For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వినాయకుని చరిత్ర నేర్పే ఆరు జీవితపాఠాలు

  |

  వినాయకుడు సిద్ధి, బుద్ధి మరియు శ్రేయస్సుకు అధిపతి. ఈయన విఘ్నాధిపతి. ఏ పని మనం చేపట్టినా, దానికి ఎదురయ్యే అవాంతరాలను తొలగించి, విజయవంతమయ్యేలా చేయడంలో గణపతి హస్తం ఉంటుంది. సంప్రదాయం ప్రకారం, ఏ పని మొదలుపెట్టినా వినాయకునికి తొలి పూజలందించడం అనాదిగా మన ఆనవాయితీ.

  వినాయకుడు మనుష్య మరియు జంతు రూపాల సమ్మేళనంలో ఉంటాడు. దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత యొక్క తాత్విక అవగాహన దాగి ఉంది. వీటి మూలంగానే వినాయకునికి విశేష ప్రాధాన్యత లభిస్తుంది.

  అసలు వినాయకుడే తొలిపూజలను ఎందుకు అందుకుంటున్నాడు?

  గజ ముఖం మరియు బాన పొట్టతో, ఎలుకను వాహనంగా గణేశుడు చిత్రీకరింపబడ్డాడు. ఈయన జ్ఞానానికి మరియు విజ్ఞతకు అధిపతి. ఈయన విజ్ఞహర్త. అపశకునాలన్నింటిని తొలగిస్తారు. గజముఖం అతని జ్ఞానానికి చిహ్నం. పెద్ద చెవులు, ఆయన భక్తులు తెలియజేసుకునే గోడునంతటిని వింటున్నాడని చెప్పడానికి సంకేతం.

  వినాయకునికి సంబంధించిన విశేషాలు, అతని గొప్పదనం తెలియజేసే పురాణ గాధలు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. వినాయకుడు జ్ఞానానికి అధిపతి ఎలా అయ్యాడా చెప్పే కధలు కూడా ఉన్నాయి. ఇతని జీవితం నుండి మనం నేర్చుకోవలసిన ఆరు పాఠాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  1. మన బాధ్యతలను ఎప్పుడు మనం మరువరాదు.

  1. మన బాధ్యతలను ఎప్పుడు మనం మరువరాదు.

  మనకు శివుడు వినాయకుని శిరచ్చేధం చేయటం, ఏనుగు తలకాయ తగిలించడం గురించిన కధ తెలిసినదే! ఈ కధ ద్వారా మనకు కర్తవ్యం మరియు బాధ్యత అన్నిటికన్నా ముఖ్యమైనవని తెలుస్తుంది. వినాయకుడు తన తల్లి అప్పగించిన బాధ్యత నెరవేర్చడానికి, తన శిరస్సును త్యాగం చేసాడు.

  2. పరిమిత వనరులను, ఉత్తమంగా వినియోగించుకోవాలి.

  2. పరిమిత వనరులను, ఉత్తమంగా వినియోగించుకోవాలి.

  మనలో చాలామంది ,ఎప్పుడు మనకు తక్కువైన వాటి గురించి చింతిస్తుంటాం. కానీ గణేశ, కార్తికేయుల మధ్య జరిగిన పందెం పరిమితులున్నప్పుడు, వనరులను ఎంత సమర్ధవంతంగా వినియోగించుకోవాలో తెలియజేస్తుంది. ఈ కధ ప్రకారం, వినాయక, కార్తిజేయులకు మధ్య వారి తల్లిదండ్రులు ముల్లోకాలను మూడుసార్లు ఎవరు ముందుగా చుట్టూ వస్తారో అని పోటీ పెట్టారు. ముందుగా వచ్చిన వారికి అద్భుతమైన ఫలం లభిస్తుందని చెప్పారు. కార్తికేయుడు తన వాహనమైన నెమలిపై వెంటనే బయలుదేరాడు. వినాయకుడు సందేహంలో పడ్డాడు. తన చిట్టి ఎలుక సహాయంతో ఆ సవాలును స్వీకరించలేక, తల్లితండ్రుల చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి, ముల్లోకాలను మూడుసార్లు చుట్టిన ఫలితాన్ని పొందాడు.

  3. మంచి శ్రోతగా ఉండాలి.

  3. మంచి శ్రోతగా ఉండాలి.

  గణేశుని ఏనుగు చెవులు ప్రభావవంతమైన సంభాషణ క్రమానికి చిహ్నం. ఒక పరిస్థితిని సమర్ధవంతంగా చెక్కబెట్టడానికి ముందుగా, ఎదుటివారు చెప్పేది సక్రమంగా వినాలి. దీనివలన సమస్యను కూలంకషంగా అర్ధం చేసుకుని, సులభంగా, సమగ్రంగా విశ్లేషించి, సరైన నిర్ణయం తీసుకునే వీలు ఉంటుంది.

  4. అధికారాన్ని అదుపులో పెట్టుకోవాలి.

  4. అధికారాన్ని అదుపులో పెట్టుకోవాలి.

  హోదాతో పాటు మనకు కొన్ని ప్రత్యేక అధికారాలు లభిస్తాయి. వీటితో పాటుగా మనకు గర్వం పెరుగుతుంది. వినాయకుని తొండం పైకి ముడుచుకుని ఉంటుంది. ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలనే తత్వం దీనిని చూసి నేర్చుకోవాలి. మన అధికారాలను అదుపులో పెట్టుకుని మంచికై వాటిని వినియోగించాలి.

  5. క్షమాగుణం అలవర్చుకోవాలి.

  5. క్షమాగుణం అలవర్చుకోవాలి.

  ఒకనాడు వినాయకుడు ఒక విందుకు హాజరయ్యి అతిగా ఆరగించాడు. విందు నుండి తిరిగి వస్తున్న వినాయకుని పొట్టను చూసి చంద్రుడు ఫక్కున నవ్వాడు. అంతట, వినాయకుడు చంద్రుని అదృశ్యమైపోమని శాపమిచ్చాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న చంద్రుడు వినాయకుని క్షమాపణ కోరుకుంటాడు. శీఘ్రమే శాపవిమోచన కలిగించిన వినాయకుడు, ప్రతినెలా చంద్రుని కళ తగ్గుతూ వచ్చి ఒకరోజు పూర్తిగా అంతర్ధానమవుతాడని సెలవిచ్చాడు. క్షమాగుణం వినాయకుని చూసి మనం అలవర్చుకోవాలి

  6. వినయంతో మేలుగుతూ, ఇతరులను గౌరవించాలి

  6. వినయంతో మేలుగుతూ, ఇతరులను గౌరవించాలి

  దీనికి ఉత్తమ ఉదాహరణ వినాయకుని వాహనం. కొండ అంతటి వినాయకుడు, చిన్న ఎలుకపిల్లను అధిరోహించి ముల్లోకాలలో సంచరిస్తాడు. దీనిని బట్టి ఆయన చిన్న జీవిని అయినప్పటికీ ఎలుకను కూడా గౌరవించి, మర్యాద ఇస్తారు అని తెలుస్తుంది. ఇది మనమందరం తప్పక అనుసరించాల్సిన లక్షణం. అలా అయితేనే మనం జీవితంలో మంచి స్థాయికి చేరుకోవచ్చు.

  English summary

  6 life lessons to learn from lord ganesha

  6 life lessons to learn from lord ganesha
  Story first published: Sunday, June 3, 2018, 11:00 [IST]
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more