For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే ఆశ్చర్యకర లక్షణాలు..!!

By Swathi
|

మన వయసు పెరిగే కొద్దీ.. మనకు అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని ఆందోళన పడుతున్నారా ? విలువైన సమయాన్ని, డబ్బుని ఆస్పత్రుల కోసం కేటాయించాల్సి వస్తుందని భయపడుతున్నారా ? భయంకరమైన వాస్తవం ఏంటంటే.. ఏదో ఒకసారి.. మనం జీవితంలో ఏదో ఒక అనారోగ్య సమస్య బారిన పడాల్సి వస్తుంది.

ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉందా ? ఐతే ఈ జాగ్రత్తలు కంపల్సరీ..

వ్యాధులను అరికట్టడం కాస్త కష్టమే అయినప్పటికీ.. మీరు ఖచ్చితంగా.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలను హెల్తీ లైఫ్ స్టైల్ ద్వారా నిరోధించవచ్చు. డయాబెటిస్ అనేది.. ఇప్పుడు అందరినీ ఎక్కువగా ఇబ్బందిపెడుతున్న సమస్య. డయాబెటిస్ బారిన పడినవాళ్ల బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ కంటే ఎక్కువగా ఉంటాయి.

శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తక్కువగా ఉన్నప్పుడు లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి కణాలు సహకరించనప్పుడు.. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల డయాబెటిక్ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. తరచుగా యూరిన్ కి వెళ్లడం, ఎక్కువ ఆకలి, అలసట, బరువు తగ్గడం లేదా పెరగడం, నెమ్మదిగా గాయాలు మానడం, వికారం, తలనొప్పి వంటివన్నీ డయాబెటిస్ సాధారణ లక్షణాలు.

షుగర్ (డయాబెటిస్) ను కంట్రోల్ చేయడానికి ఎఫెక్టివ్ హోం రెమిడీస్

అయితే.. ఈ లక్షణాలన్నింటి గురించి చాలా మందికి అవగాహన ఉంటుంది. కానీ మీకు తెలియకుండా.. మీ శరీరంలో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు కనిపించే కొన్ని లక్షణాలను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ఆ లక్షణాలపై కూడా అవగాహన ఉంటే.. డయాబెటిస్ ని మొదట్లోనే గుర్తించి నివారించడం సాధ్యమవుతుంది. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడని ఆశ్చర్యకర డయాబెటిస్ లక్షణాలను తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అవేంటో చూద్దాం..

చర్మంలో మార్పులు

చర్మంలో మార్పులు

బ్లడ్ లో ఇన్సులిన్ స్థాయి అస్తవ్యస్తంగా మారినప్పుడు.. డార్క్ స్పాట్స్ ఏర్పడతాయి. అలాగే చర్మంపై ముడతలు కనిపిస్తాయి. ఇలాంటి చర్మ సమస్యలు, లక్షణాలను గుర్తించినట్లైతే.. ఒకసారి డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం.

వినికిడి తగ్గడం

వినికిడి తగ్గడం

డయాబెటిస్ వల్ల నరాలు, బ్లడ్ వెజెల్స్ పై ప్రభావం చూపి.. వినికిడి లోపాలకు కారణమవుతుంది. కాబట్టి వినికిడి శక్తి కోల్పోతున్నారంటే.. ఒకసారి.. డయాబెటిస్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

హఠాత్తుగా కంటిచూపు మెరుగుపడటం

హఠాత్తుగా కంటిచూపు మెరుగుపడటం

కొన్నిసార్లు హై బ్లడ్ షుగర్ లెవెల్స్ కారణంగా శరీరంలో ఫ్లూయిడ్ లెవెల్స్ లో తాత్కాలిక మార్పులు, కంట్లోనూ ఫ్లూయిడ్ లెవెల్స్ మార్పులు వస్తాయి. దీనివల్ల హఠాత్తుగా కంటిచూపు మెరుగుపడుతుంది.

తరచుగా దురద

తరచుగా దురద

డయాబెటిస్ తో బాధపడేవాళ్లలో కొంతమందికి తరచుగా శరీరంపై దురద, ముఖ్యంగా పాదాలు, చేతులపై ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉంటే.. బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగక.. చర్మం డ్రైగా మారుతుంది. దీనివల్ల దురద సమస్య పెరుగుతుంది.

వణుకుడు

వణుకుడు

శరీరంలోని కొన్ని భాగాల్లో వణుకుతున్నట్టు, తిమ్మిరి పట్టినట్టు అనిపించడం, స్పర్శ కోల్పోవడం వంటి సమస్యలు.,. డయాబెటిస్ కి సంకేతమని గుర్తించాలి.

తరచుగా ఇన్ఫెక్షన్స్

తరచుగా ఇన్ఫెక్షన్స్

డయాబెటిస్ ఎటాక్ అయిన మొదట్లో.. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశాలుంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవడం వల్ల.. ఇలాంటి అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. ఈ సమస్య మీలో కనిపిస్తే.. వెంటనే డయాబెటిస్ చెక్ చేయించుకోవడం మంచిది.

దుర్వాసన

దుర్వాసన

మీరు సరైన కేర్, నోటి సంరక్షణ పాటిస్తున్నా.. దుర్వాసన సమస్యను ఎదుర్కొంటున్నారని గుర్తిస్తే.. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగాయనడానికి సంకేతమని గుర్తించండి.

చూశారుగా.. ఇవన్నీ చాలా చిన్న సమస్యలే అయినా.. ఇలాంటి లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ ని సంప్రదించి చెక్ చేయించుకోవడం మంచిది.

English summary

Surprising Symptoms Of Diabetes That You Never Knew!

Surprising Symptoms Of Diabetes That You Never Knew! Well, the harsh fact is that as humans we are prone to various ailments which may affect us at any point in our lives.
Story first published:Tuesday, July 19, 2016, 12:38 [IST]
Desktop Bottom Promotion