For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గాలని భావించేవారు అరటి పండు ఆ టైమ్ లో తినండి

|

అరటి పండు సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండే ఆహార పదార్ధాలలో ఒకటిగా ఉంటుంది. ఇది ఆహార ప్రణాళికలతో సంబంధంలేని పండుగా ఉన్నప్పటికీ, వ్యాయామం సమయంలో స్నాక్స్ వలె తీసుకోడానికి అనువైనదిగా ఉంటుంది.

ఈ పండు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు మరియు రోగ నిరోధక తత్వాలను పెంచే పిండి పదార్ధాల కలయికతో, గ్లైసెమిక్ సూచికలో తక్కువ స్థాయిలో ఉంటుంది. అంతేకాకుండా మంచి జీర్ణ వ్యవస్థను ప్రోత్సహిస్తూ, కాలరీలను క్రమంగా కొవ్వును కరిగించడంలో కీలకపాత్ర పోషించగలదు. అవును మీరు విన్నది నిజమే!

అరటి పండ్లు నిజంగానే బరువుని తగ్గించడంలో సహాయపడుతుంది. కావున బరువు తగ్గే ఆలోచనలో ఉన్నవారు క్రమం తప్పకుండా అరటి పండును స్వీకరించడం మంచిదిగా ఆహార నిపుణులు సూచిస్తున్నారు. ఇతర పండ్లు లేదా వోట్మీల్ తో పాటుగా అల్పాహారంలో అరటి పండును తీసుకోవడం ద్వారా, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయం చేయగలదని చెప్పబడింది.

Best Time To Eat Banana For Weight Loss

వాస్తవానికి జిమ్ ముందు తీసుకోదగిన స్నాక్ వలె అద్భుతంగా పనిచేసే అరటి పండు, పుష్కలమైన ఆరోగ్య లక్షణాలతో కూడిన గొప్ప అల్పాహారంగా పనిచేస్తుంది. దీనిలోని ఆరోగ్యకరమైన మరియు పోషకభరితమైన లక్షణాలు, బరువును తగ్గించడంలో భాగంగా సహాయపడగలవు. కానీ ప్రత్యేకించి కేవలం ఒకే ఆహార పదార్ధం బరువును తగ్గిస్తుంది అని చెప్పడం మాత్రం సరికాదు. వీటికి జోడుగా మరికొన్ని ఆహార పదార్ధాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి.

Best Time To Eat Banana For Weight Loss

కావున, అధికంగా బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును వదిలించుకోవాలని భావిస్తున్న ఎడల, ఆ ప్రకారంగా ఆహార, జీవనశైలి ప్రణాళికలలో మార్పులు చేసుకోవడం ముఖ్యం. రోజువారీ కార్యక్రమాలలో భాగంగా కనీసం 10-15% కాలరీల తగ్గింపు అనేది, బరువు తగ్గడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Eat Banana For Weight Loss

అసలెందుకు మీరు అరటిపండును తీసుకోవాలి?

అరటి పండు పొటాషియం, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, ఫైబర్, ఖనిజాలు మరియు శక్తి యొక్క గొప్ప వనరుగా ఉంటుంది. అంతేకాకుండా వయో ప్రామాణికం లేనిదిగా ప్రతి ఒక్కరూ ఆస్వాదించదగినదిగా ఉంటుంది.

Best Time To Eat Banana For Weight Loss

100గ్రా అరటి పండు శరీరానికి కనీసం, సుమారు 90 నుండి 110 కేలరీల శక్తిని అందిస్తుంది. అరటి పండు, శరీరాన్ని చురుకుగా చేయడమే కాకుండా, శక్తిని ప్రేరేపించే ఆరోగ్యకరమైన పిండి పదార్థాల కలయికగా ఉంటుంది. మరియు పొటాషియం ఎక్కువగా ఉన్న కారణంగా, రక్తపోటును తగ్గిస్తుంది కూడా.

Best Time To Eat Banana For Weight Loss

అంతేకాకుండా, అరటి పండులోని ఫైబర్ కంటెంట్ మీ ఆకలి స్థాయిలని క్రమబద్దీకరిస్తుంది. మరియు అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా పెరిగిన బరువును తగ్గించుకునే క్రమంలో మీకు సహకారాన్ని అందిస్తుంది.

Best Time To Eat Banana For Weight Loss

అదనంగా, అరటి పండు విటమిన్B6 యొక్క గొప్ప మూలంగా ఉంటుంది. ట్రిప్టోఫాన్ యొక్క ఉనికిని అరటిపండు నిరోధిస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడించాయి కూడా. దీనిలోని ఇనుముతో కూడిన అనేక ఇతర ఖనిజాలు మలబద్ధకం సమస్యను నిర్మూలించడంతో పాటు, రక్తహీనతతో బాధపడుతున్న వారికి మంచి ప్రయోజన కారిగా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి.

Best Time To Eat Banana For Weight Loss

అరటి పండు, మంచి వ్యాయామాన్ని ప్రోత్సహించేలా కావలసిన శక్తిని ప్రేరేపించే సహజ చక్కెరలను కలిగి ఉంటుంది. ఒక మంచి వ్యాయామానికి మన శరీరానికి కావలసిన ఇంధనంలా పనిచేస్తుంది.

Best Time To Eat Banana For Weight Loss

అరటి పండ్లు తినడానికి కూడా సమయం ఉంటుందా?

అరటి పండు అన్ని వయసుల వారికి ఇష్టమైన ఆహార పదార్ధాలలో ఒకటిగా ఉంటుంది. ఉదయాన్నే ముఖ్యంగా అల్పాహారం సమయంలో, కొన్ని పండ్లు/వోట్మీల్ వంటి ఆహార పదార్ధాలతో తీసుకోవడం ద్వారా, బరువును తగ్గించడంలో అద్భుతాలు చేయవచ్చునని చెప్పబడింది.

మీరు రోజువారీ ప్రాతిపదికన వినియోగించునప్పుడు, క్రమంగా దాని ప్రయోజనాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకుంటారు. మీరు ముడి అరటి పండును మాత్రమే కాకుండా, సలాడ్లు, మిల్క్ షేక్స్, డిజర్ట్లు వంటి వాటితో కూడా తీసుకోవచ్చు.

Best Time To Eat Banana For Weight Loss

అరటి పండుతోనే కేవలం ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అనుకోవడం పొరపాటే, ఆరోగ్య నిపుణుల ప్రకారం అరటి పండు తొక్కలో కూడా పుష్కలంగా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని చెప్పబడింది. ముఖ్యంగా ఈ ప్రయోజనాలు చర్మ సౌందర్యం ప్రకారం అధికంగా ఉంటాయి. ఈ ప్రయోజనాలను పొందడం కోసం, ప్రతి రోజూ రాత్రి అరటి పండు తొక్క యొక్క అంతర్గత భాగాన్ని ముఖానికి మసాజ్ వలె అప్లై చేసి, కొద్ది నిమిషాల తర్వాత కడిగివేయండి. ఈ ప్రక్రియ మీ ముఖం మీది మొటిమలను, ఆక్నే సమస్యను తొలగించడంలో ప్రభావాన్ని చూపగలవు.

వివిధ రకాల పోషక ప్రయోజనాలతో కూడిన అరటిపండ్లు ఖచ్చితంగా మీ ఆరోగ్యాన్ని సమర్దవంతముగా నిర్వహించడంలో సహాయం చేయగలవు. ఈ పండును, తగినంత మొత్తంలో వినియోగిస్తే, బరువు నష్టాన్ని పూర్తిస్థాయిలో ప్రేరేపించగలదు.

Best Time To Eat Banana For Weight Loss

అరటి పండును భోజన ప్రణాళికలో తీసుకునే విధానం :

మార్కెట్లో ఇంచుమించుగా 500 రకాల అరటి పండ్లు లభిస్తున్నాయి. ఆకుపచ్చ అరటిపండ్లు ఎక్కువ పిండిపదార్దాలతో కూడుకుని ఉంటాయి, అయితే పక్వతకు వచ్చిన లేదా పూర్తిగా పండిన పండ్లు అధికమైన సహజ చక్కెరలను కలిగి ఉంటాయి. ఇవి శక్తిని అధికంగా ప్రేరేపించగలవు. అంతేకాకుండా, విటమిన్లు మరియు ఖనిజాలలో అధికంగా ఉండే అరటిపండ్లు కూడా కాటెచిన్, డోపమైన్ వంటి అనామ్లజనకాలకు గొప్ప వనరుగా కూడా ఉన్నాయి, ఇవి శారీరిక ధృడత్వాన్ని పెంచడంలో ఎంతగానో సహకరిస్తాయి.

అల్పాహారానికి అరటి పండ్లను జోడించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలను పొందగలరని చెప్పబడింది. ఇవి పూర్తి పోషకభరితమై రోజంతా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. క్రమంగా అల్పాహారంలో పాలు, కార్న్ఫ్లేక్స్ మరియు ముక్కలుగా చేసిన అరటిపండ్లను కలిపి ఒక బౌల్ నిండుగా తీసుకొనవచ్చు.

Best Time To Eat Banana For Weight Loss

మీరు మీ వోట్మీల్లో కూడా అరటి పండ్ల ముక్కలను జోడించవచ్చు. ఇది మరింత రుచిని పెంచుతుంది. ఉదయం వేళల్లో, ఒక గ్లాసుడు పాలల్లో ఓట్స్, నానబెట్టిన బాదం, ముక్కలుగా చేసిన అరటి పండు కలిపి తీసుకోవచ్చు. కొందరు అదనంగా బ్రెడ్, డార్క్ చాక్లెట్, తేనె, ఎండు ద్రాక్ష, సీడ్స్ వంటివి కూడా జోడిస్తుంటారు. ఇది మీకు పూర్తి స్థాయి అల్పాహారాన్ని అందివ్వడమే కాకుండా, రోజంతా శరీరానికి అవసరమయ్యే శక్తిని అందివ్వడంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Best Time To Eat Banana For Weight Loss

అంతేకాకుండా, అరటి పండును మిల్క్ షేక్లలో కూడా జోడించవచ్చు. లేదా పెరుగుతో కలిపి కూడా తీసుకోవచ్చు. సాయంత్రం లేదా ఉదయం అల్పాహారం వేళల్లో, తేనెతో పాటుగా కొన్ని బనానా పాన్కేక్లు లేదా ఇతర అల్పాహారాలకు అలంకరించి తీసుకోవచ్చు.

మీరు పండ్లను అధికంగా తీసుకునే వారిగా ఉన్న ఎడల, మీ ఆకలిని శాంతపరచడానికి ఆరోగ్యకరమైన మధ్యాహ్న భోజనంగా ఫ్రూట్ సలాడ్స్, ఫ్రూట్ షేక్స్ వంటివి తీసుకోవచ్చు. డెసెర్ట్లలో, బనానా పుడ్డింగ్ లేదా బనానా కస్టర్డ్స్ వంటివి చేసుకుని తినొచ్చు. ఇటువంటివి పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. పండ్లను తీసుకోడానికి నిరాకరించే వాళ్ళు కూడా, ఇటువంటివి తీసుకోడానికి సుముఖత వ్యక్తం చేస్తుంటారు.

క్రమంగా, ప్రతిరోజూ అరటి పండును ఆహార ప్రణాళికలో జోడించి తీసుకోవడం ద్వారా, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ, కాలరీలను, కొవ్వును తగ్గించడంలో సహాయం చేస్తూ, బరువు తగ్గుదలలో మరియు మంచి శరీర ఆకృతిని పొందడంలో ప్రయోజనాలను పొందగలరు.

Best Time To Eat Banana For Weight Loss

పైన చెప్పుకున్నట్లుగా కేవలం అరటి పండును తీసుకోవడం ద్వారానే బరువు తగ్గుతుంది అని అనుకోవడం పొరపాటే. అరటి పండు ఆహార ప్రణాళికలతో ఏమాత్రం సంబంధం లేనిది. కాని, సరైన పోషకాలను శరీరానికి అందివ్వడంలో సహాయం చేస్తుంది. కావున మీ న్యూట్రిషనిస్టు చెప్పిన ప్రణాళికలను అనుసరిస్తూనే, అరటి పండును కూడా మీ ప్రణాళికలో ఒక భాగంగా జోడించుకోవచ్చునని సూచించడమైనది.

సరైన జీవన శైలిని అనుసరిస్తూ, వ్యసనాలకు దూరంగా ఉంటూ చక్కటి ఆహార ప్రణాళికలను పాటిస్తూ, క్రమం తప్పని వ్యాయామాన్ని అనుసరిస్తున్న ఎడల, బరువు తగ్గే ఆలోచనలకు తోడ్పాటునివ్వడంతో పాటు, చక్కటి శరీరాకృతిని పొందడంలో ప్రయోజనాలను పొందగలరు.

Best Time To Eat Banana For Weight Loss

అరటి పండును జోడించుకోమని సూచించడానికి గల ప్రధానకారణం ఏమిటంటే, దీనిలోని పోషక తత్వాలు. అరటి పండులో 0.5 mg బి విటమిన్, 110 కాలరీల శక్తి, 1 గ్రామ్ ప్రోటీన్, 1 mg సోడియంలతో పాటుగా అధికంగా 358 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అంతేకాకుండా, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ c మరియు a నిక్షేపాలు కూడా ఉంటాయి. ఇందులోని డైటరీ ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్స్ జీర్ణవ్యవస్థకు చక్కగా సహకారాన్ని అందివ్వగలవు. కావున నిస్సంకోచంగా అరటి పండును మీ ఆహార ప్రణాళికలోనికి జోడించుకోవచ్చునని సూచించడమైనది. కానీ, ఏది కూడా పరిమితిని దాటకూడదు అన్న సిద్దాంతం ప్రకారం రోజులో ఒకటి లేదా రెండు అరటి పండ్లను మించకుండా తీసుకోవలసినదిగా ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

English summary

బరువు తగ్గాలని భావించేవారు, అరటి పండు తీసుకోడానికి సూచించదగిన సమయం

Best Time To Eat Banana For Weight Loss
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more