మధుమేహం ఉన్నవారు తినదగిన టాప్ 10 బెస్ట్ ఆహారాలు

By: Lakshmi Perumalla
Subscribe to Boldsky

మీ రక్తంలో చక్కర స్థాయిలు స్థిరంగా ఉండటానికి తక్కువ పిండి పదార్ధాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెప్పుతారు. మధుమేహం ఉన్నవారిలో చక్కర మరియు పిండిపదార్ధాలు ఎక్కువ అయితే ప్రమాదం జరుగుతుంది. అది మరణానికి దారి తీయవచ్చు.

మధుమేహ రోగుల్లో గుండె జబ్బులు లేదా స్ట్రోక్ వచ్చి చనిపోయే అవకాశాలు రెండు నుంచి నాలుగు శాతం ఎక్కువగా ఉన్నాయి. సరిగా నియంత్రణ లేకపోతే నరాల నష్టం కారణంగా కార్డియోవాస్కులర్ ఇబ్బంది మరియు మూత్రపిండ వ్యాధులు వంటి ప్రమాదాల రేటు పెరుగుతుంది.

డయాబెటిస్ రాకుండా అరికట్టే.. అమోఘమైన ఆహారాలివి..!

మధుమేహ రోగులు అనుకూలమైన ఆహారం తీసుకోవటం ద్వారా జాగ్రత్త మరియు నియంత్రణ ఉంటాయి. మధుమేహ రోగులు తీసుకొనే ఆహారంలో తక్కువ చక్కర మరియు తక్కువ పిండిపదార్ధాలు ఉండేలా చూసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.

best foods for diabetes

ఈ ఆహారాలు ముఖ్యమైన విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి, ఇవి వాపును పోగొట్టడానికి మరియు మీ శక్తి స్థాయిని అధికంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఇక్కడ మధుమేహ రోగుల కోసం ఉత్తమమైన ఆహార జాబితా ఉంది. ఈ జాబితా గురించి వివరంగా తెలుసుకోవటానికి ఈ వ్యాసాన్ని చదవండి.

1. క్వినోనా

1. క్వినోనా

ఈ ధాన్యంలో ఫైబర్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది మధుమేహం కోసం ఒక స్మార్ట్ పిక్ చేస్తుంది. ఫైబర్ మరియు ప్రోటీన్ కలయిక రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది.

2. 100% సంపూర్ణ గోధుమ రొట్టె

2. 100% సంపూర్ణ గోధుమ రొట్టె

క్లిష్టమైన పిండి పదార్థాలు కలిగిన సంపూర్ణ గోధుమ రొట్టెలో విటమిన్లు, ఖనిజాలు మరియు రక్తంలో చక్కెరను నియంత్రించే ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మధుమేహ రోగులకు ఉత్తమ ఆహారంగా చెప్పవచ్చు.

3. బీన్స్

3. బీన్స్

బీన్స్ మొక్కలో ప్రోటీన్ మరియు కరిగే ఫైబర్ మంచి సమ్మేళనంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను పెంచుతుంది. అలాగే డయాబెటిక్ రోగులకు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. ఇది మధుమేహం ఉన్నవారికి ఉత్తమ ఆహారాలలో ఒకటి.

4. కాయధాన్యాలు

4. కాయధాన్యాలు

కాయధాన్యాలలో రక్తంలో చక్కెర స్థాయిలపై తక్కువ ప్రభావాన్ని చూపే పిండిపదార్ధాలు ఉంటాయి. ఇది మధుమేహం యొక్క గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

5. సాల్మన్

5. సాల్మన్

సాల్మన్ లో ఆరోగ్యకరమైన ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. అలాగే మధుమేహం కారణంగా వచ్చే గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

6. గ్రీక్ పెరుగు

6. గ్రీక్ పెరుగు

దీనిలో ప్రోటీన్ సమృద్ధిగా ఉండుట వలన ఉదయం శక్తిని ఇస్తుంది. మధుమేహం రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడే ప్రోటీన్ మరియు తక్కువ పిండిపదార్ధాలు గ్రీక్ పెరుగులో ఉంటాయి.

7. పాలకూర

7. పాలకూర

పాలకూరలో కంటి ఆరోగ్యానికి అవసరమైన పోషక పదార్ధం సమృద్ధిగా ఉంటుంది. మధుమేహ రోగులలో ఎక్కువగా కంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మధుమేహ రోగులలో పాలకూర ఉత్తమమైన ఆహారం.

8. బెర్రీలు

8. బెర్రీలు

బెర్రీలలో గ్లైసెమిక్ సూచిక చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటిస్ నిర్వహణ కోసం సూపర్ ఆహారంగా భావిస్తారు. వీటిల్లో చక్కెర తక్కువ మరియు ఫైబర్ అధికంగా ఉంటుంది. మధుమేహ రోగుల సామర్ధ్యం మేరకు రక్తంలో చక్కెర స్థాయిలను నిదానంగా పెంచుతుంది.

9. బ్రోకలీ

9. బ్రోకలీ

బ్రోకలీ సల్ఫోరాఫాన్ కలిగి ఉన్న ఒక కూరగాయ.ఇది మధుమేహంతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాస్కులర్ సమస్యలను తగ్గిస్తుంది.

10. అవిసె గింజలు

10. అవిసె గింజలు

ఒక స్పూన్ అవిసె గింజల పొడిని సలాడ్లు,రసం,నూడుల్స్ వంటి వాటిలో కలిపితే మధుమేహ రోగులకు ఉత్తమంగా పనిచేస్తుంది. దీనిలో రక్తంలో చక్కెర స్థాయిని నిర్వహించడానికి లిగ్నన్స్ మరియు ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల ఇది మధుమేహ రోగులకు ఉత్తమమైన ఆహారం.

English summary

Top Best Foods For Diabetics

Try these best foods for diabetes and keep your blood sugar levels in check.
Story first published: Sunday, November 12, 2017, 18:00 [IST]
Subscribe Newsletter