For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొప్పి తెలియని మరణం!

By B N Sharma
|
Heart
ప్రతి 100 మంది డయాబెటిక్ రోగులలోను 40 మంది గుండె పోటుతో మరణిస్తున్నారట. ఛాతీ నొప్పి లేదా ఆంగినా వంటి లక్షణాలు కూడా వీరిలో కనపడకుండా మరణం సంభవిస్తోందంటున్నారు వైద్య నిపుణులు. వచ్చేటటువంటి గుండెపోటు కూడా తీవ్ర స్ధాయిలో వచ్చి వైద్యానికి సైతం ఎట్టి సమయం ఇవ్వటం లేదట. షుగర్ వ్యాధి కలవారిలో 80 శాతం మరణాలు గుండె జబ్బు కారణమేనని తెలుపుతున్నారు.

డయాబెటిక్స్ రోగులలో గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ వ్యక్తులకంటే, 10 నుండి 15 సంవత్సరాలు ముందుగా వస్తున్నాయని తెలుస్తోంది,. నొప్పి తెలియని గుండె పోట్లు డయాబెటిక్స్ లో 40 శాతం వరకు వున్నాయి. రోగులు సమయానికి గుండె నొప్పి అని కూడా చెప్పలేరని, రోగి సడన్ గా శ్వాస తీసుకోవడం కష్టమౌతోందని నాడి, గుండె కొట్టుకొనే వేగం పూర్తిగా పడిపోవటం లేదా పెరిగి ఆగిపోవడం జరుగుతోందని వైద్య నిపుణులు చెపుతున్నారు. డయాబెటిక్స్ రోగులకు, సాధారణ వ్యక్తులకంటే, రెండు నుండి మూడు రెట్లు గుండె పోటు రిస్కు వుంటుందని హెచ్చరిస్తున్నారు.

రక్తపోటు లేదా గుండె జబ్బులు వున్న వారు అధికబరువు పొందుతారని కనుక వారికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువని, కనుక అధిక బరువు, గుండె జబ్బులు, డయాబెటీస్ మూడూ ఒకదానితో మరి ఒకటి సంబంధించినవేనని తెలిపారు. మీ నడుము భాగం ఎంత సన్నగా వుంటే జీవితం అంత అధికంగా పొడిగించబడుతుంది. నడుము ఎప్పటికి 90 సెం.మీ.లకంటే లేదా ఖచ్చితంగా భారతీయులకు 85 సెం.మీ.లకంటే తక్కువ వుంటే, ఇది డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులకుమీరు గురికాకుండా చేస్తుందని వైద్యనిపుణుల సలహాగావుంది.

English summary

Diabetics Suffer Painless Heart Attack | నడుము భాగం సన్నగా వుంటే?

Doctors emphasize on weight loss as obesity, heart diseases and diabetes are interconnected. "Lesser the waistline longer the life. Keep the waistline less than 90cm preferably less than 85cm in Indians. This will reduce the burden of both diabetes & CVD," Regular indulgence in physical activity can be very useful," medical specialist said.
 
Story first published:Thursday, December 1, 2011, 12:49 [IST]
Desktop Bottom Promotion