For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అరటితొక్కలను వాడి మెరిసే తెల్లని పళ్లను పొందటం ఎలా

|

ముత్యాల్లాంటి తెల్లని పళ్ళు కావాలని ఎవరికివుండదు? ఎవరికి అందంగా మెరిసిపోతున్న తెల్లని పళ్లతో కూడిన చిరునవ్వు నచ్చదు?పళ్ళ రంగు మారిపోవటానికి చాలా కారణాలు ఉండవచ్చు, అలాగే వాటిని తెల్లగా మెరిసేలా చేయటానికి కూడా చాలా పద్ధతులున్నాయి.

ఉదాహరణకి, క్రమం తప్పకుండా బ్రష్ చేయటం, ముఖ్యంగా తిన్నాక లేదా తాగాక, ఫ్లాసింగ్, నూనెతో పుక్కిలిపట్టడం, యాపిల్ సిడర్ వెనిగర్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లేదా వంట సోడా వంటివి వాడటం మొదలైనవి.

పళ్లని తెల్లబర్చటానికి సింపుల్ అయిన, పాపులర్ సహజమైన పద్ధతుల్లో ఒకటి అరటితొక్కను వాడటం. కానీ ఎలా? సందేహంగా ఉందా? దీని గురించి ఇప్పుడు మరింత తెలుసుకుందాం.

How To Get White Sparkling Teeth Using Banana Peel

అసలు పళ్ళు పసుపురంగులో లేదా రంగు పోవటం దేనివలన జరుగుతుంది?

-మంచి నోటి పరిశుభ్రత పాటించకపోవటం ; మీరు మీ నోటి ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోతే, బ్రష్ చేయకుండా, నోరు పుక్కిలిపట్టటం వంటివి చేయకపోతే గారపట్టి, పళ్ళు పసుపు రంగులోకి మారతాయి.

-కఠినమైన ఆహారం లేదా డ్రింక్ తీసుకోవటం ; మీరు కాఫీ, కోలాలు, టీ,ఆల్కహాల్ ఇంకా ఆపిల్స్, బంగాళదుంపల వంటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే పళ్ళపై మచ్చలు పడతాయి.

-పొగాకు ; పొగాకు నమలడం లేదా పొగతాగటం వలన కూడా పళ్ళ రంగుపోతుంది.

-కొన్ని రకాల మందులు ; టెట్రాసైక్లిన్, డోక్సీసైక్లిన్ లాంటి యాంటీబయాటిక్స్, కొన్ని హై బిపి మాత్రలు, క్లోర్హెక్సిడిన్ మరియు సిటైల్పైరిడినియం క్లోరైడ్ ఉన్న కొన్ని మౌత్ వాష్ ల వలన పంటిపై మచ్చలు వస్తాయి.

-వయస్సు; వయస్సు పెరుగుతున్నకొద్దీ, పళ్లపై బయటిపొర ఎనామిల్ పోతూంటుంది, అలా పంటి అసలు రంగైన పసుపు కన్పిస్తుంది.

-డెంటల్ ట్రామా ;ఇది గాయాలు తగిలినప్పుడు జరుగుతుంది, పంటికి లేదా దానికి చెందిన మెత్తని కణజాలమైన నాలుక, పెదవుల వంటికి గాయాలు తగిలినప్పుడు కూడా పళ్ళ రంగు పోతుంది.

-జన్యు కారణాలు ;చాలామందికి తమ జన్యువుల కారణంగా పసుపు రంగు పళ్ళు వస్తాయి.

-పంటికి సంబంధించిన చికిత్సలు ; ఉదాహరణకి, పంటి లోపల వచ్చే ఇన్ఫెక్షన్ ను తొలగించే రూట్ కెనాల్ చికిత్స వలన, ఇన్ఫెక్షన్ సరిగా తీసేయకపోతే పళ్ళ రంగు పోతుంది. రూట్ కెనాల్ థెరపీ తర్వాత, ఫిల్లింగ్స్ ను పోయిన పంటి ముక్కలలో నింపడం వలన కూడా పళ్ళ రంగు మారవచ్చు.

-ఫ్లోరోసిస్ – ఎక్కువగా, దీర్ఘకాలంగా ఫ్లోరైడ్ బారిన ఉండటం వలన, ముఖ్యంగా పిల్లల విషయంలో పళ్ళు అప్పుడప్పుడే వస్తూ ఉంటాయి కాబట్టి, పంటి పైన మచ్చలు ఏర్పడిపోతాయి.

పళ్లను తెల్లబర్చటానికి అరటితొక్క ఎలా తెలివైన ఇంకా సులభమైన చిట్కాగా మారింది?

పళ్లను తెల్లబర్చటానికి అరటితొక్క ఎలా తెలివైన ఇంకా సులభమైన చిట్కాగా మారింది?

అరటిపండులాగానే, అరటితొక్కలో కూడా పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి6,విటమిన్ బి12 వంటి పోషకాలుంటాయి.మనం తొక్క పడేయటానికి కొంచెం కూడా ఆలోచించము. కానీ మన పళ్ళకి, చర్మానికి, ఆమాటకొస్తే లెదర్ కి, వెండి వస్తువులకి కూడా తొక్క ఎన్నిరకాలుగా ఉపయోగపడుతుందో తెలుసా?

పళ్ళు తెల్లబడటానికి, అరటితొక్క సహజమైన, చవకైన చిట్కా. ఇది వివిధ సహజ లేదా కాస్మెటిక్ వైట్నర్ల కన్నా సురక్షితమైన విధానం. ఎందుకంటే ఇది పళ్లను పాడుచేయదు. ఇది మెల్లగా పళ్లపై ఎక్స్ ఫోలియేట్ చేసి మచ్చలను తొలగించి వారం లేదా రెండు వారాల్లో పళ్ళను తెల్లబరుస్తుంది.

పళ్ళపై అరటితొక్కలను ఎలా వాడతారు?

పళ్ళపై అరటితొక్కలను ఎలా వాడతారు?

ఇది సింపుల్ యే! తొక్క లోపలిభాగాన్ని మీ పళ్లపై రెండు నిమిషాలపాటు రుద్దండి. అరటి గుజ్జు మీ పళ్ళపై పొరలా అతుక్కునే వరకూ ఉండి,తర్వాత కూడా ఆ పొరను 5-10నిమిషాలు పళ్ళపై అలానే ఉంచండి. నోరును తెరిచే ఉంచితే అరటి పేస్టు పెదవులకి అతుక్కోకుండా ఉంటుంది.

తర్వాత స్టెప్, పళ్ళను ఉత్త బ్రష్ తో పొడిగా తోమండి,1-2 నిమిషాల పాటు గుండ్రంగా తిప్పుతూ తోమండి. తర్వాత మీరు వాడే పేస్టుతో తోమి పళ్ళపై అరటి పొరను కడిగేయండి.

ఈ మొత్తం చిట్కాను పళ్ళను కడుక్కునే ముందు లేదా తర్వాత చేయండి. ఇలా రెండువారాలపాటు ప్రతిరోజూ చేస్తే ఫలితాలు కన్పిస్తాయి. ఇది నిజంగా మీ పళ్ళను తెల్లబర్చి, నవ్వును అందంగా మార్చటానికి ఒక సురక్షితమైన, ప్రభావవంతమైన చిట్కా!

అరటితొక్కల ఇతర లాభాలు

అరటితొక్కల ఇతర లాభాలు

పళ్ల రంగును మెరుగుపర్చుకోటానికే కాక, అరటితొక్కలను వివిధ విషయాలకి వాడవచ్చు. అందులో కొన్ని కింద ఇవ్వబడ్డాయి.

-చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది ; అరటితొక్కల్లో ఉండే పోషకాలు, యాంటీఆక్సిడెంట్ల వలన మొటిమలు పోతాయి, ముడతలు తగ్గుతాయి, చర్మానికి తేమ అందుతుంది. తొక్క లోపలిభాగాన్ని సింపుల్ చర్మంపై రుద్దితే కాంతివంతంగా మారటంలో సాయపడుతుంది.

-తినటానికి మంచిది ;

-తినటానికి మంచిది ;

అరటితొక్కలని ప్రపంచంలో చాలామంది తింటారు, వారికి అందులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి6 మరియు బి12 వంటి పోషకాల లాభాలు అందుతున్నాయి.

-పురుగులు కుట్టినచోట ;

-పురుగులు కుట్టినచోట ;

పురుగులు కుట్టిన చోట దద్దుర్లకి తొక్కతో మసాజ్ చేస్తే, వెంటనే దురద తగ్గిపోతుంది.

-వస్తువుల పాలిష్ ;

-వస్తువుల పాలిష్ ;

మీ షూలు, లెదర్ లేదా వెండి వస్తువులను అరటితొక్కతో రుద్ది మెరిసేలా చేసుకోవచ్చు.

-సోరియాసిస్ నయం చేస్తుంది ;అరటితొక్కను రుద్దటం వలన చర్మంపై వచ్చే ఎర్రని, పొరల్లా ఊడిపోయే, దురదల ప్యాచ్, సోరియాసిస్ నయమవుతుంది.

English summary

How To Get White Sparkling Teeth Using Banana Peel

Who doesn't want pearly whites? Who doesn't wish for a beautiful smile with white and sparkling teeth? There may be multiple reasons for teeth to be discoloured. And, there are many ways to make and keep them white and gleaming.For instance, regular brushing, especially after eating or drinking, flossing, oil pulling, using apple cider vinegar, hydrogen peroxide or baking soda, etc.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more