For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శారీరక దృఢత్వం, కండరాల పటిష్టతకు ఈ ఆయుర్వేద మూలికలు ఉపయోగించండి, బాడీ షేప్ మారిపోతుంది

ఆయుర్వేద మందులు నెమ్మదిగా మరియు సహజ సిద్దముగా పనిచేస్తాయి. మరియు మొత్తం ఆరోగ్యం పెంపొందిచడమే కాకుండా, శరీరిక బలాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వాస్తవానికి ఆయుర్వేదం మాత్రమే సురక్షితమైన, చట్టబద్దమైన, సమర్థ

|

అనేక మంది బాడీ బిల్డర్లు, క్రీడాకారులు తమ దేహ ధారుడ్యం కొరకు, రసాయనిక సప్లిమెంట్ల మీద ఆధారపడడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అవి ఫలితాలను తాత్కాలికంగా ఇచ్చినా, దుష్ప్రభావాలను మాత్రం అధికంగా కలిగి ఉంటాయన్న మాట వాస్తవం. అవునా?

ఈ మందులలో ప్రోటీన్ పొడులు, విటమిన్లు, ఖనిజాలతో కూడిన సప్లిమెంట్లు మొదలైనవి ఉంటాయి. కొందరు ఏకంగా అనబాలిక్ స్టెరాయిడ్లను కూడా ఉపయోగిస్తుంటారు. వాస్తవానికి వీటిలోని దుష్ప్రభావాల కారణంగా, అనేక రకాల స్టెరాయిడ్లను చట్టరీత్యా నిషేధించారు కూడా. ఇటువంటి స్టెరాయిడ్ల వాడకం, ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు కూడా.

కానీ ఆయుర్వేద మందుల ప్రకారం, అవి కేవలం ఆహార పదార్థాలు, మూలికలు వంటి సహజ సిద్దమైన వనరులతో కూడుకుని సహజ పోషకాలతో దుష్ప్రభావాలు లేనివిగా ఉంటాయి. తక్షణ ఫలితాలను అందివ్వకపోయినా, కాలానుగుణంగా మెరుగైన ఫలితాలను ఇచ్చేవిలా ఉంటాయి. మరియు శరీర జీవక్రియలను ఆరోగ్యకర రీతిలో పెంచేవిలా ఉంటాయి.

ఆయుర్వేద మందులు నెమ్మదిగా మరియు సహజ సిద్దముగా పనిచేస్తాయి. మరియు మొత్తం ఆరోగ్యం పెంపొందిచడమే కాకుండా, శరీరిక బలాన్ని కూడా మెరుగుపరుస్తాయి. వాస్తవానికి ఆయుర్వేదం మాత్రమే సురక్షితమైన, చట్టబద్దమైన, సమర్థవంతమైన ఎంపికలతో శారీరిక బలాన్ని పెంచుతుంది. క్రమంగా కండర ద్రవ్యరాశిని, సహన శక్తిని కూడా పెంచుతుంది. అంతేకాకుండా ఆరోగ్యకర రీతిలో బరువు పెరుగుదల మరియు భౌతిక శక్తిని సహజ సిద్దంగా పెంచగలదు.

ఆయుర్వేదం ప్రకారం, కండరాల ద్రవ్యరాశి అనేది కేవలం అధిక ప్రోటీన్ ఆహారం మీద మాత్రమే కాకుండా, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్ల వంటి ముఖ్యమైన పోషకాల మీద కూడా ఆధారపడి ఉంటుందని చెప్పబడింది. ఆయుర్వేదంలో శక్తిని పెంచడానికి మరియు కండర నిర్మాణానికి సూచించదగిన కొన్ని ప్రత్యేకమైన మూలికలు ఉన్నాయి. మీరు వాటిని మాత్రలుగా లేదా అల్పాహారంలో స్మూతీలలో కలుపుకుని తీసుకోవచ్చునని చెప్పబడింది .

బాడీబిల్డింగ్ మరియు కండర ద్రవ్యరాశి కోసం ఆయుర్వేదాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం మీకు సహకరిస్తుంది.

1. అశ్వగంధ :

1. అశ్వగంధ :

ఆయుర్వేదంలో ఈ మూలికకు అత్యంత ప్రాముఖ్యతను కల్పించబడింది. దీనిని భారత జిన్సెంగ్ అని వ్యవహరిస్తుంటారు. మరియు శాశ్వత మూలికగా అధిక కాలం నిల్వ ఉంటుంది. ఇది అన్ని రకాల బాడీ బిల్డింగ్ మందులలో మరియు అనుబంధ ఔషధాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఈ మూలికను టెస్టోస్టీరాన్ స్థాయిలను మెరుగుపరచడంలో మరియు శారీరిక, లైంగిక శక్తి స్థాయిలను ప్రోత్సహించడానికి ఉపయోగించబడుతుంది.

అంతేకాకుండా, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది మరియు తీవ్రమైన వ్యాయామ సెషన్ల నుండి శీఘ్రంగా శరీరం స్వాంతన పొందడంలో సహాయపడుతుంది. అలాగే, వివిధ రకాల ఔషధాలలో కూడా అశ్వగంధను సహాయకారిగా వినియోగించడం జరుగుతుంది.

ఎ. అశ్వగంధ అవలేహ

ఎ. అశ్వగంధ అవలేహ

ఇది ఒక ఆయుర్వేదిక్ సప్లిమెంట్. క్రీడాకారులు, దేహదారుడ్యకులు తమ శక్తి స్థాయిలను మెరుగుపరచుకునే క్రమంలో భాగంగా వినియోగించడం జరుగుతుంది. ఇది శారీరక బలాన్ని మరియు శక్తిని పెంచడమే కాకుండా వ్యాయామ సెషన్ల నుండి సత్వర ఉపశమనానికి కూడా ఎంతగానో తోడ్పాటును అందిస్తుంది. అంతేకాకుండా రెగ్యులర్ వ్యాయామాలతో కండర ద్రవ్యరాశిని నిర్మించడంలో సహాయపడుతుంది. క్రమంగా బాడీ బిల్డింగ్ కోసం సూచించబడే ఉత్తమ ఆయుర్వేదిక్ మందులలో ఇది కూడా ఒకటిగా ఉంటుంది.

బి. అశ్వగంధ పాక్

బి. అశ్వగంధ పాక్

దీనిని కండర ద్రవ్యరాశి, శారీరిక బలం మరియు శక్తిని ప్రోత్సహించడంలో అత్యంత సహాయకారిగా పనిచేసే ప్రముఖ శరీర నిర్మాణ సంబంధ ఔషధంగా వ్యవహరించడం జరుగుతుంది. కండర నిర్మాణానికి ఏరోబిక్స్ కాని వ్యాయామాలు చేసే వ్యక్తులకు కూడా ఈ ఔషధం అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.

సి. అశ్వగంధ అర్జున క్షీర్

సి. అశ్వగంధ అర్జున క్షీర్

బాడీ బిల్డింగ్లో సహాయపడే ఈ ఆయుర్వేదిక్ ఔషధం అనామ్లజనకాలతో సమృద్దిగా ఉంటుంది. ఏరోబిక్స్ మరియు నాన్ ఏరోబిక్ వ్యాయామ సామర్థ్యాలను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. ఇది కార్డియో టానిక్ వలె కూడా ఉపయోగించబడుతుంది. మరియు నాన్ ఏరోబిక్ రన్నింగ్ సామర్థ్యాన్ని మెరుగుపర్చడంలో సహాయపడుతుంది.

2. షతావరి :

2. షతావరి :

బాడీ బిల్డింగ్ ఔషధాలలో అత్యంత ప్రసిద్ది చెందిన షతావరి అనామ్లజనకాలలో సమృద్దిగా ఉంటుందని చెప్పబడింది. దెబ్బతిన్న కణాలను సరిచేయడంలో సహాయపడడమే కాకుండా, క్రోమియం, K, E, C మరియు A విటమిన్లకి మూలంగా కూడా ఉంటుంది.

షతావరి, శరీరంలోని అదనపు ఉప్పు మరియు నీటిని సంగ్రహించి మూత్రం ద్వారా బయటకు పంపగలిగే అమైనో ఆమ్లాలతో పుష్కలంగా నిండి ఉంటుంది. శరీరంలోని విషతుల్య రసాయనాలను బయటకి పంపివేస్తూ, ఆరోగ్యకర జీవక్రియలకు దోహదం చేస్తూ మంచి శరీరాకృతి సాధించడంలో మీకు సహాయపడుతుంది. ఇది కండరాల నిర్మాణం కోసం సూచించదగిన ఆయుర్వేద మూలికలలో ఒకటిగా చెప్పబడుతుంది.

వివిధ రకాల ఔషధాలను పరిశీలించండి :

వివిధ రకాల ఔషధాలను పరిశీలించండి :

ఎ. కామేశ్వర్ మోదక్ :

కండరాల బలాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే ఒక ఆయుర్వేదిక్ అఫ్రొడిసిక్ ఔషధంగా కూడా దీనిని పిలుస్తారు. ఇది షతావరి, విదారికండ్, అశ్వగంధ, తలాంఖానా, నాగ్బాల మరియు యష్టిమధు వంటి అనేక ఉత్తమమైన మూలికలతో తయారుచేయబడింది.

ఈ ఔషధం కండరాల నాణ్యతను మెరుగుపరచడమే కాకుండా, ఆటలలో పనితీరుని, మరియు సహన శక్తిని పెంచుతుంది.

బి. మద్నానంద్ మోదక్ :

బి. మద్నానంద్ మోదక్ :

ఇది ఆయుర్వేదంలో హెర్బో ఖనిజ సూత్రీకరణగా పనిచేసే పునరుద్ధరణ టానిక్ (ఎలెక్త్రోలైట్ ద్రావణం వలె) గా పరిగణించబడుతుంది . ఇది శోషక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది మరియు శక్తిని పునరుద్దరించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

3. గోఖ్రు :

3. గోఖ్రు :

ఆయుర్వేదం మందులు మరియు ఔషధాలలో భాగమైన ఈ గోఖ్రు, ప్రసిద్ధ బాడీ బిల్డింగ్ మూలికగా చెప్పబడుతుంది. ఇది కండర ద్రవ్యరాశికి మద్దతు ఇవ్వడం మరియు శక్తి మరియు సహన స్థాయిలను మెరుగుపరచడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.

రక్త ప్రసరణకు తాజా ఆక్సిజన్ సరఫరాను అందించడంలో సహాయం చేస్తుంది. క్రమంగా కణజాలాలను హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. గోఖ్రును ఉపయోగించి గోఖ్రు పాక్ తయారు చేయడం జరుగుతుంది.

ఎ. గోఖ్రు పాక్ :

ఎ. గోఖ్రు పాక్ :

ఇది వ్యాయామం వలన కలిగే అలసటను తగ్గించడమే కాకుండా, శరీరంలో శక్తి స్థాయిలను పెంచడంలో ఉత్తమంగా పనిచేస్తుంది. క్రమంగా ఒక శక్తివంతమైన బాడీబిల్డింగ్ ఔషధంగా చెప్పబడుతుంది. ఇది శరీర కండరాలకు అద్భుతమైన బలం అందిస్తుంది మరియు కండరాల ద్రవ్యరాశి పెరుగుదలలో తోడ్పాటును అందిస్తుంది.

4. సలాబ్ పంజా వేరు :

4. సలాబ్ పంజా వేరు :

ఈ ఆయుర్వేద మూలిక, కండర ద్రవ్యరాశిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బాడీబిల్డింగ్ లో సహాయపడే కణజాలాల రూపకల్పనలో అనబాలిక్ ప్రభావాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కండరాల బలాన్ని ప్రోత్సహించడమే కాకుండా మరియు శరీర బరువును కూడా నెమ్మదిగా పెంచుతుంది. ఈ వేరు నుండి సలాబ్ పాక్ తయారు చేయడం జరుగుతుంది.

ఎ. సలాబ్ పాక్ :

ఎ. సలాబ్ పాక్ :

ఈ బాడీ బిల్డింగ్ ఔషదాన్ని సలాబ్ పంజాతోపాటుగా, బాదం, పిస్తా, వాల్నట్, అశ్వగంధ, గోక్షుర వంటి డ్రైఫ్రూట్స్ నుండి తయారుచేస్తారు. ఇది శారీరక మరియు మానసిక అలసట నుండి ఉపశమనాన్ని అందించడంలో సహాయపడుతుంది.

ఇది కండరాల నొప్పిని నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది కండరాల పెరుగుదలకు సూచించదగిన ఉత్తమ ఆయుర్వేద మందులలో ఒకటిగా చెప్పబడుతుంది.

5. సఫేద్ ముస్లి :

5. సఫేద్ ముస్లి :

ఆయుర్వేద సాహిత్యంలో సఫేద్ ముస్లిని 'దివ్య ఔషదం' అని చెప్పబడుతుంది. ఇది అనేక ప్రయోజనకరమైన లక్షణాలతో సమృద్ధంగా ఉంటుంది మరియు అధిక ఔషధ విలువలను కలిగి ఉంటుంది. ఇది కూడా కండరాలను బలోపేతం చేయడంలో మరియు కణజాల నిర్మాణానికి మద్దతునివ్వడంలో ఉత్తమంగా సహాయపడగల ఆయుర్వేద అనుబంధ మూలికగా చెప్పబడుతుంది.

ఎ. ముస్లి పాక్ :

ఎ. ముస్లి పాక్ :

ఈ ఆయుర్వేద సూత్రీకరణ శారీరక బలాన్ని ప్రోత్సహించడానికి ప్రసిద్ధి చెందినదిగా చెప్పబడుతుంది. మరియు శృంగార జీవితానికి సహాయపడగల లక్షణాలను సైతం కలిగి ఉంటుంది. ఈ ఆయుర్వేద సప్లిమెంట్ శారీరిక పనితీరు, బలం మరియు సహన శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కండర ద్రవ్యరాశిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

పై మూలికలను అనుసరించే ముందు

పై మూలికలను అనుసరించే ముందు

పై మూలికలను అనుసరించే ముందు మీ ఆయుర్వేదిక్ వైద్యుని సంప్రదించడం మాత్రం మరచిపోకండి. మందులు ఎటువంటి అనుకూల ప్రభావాలను ఇచ్చినప్పటికీ, మోతాదుల విషయంలో తగిన సూచనలు పాటించడం అవసరమని గుర్తుంచుకోండి. శారీరిక, వయో, లింగ, భేదాల కారణంగా వైద్యులు దృవీకరించిన మొతాదులలోనే ఔషధాలను స్వీకరించవలసి ఉంటుంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Ayurveda for bodybuilding and muscle gain

Ayurveda Has The Solution For Bodybuilding & Muscle Gain! Read To Find Out
Desktop Bottom Promotion