For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డయాబెటిక్ పేషంట్స్.. ఏ ఫ్రూట్ ని ఎంత మోతాదులో తీసుకోవాలి ??

By Swathi
|

డయాబెటిక్ పేషంట్స్ కి తీపి రుచి లేకపోవడం ఒకరకంగా నిరాశ కలిగిస్తూ ఉంటుంది. ఆహారం విషయంలో షుగర్ పేషంట్స్ ఎప్పుడూ చాలా జాగ్రత్త వహించాల్సిందే. చక్కెర ఆహారాలకు దూరంగా ఉంటూనే.. మీరు తీసుకునే ఆహారాలు అమోఘమైనవిగా ఉండేలా చేసుకోవాలి.

ముఖ్యంగా డయాబెటిక్ పేషంట్స్ లో సాధారణంగా వినిపించే ప్రశ్న.. ఫ్రూట్స్ విషయంలో ఉంటుంది. ఏ పండు తినాలి, ఏ పండు తినకూడదు, ఎంత పరిమాణంలో తినాలి, ఎప్పుడు తినాలి అనే సందేహాలు వేధిస్తుంటాయి.

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు..!!

అయితే మామిడి పండ్లు, కస్టర్డ్ యాపిల్ లో షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఖచ్చితంగా తీసుకోకూడదు. మీ షుగర్ లెవెల్స్ 200 ఎమ్ జీ కంటే ఎక్కువ ఉంది అంటే.. ఈ రెండు పండ్లను తీసుకోకపోవడమే మంచిది. అలాగే.. ఏ ఫ్రూట్ తీసుకోవాలి, ఎంత పరిమాణంలో తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం..

యాపిల్

యాపిల్

మీడియం సైజ్ లో ఉండే ఒక యాపిల్ ని రోజుకి ఒకటి డయాబెటిక్ పేషంట్స్ తీసుకోవాలి. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి, గ్లిసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పైబర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా.. రెడ్ యాపిల్ కంటే.. గ్రీన్ యాపిల్ డయాబెటిక్స్ కి మంచిది. ఎందుకంటే.. గ్రీన్ యాపిల్స్ లో 20 గ్రాములు కార్బోహైడ్రేట్స్, గ్లిజమిక్ ఇండెక్స్ 39 ఉంటుంది.

ఆరంజ్

ఆరంజ్

ఆరంజ్ లలో విటమిన్ సి, ఫైబర్ ఉంటుంది. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించి, ఇన్సులిన్ లెవెల్ ని పెంచుతాయి. అంతేకాకుండా.. వీటిలో హెస్పెరెటిన్ ఉంటుంది. అలాగే యాంటీ ఒబేసిటీ ఎఫెక్ట్ ఉండటం వల్ల బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. డయాబెటిక్ పేషంట్స్ చిన్న సైజ్ లో ఉన్న ఆరంజ్ ఒకటి తీసుకోవచ్చు. లేదా 5 నుంచి 6 ముక్కలు తీసుకున్నా ప్రయోజనాలు పొందవచ్చు.

జామకాయ

జామకాయ

జామకాయల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే.. ఇవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తాయి. హై ఫైబర్, తక్కువ గ్లోజెమిక్ ఇండెక్స్ డయాబెటిక్ పేషంట్స్ కి మంచిది. కాబట్టి.. ఒక మీడియం సైజు జామకాయ షుగర్ పేషంట్స్ తీసుకోవచ్చు.

నేరేడు పళ్లు

నేరేడు పళ్లు

బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్ చేయాలంటే.. రోజుకి 5 నుంచి 6 నేరేడు పళ్లు తీసుకోవాలి. వీటిలో తక్కువ గ్లిజమిక్ ఇండెక్స్ ఉన్నా.. గ్లూకోసైడ్ ఉంటుంది. ఇవి బ్లడ్ గ్లూకోజ్ ని కంట్రోల్ లో ఉంచుతాయి.

బొప్పాయి

బొప్పాయి

చాలామంది షుగర్ పేషంట్స్ బొప్పాయి తినకుండా ఉంటాయి. వీటిల్లో ఉండే తియ్యదనం బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెంచుతుందని భావిస్తారు. అయితే చిన్న ముక్క లేదా ఒక చిన్న కప్పు నిండా బొప్పాయి ముక్కలు అప్పుడప్పుడు తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్

ఒక కప్పు లేదా ఒక గిన్నె అంటే 180 గ్రాముల స్ట్రాబెర్రీస్ ను షుగర్ పేషంట్స్ తినవచ్చు. స్ట్రాబెర్రీస్ లో ఫైబర్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీని మెరుగుపరుస్తాయి.

పియర్

పియర్

హెల్తీ అండ్ డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫ్రూట్ ఇది. రోజుకి అర్థం పియర్ పండు తినవచ్చు. ఇందులో కూడా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. చాలాసేపు ఆకలిగా అనిపించదు. మరీ ఎక్కువగా పండినది కాకుండా, మరీ పచ్చిగా ఉన్నది కాకుండా.. ఎంచుకోవాలి. వాటిలో అయితే.. షుగర్ తక్కువగా ఉంటుంది.

అరటిపండు

అరటిపండు

షుగర్ పేషంట్స్ మీడియం సైజ్ అరటిపండులో సగం తీసుకోవచ్చు. దీనివల్ల బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్ లో ఉంటుంది. ఒకవేళ మీ డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోవడం, గత మూడు నెలల్లో షుగర్ లెవెల్స్ స్థిరంగా లేకపోతే.. అరటిపండు తినకపోవడం మంచిది.

పుచ్చకాయ

పుచ్చకాయ

100 గ్రాములు లేదా ఒక కప్పు పుచ్చకాయ ముక్కల్లో 90 శాతం నీళ్లు, 30 శాతం క్యాలరీలు ఉంటాయి. కాబట్టి ఇవి గ్లూకోజ్ లెవెల్స్ మెయింటెయిన్ చేయడంలో, బరువు తగ్గించడంలో సహాయపడతాయి. కాబట్టి.. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత లేదా మధ్యాహ్నం లంచ్ తర్వాత వీటిని తీసుకోవచ్చు. కానీ రాత్రిపూట తీసుకోకపోవడం మంచిది.

పైనాపిల్

పైనాపిల్

పైనాపిల్ లో తక్కువ క్యాలరీలుంటాయి. అలాగే బ్లడ్ గ్లూకోజ్ హఠాత్తుగా పెరగడానికి కూడా కారణమవదు. అయితే.. షుగర్ పేషంట్స్ 3/4 వంతు కప్పు పైనాపిల్ ముక్కల కంటే... ఎక్కువ తీసుకోకూడదు.

English summary

10 fruits and their recommended servings for diabetics

10 fruits and their recommended servings for diabetics. A common query that most diabetics have when it comes to fruits is what to eat and how much to eat.
Story first published:Tuesday, August 2, 2016, 14:15 [IST]
Desktop Bottom Promotion