పు

స్నానము చేసే నీటిలో కొంచెం సముద్రపు ఉప్పు వేయాలి.

10 నుంచి 15 నిముషాలు ఆలా వదిలేస్తే ఉప్పు నీటిలో కరుగుతుంది.

ఉప్పులో ఉండే ఖనిజాలు ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి

ఒక స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ తో 5 లేదా 6 చుక్కల వెల్లుల్లి నూనెను కలపాలి.

ఈ నూనెను యోని ప్రాంతంలో రాయాలి.

పది నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.

ఈ విధంగా రోజులో ఒకసారి చేయాలి.

వెల్లుల్లిలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఈస్ట్ విచ్ఛిన్నం మరియు బాక్టీరియా చంపడానికి సహాయపడుతుంది.

వేప

వేప

ఒక కప్పు నీటిలో కొన్ని వేప ఆకులను వేసి మరిగించాలి.

మరిగించిన నీటిని వడగట్టాలి. ఈ నీటిని ఉపయోగించి యోని ప్రాతంలో కడగాలి.

వేపలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్రిమినాశక లక్షణాలు ఉండుట వలన యోని దురదను తొందరగా తగ్గిస్తుంది.

కలబంద

కలబంద

కలబందలో అల్లిసిన్, యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్ E ఉండుట వలన స్వాంతన కలిగించేందుకు మరియు దురద తగ్గించటానికి సహాయపడుతుంది.

కలబంద ఆకు నుండి జెల్ ని వేరు చేయాలి.

ఈ జెల్ ను యోని ప్రాంతంలో రాసి 10 నిముషాలు అయ్యాక శుభ్రం చేయాలి.

 క్రాన్బెర్రీ జ్యూస్

క్రాన్బెర్రీ జ్యూస్

క్రాన్బెర్రీ జ్యూస్ లో ఆమ్ల కంటెంట్ ఉండుట వలన ఈస్ట్ మరియు బ్యాక్టీరియాను చంపటానికి సహాయపడుతుంది.మీ సిస్టం నుండి విషాన్ని బయటకు పంపటానికి మరియు దురద తగ్గటానికి ప్రతి రోజు ఒక గ్లాస్ క్రాన్బెర్రీ జ్యూస్ త్రాగాలి.

తేనె

తేనె

తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన చర్మం యొక్క సూక్ష్మజీవుల ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడుతుంది. తేనెను యోని ప్రాంతంలో పలుచగా రాసి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజులో ఒకసారి చేయాలి.

రోజ్మేరీ ఆకులు

రోజ్మేరీ ఆకులు

యోని ప్రాంతంలో దురద చికిత్సలో రోజ్మేరీ ఆకులు బాగా సమర్ధవంతంగా పనిచేస్తాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండుట వలన యోని ప్రాంతాన్ని శుభ్రంగా, పొడి మరియు తేమగా ఉంచుతుంది.

English summary

10 Home Remedies To Get Rid Of Vaginal Itching!

Are you experiencing itching and burning sensation in your vaginal area and wondering if there are any home remedies for it? Is the condition becoming severe with each passing day? Then it is time, you take some action!
Story first published: Friday, January 6, 2017, 18:18 [IST]
Desktop Bottom Promotion