ఈ వేసవిలో ఆరోగ్యకరమైన ఆహార నియమాలు

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఈ వేసవిలో మిమ్మల్ని మీరు సిద్దపరచుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. వడగాలులు, ఎండ వేడిమి కారణంగా శరీరం డీహైడ్రేషన్, వడదెబ్బల వంటి అనేక ప్రతికూల ప్రభావాలకు లోనవుతూ ఉంటుంది. ఒక్కోసారి ఇవి ప్రాణాంతకాలుగా పరిణమిస్తుంటాయి. వేసవి రానే వచ్చింది, ఎండ ప్రభావాలు కూడా మొదలయ్యాయి. క్రమంగా అనేకులు బీచెస్ లేదా ఇతర చల్లని ప్రదేశాలను ప్రత్యామ్నాయంగా ఎంచుకుని ప్రయాణాలు కూడా మొదలు పెట్టేశారు.

కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలు మరియు, కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా వేసవి నుండి ఉపశమనం పొందవచ్చు. ముఖ్యంగా ఈ వేసవిలో ఎటువంటి ఆహారప్రణాళికలు అవలంబించాలి అనే ప్రశ్న తలెత్తుతూ ఉండడం సహజం. కానీ వృత్తిపరoగా నైనా ఎండలో వెళ్ళక తప్పని పరిస్థితులు. తద్వారా డీహైడ్రేషన్, చర్మ సమస్యలు (టానింగ్ , ఇన్ఫెక్షన్స్), విటమిన్ లేదా మినరల్స్ లోపాలు వంటి ఆరోగ్యసమస్యలు కూడా సర్వసాధారణం.

How To Eat Healthy This Summer

మరి ఈ సమస్యలకు ఏవైనా సులభమైన పరిష్కారాలు ఉన్నాయా ? నిజానికి కాలానుగుణంగా దొరికే పండ్లలోనే అనేక విటమిన్లు, మినరల్స్ పొందవచ్చు. అలాగని మిగిలిన పండ్లలో దొరకవని కాదు, కాలానుగుణంగా దొరికే పండ్లు తర్వాతి కాలాలలో పెద్దగా కనపడవు కూడా. ఈ వేసవిలో అన్నిటికన్నా ముందుగా ఆహార ప్రణాళికను ఏర్పరచుకోవడం ముఖ్యం.

ఈ వేసవిలో కింది పద్దతులు పాటించడం సూచించడమైనది.

1. మీ ఆహార ప్రణాళికలో భాగంగా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి:

1. మీ ఆహార ప్రణాళికలో భాగంగా కూరగాయలు, పండ్లు ఉండేలా చూసుకోండి:

శరీరం హైడ్రేట్ గా ఉండడం ఈ వేసవిలో అన్నిటికన్నా ముఖ్యం. ఏ ఇతర సమస్యలు కూడా దీని తర్వాతనే ఉంటాయి. శరీరం డీహైడ్రేట్ అయ్యే కొద్దీ , చర్మ సమస్యలు ఇతర అంతర్గత సమస్యలు మొదలవుతాయి. కావున హైడ్రేట్ గా ఉంచడం అన్నిటికన్నా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, రోజూవారి ఆహారంలో భాగంగా తీసుకోవడం అన్నీ విధాలా సూచించబడినది. తద్వారా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచవచ్చు. నారింజ, లేదా ఇతర ఎరుపు రంగు పండ్లలో విటమిన్లు, మినరల్స్ మాత్రమే కాకుండా బీటా కెరోటిన్ కూడా ఉంటుంది. ఇవి సూర్యుడి ఎండ తీవ్రత నుండి చర్మాన్ని కాపాడుటలో సహాయం చేస్తాయి. మరియు ముదురు రంగు కూరగాయలల్లో రోగ నిరోధక శక్తి తత్వాలు అధికంగా ఉండడం వలన అనేక ప్రతికూల ప్రభావాల నుండి శరీరాన్ని కాపాడగలవు.

2. స్నాక్స్ విషయం లో తెలివిగా:

2. స్నాక్స్ విషయం లో తెలివిగా:

వేసవిలో అనేక రకాల స్నాక్ ఎంపికలు మనకు అందుబాటులో ఉంటాయి. కానీ ఎంచుకునే స్నాక్స్ వలన సమస్యలు లేకుండా చూసుకోవడం మన భాద్యత. డీప్ ఫ్రై, ఆయిల్ పదార్ధాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. పుచ్చకాయ, కిరిణీ పండు, కీరా దోసకాయ వంటివి ఎంచుకోవడం మంచిది. వీటిలో ఎక్కువ మోతాదులో నీరు, ఫైబర్ ఉండడం వలన ఆకలి తీర్చడం తో పాటు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచగలదు.

3. స్మూతీస్ విషయం లో స్మార్ట్ గా ఉండండి:

3. స్మూతీస్ విషయం లో స్మార్ట్ గా ఉండండి:

స్మూతీస్ , మిల్క్ షేక్స్, జ్యూస్ అంటే వేసవిలో ఎంతో మక్కువను ప్రదర్శిస్తుంటాము. పండ్లను నేరుగా తీసుకోవడం లేదా స్మూతీ రూపంలో చక్కెర జోడించకుండా తీసుకోవడం మంచిది. ఇక్కడ అన్నీ రకాల పండ్లు ఫైబర్ ను కలిగి ఉంటాయి. కానీ స్మూతీలలో ఇవి తొలగించబడుతాయి. కావున స్మూతీ ఆలోచన కలిగి ఉంటే, అందులో సగం జ్యూస్ , సగం చల్లని నీళ్ళు జోడించడం ద్వారా ఎక్కువసేపు కడుపును చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.

4.వేయించిన మాంసం :

4.వేయించిన మాంసం :

వేసవి అంటేనే లాన్ లో కుటుంబసభ్యులతో గడపడం, బార్బేక్యూ(మాంసం వేసే పొయ్యి) లతో మాంసం వండుకుని తినడం వంటివి ఎక్కువగా చేస్తుంటారు. లేదా రెస్టారెంట్స్ లో కూడా వీటిని ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇవి వేసవిలో మంచిది కాదు. కానీ తినాల్సిన పక్షంలో ఆరోగ్య సంబంధ వంట మూలికలు జోడించడం , లేదా కొంత విరామంతో పండ్లను తీస్కోవడం ద్వారా మీ బార్బేక్యూ ను ఆనందించవచ్చు.

5.సాస్ గురించి తెలుసుకోండి:

5.సాస్ గురించి తెలుసుకోండి:

ప్లేట్ నిండా ఆరోగ్యకరమైన సలాడ్స్, కూరగాయలతో ఉండడం ఆరోగ్యానికి మంచిది. కానీ వీటిపై వేసే సాస్ గురించిన ఆలోచన కూడా చేయండి. సాస్ లో ఎక్కువ మోతాదులో క్రొవ్వు పదార్ధాలు, చక్కెరలు మరియు కాలరీలతో నిండి ఉంటాయి. కావున ఈ సాసులకు బదులుగా ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం ఎంతో మంచిది. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపు అసౌకర్యానికి గురికాకుండా చూస్తుంది.

8. సలాడ్స్ ను మీరే తయారుచేయండి:

8. సలాడ్స్ ను మీరే తయారుచేయండి:

కేవలం పండ్లు, కూరగాయలు, ఐస్ వంటివే కాకుండా సలాడ్లు కూడా మీ ఆహారప్రణాళికలో భాగంగా చేర్చుకోవడం ఉత్తమం. ముఖ్యంగా గ్రిల్ చేసిన కాయగూరలు, అందులో గ్రిల్ చేసిన ఆస్పరాగస్, లేదా బేక్ చేసిన గుమ్మడికాయ స్క్వాష్ వంటివి సలాడ్స్ కు సరికొత్త రుచులను అందాన్ని తెస్తాయి. మరియు మాంసాహార ప్రియులు సాల్మన్ చేపలు లేదా మాంసాన్ని గ్రిల్ చేసి ఆరోగ్యకర కొవ్వు పదార్ధాలైన ఆలివ్ ఆయిల్ వంటివి జోడించడం ద్వారా తీసుకోవచ్చు.

9. చేపలను ఎక్కువగా తినండి:

9. చేపలను ఎక్కువగా తినండి:

నిజం , చేపలలో ప్రోటీన్ నిల్వలు ఎక్కువగా ఉంటాయి. మరియు మాంసంకన్నా చేపలు అన్నివిధాలా శ్రేయస్కరమని వైద్యులు కూడా సూచిస్తుంటారు. వారానికి రెండు సార్లు చేపలు తీసుకోవడం ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా మేలు. పార్స్లీ ఆకులు లేదా కొత్తిమీర, తెల్లగడ్డ, అల్లం, లెమన్ వంటి ఆరోగ్యకర పదార్ధాలు జోడించడం ద్వారా అదనపు రుచులను ఆస్వాదించవచ్చు.

English summary

How To Eat Healthy This Summer

You will be sweating and going outdoors for work, this will increase the risk of health problems such as dehydration, skin sensitivities and vitamin and mineral deficiencies. These are a few ways to eat healthy this summer, like eating vegetables and fruits, snacking wisely, eating whole fruits, cooking your salads, increasing your fish intake, etc.