For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహానికి, ఊబకాయం తగ్గడానికి కాకరకాయ జ్యూస్ .. !

|

కరేలా లేదా కాకరకాయ నిజానికి కూరగాయ కాదు, పండు అంటే నమ్ముతారా? నిజానికి కాకరకాయను బిట్టర్ మిలాన్ గా కూడా వ్యవహరిస్తారు , మరియు అనేక రకాల రోగాలకు విరుగుడుగా కూడా దీనిని వినియోగిస్తారు. ఈ వ్యాసంలో కాకరకాయ మధుమేహ మరియు ఊబకాయ వ్యాధిగ్రస్తులకు ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

మధుమేహానికి సహజమైన ఔషధం కాకరకాయ రసం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాకరకాయ రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. మరియు బరువు పెరుగుట, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్ వంటి మధుమేహ సంబంధిత ఆరోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది.

ఐరన్ , మెగ్నీషియం, పొటాషియం, మరియు విటమిన్ సి వంటి పోషకాలు అధికంగా ఉండే ఈ కాకరకాయ , ఆహార ప్రణాళికలో ఫైబర్ యొక్క అద్భుతమైన వనరుగా కూడా ఉంటుంది. కాకరకాయ రసంలో అధికమోతాదులో కాల్షియం, పొటాషియం మరియు బీటా కెరోటిన్ స్థాయిలు కూడా ఉంటాయి.

మధుమేహానికి కాకరకాయ జ్యూస్ ఎలా సహాయం చేస్తుంది ?

కాకరకాయలో డయాబెటిక్ వ్యతిరేక లక్షణాలతో కనీసం మూడు చురుకైన పదార్ధాలు ఉన్నాయి. ఇందులో రక్తంలో గ్లూకోస్-తగ్గించే ప్రభావం, వైసిన్ మరియు పోలిపెప్టైడ్ పి అని పిలువబడే ఇన్సులిన్-వంటి సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఈ పదార్ధాలు డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించటానికి సహాయం చేస్తాయి, ముఖ్యంగా టైప్ 2 మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కటి ఔషదంగా పని చేస్తుంది.

టైప్ 2 డయాబెటిస్ శరీరానికి తగిన ఇన్సులిన్ ఉత్పత్తి చేయని స్థితిని (లేదా) శరీరంలోని కణాలు ఉత్పత్తి చేసే ఇన్సులిన్ కు స్పందించని పరిస్థితిని సూచిస్తుంది. మరియు శరీరoలో తక్కువ మొత్తంలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పుడు లేదా ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాకపోవడం వలన టైప్ 1 డయాబెటిస్ సంభవిస్తుంది.

ఎథ్నోఫార్మాకోలై అను జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనo యొక్క నివేదికలో , 4 వారాల క్లినికల్ ట్రయల్ లో , 2000 మిల్లీగ్రాముల కాకరకాయ రసం రోజూవారీ ఆహార ప్రణాళికలో భాగంగా తీసుకున్న టైప్ 2 డయాబెటిస్ రోగులలో రక్తంలోని గ్లూకోజ్ స్థాయి గణనీయంగా తగ్గుదలను చూసినట్లు పేర్కొంది. అంతేకాక, కాకరకాయలోని మొక్క ఆధారిత ఇన్సులిన్ టైప్ 1 మధుమేహం రోగులకు సహాయం చేస్తుంది.

కెమిస్ట్రీ మరియు బయాలజీ జర్నల్ లో జారీ చేసిన మరొక నివేదికలో ఈ కాకరకాయ గ్లూకోజ్ లెవల్స్ పెంచి, గ్లైసెమిక్ నియంత్రణను మెరుగుపరుస్తుంది అని రుజువు చేసింది.

డయాబెటిస్ నియంత్రణకై ప్రతిరోజు ఎంత మోతాదులో కాకరకాయ రసం తీసుకోవాలి?

మధుమేహ నివారణా చర్యలలో భాగంగా కాకరకాయ జ్యూస్ రోజుకు 50-100 మిల్లీలీటర్ల రసం నుండి , 900 మిల్లీగ్రాముల పండును రోజులో మూడు సార్లు, రోజుకు 10-50 మిల్లీలీటర్లు టింక్చర్ తీసుకోవలసి ఉంటుంది.

1.చెడు క్రొవ్వును తగ్గిస్తుంది :

1.చెడు క్రొవ్వును తగ్గిస్తుంది :

కాకరకాయ రసం సహజ సిద్దంగా మంటను తగ్గించే గుణాలను కలిగి ఉండడంతో పాటు శరీరంలో చెడు క్రొవ్వుల స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇది గుండెపోటు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని సైతం గణనీయంగా తగ్గిస్తుంది. శరీరంలోని సోడియం అధికంగా గ్రహిస్తుంది, పొటాషియం కూడా అధికంగా ఉంటుంది, తద్వారా శరీరంలో రక్తపోటును నిర్వహించడానికి కూడా కాకరకాయ సహాయపడుతుంది.

2.కాలేయం శుభ్రపరుస్తుంది :

2.కాలేయం శుభ్రపరుస్తుంది :

కాకరకాయ రసం ప్రేగును శుద్ధి చేయటానికి సహాయపడుతుంది మరియు అనేక కాలేయ సంబంధిత సమస్యలను తగ్గించడంలో తోడ్పాటును అందిస్తుంది. ఒక అధ్యయనంలో కాకరకాయ రసం కాలేయంలోని ఎంజైమ్ల యొక్క రోగనిరోధకశక్తి చర్యను బలోపేతం చేయడం ద్వారా కాలేయ వైఫల్యాన్ని నిరోధించగలదని పేర్కొంది.

3. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :

3. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది :

కాకరకాయలో ఉండే అనామ్లజనకాలు బాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడుతూ చికిత్సా ప్రక్రియలో ఎంతగానో సహాయం చేయగలదు. మరియు అలెర్జీలు నయం చేయడం , కంటి చూపును మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి. ఈ శక్తివంతమైన అనామ్లజనకాలు ప్రాణవాయువులోని హానికర కారకాల వలన కలిగే డి.ఎన్.ఎ నష్ట నివారణకు సహాయం చేస్తాయి. మరియు కణాల సున్నితమైన పనితీరును నిర్ధారిస్తాయి. కాకరకాయలో ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే క్యాన్సర్-వ్యతిరేక మరియు కణితి వ్యతిరేక లక్షణాలు కూడా ఉన్నాయి.

4. బరువు నష్టాన్ని నిరోధిస్తుంది :

4. బరువు నష్టాన్ని నిరోధిస్తుంది :

కాకరకాయ విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో నిండి ఉంటుంది. ఈ ఫైబర్ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది,మరియు కడుపు నిండిన అనుభూతికి లోనవడం ద్వారా అతిగా తినడాన్ని నిరోధిస్తుంది, తృప్తిని పెంచుతుంది. కాకరకాయ రసంలో ఉండే విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు జీవక్రియల ప్రక్రియ వేగవంతం చేయడంలో దోహదం చేస్తాయి. కేలరీలు, కొవ్వు మరియు కార్బోహైడ్రేట్లలో తక్కువగా ఉంటుంది, తద్వారా బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది.

కాకరకాయ జ్యూస్ తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు :

కాకరకాయ జ్యూస్ తయారు చేయడానికి కావలసిన పదార్ధాలు :

•1-2 కాకరకాయలు

•½ నిమ్మకాయ

•¼ టీ స్పూన్ పసుపు పొడి

•కొంచం ఉప్పు

కాకరకాయ జ్యూస్ తయారీ విధానం:

కాకరకాయ జ్యూస్ తయారీ విధానం:

1. కాకరకాయలను శుభ్రంగా కడిగి, పీలర్ ఉపయోగించి పై తొక్కను తీయండి.

2. కాకరకాయను ముక్కలుగా తరిగి, తొక్క మరియు విత్తనాలను తీసుకోండి.

3. ఒక గిన్నెలో నీటిని తీసుకుని సగం టీస్పూన్ ఉప్పుని కలిపి, 10 నిముషాల పాటు కాకరకాయలను అందులో నానబెట్టాలి.

4. కాకరకాయ ముక్కలను తీసి, వాటిని ఒక జ్యూసర్లో ఉంచండి. దానికి నీరు జోడించి మిక్సీ వేయండి.

5. ఒక గ్లాసు లోకి రసం తీసుకుని, ఉప్పు, పసుపు మరియు నిమ్మరసం జోడించండి. తాగే ముందు బాగా షేక్ చేయండి.

గమనిక:

గమనిక:

చేదును తగ్గించడానికి చిటికెడు నల్ల మిరియాల పొడి, మరియు అల్లాన్ని కూడా జోడించవచ్చు.

హెచ్చరిక:

హెచ్చరిక:

కాకరకాయరసాన్ని అధికoగా సేవించడం మూలంగా కడుపు నొప్పి మరియు అతిసారం కలిగే అవకాశాలు ఉన్నాయి. కావున పరిమితిలోనే రసం తాగాలి. గర్భిణీ స్త్రీలు అధికంగా కాకరకాయ రసాన్ని తీసుకోవడాన్ని నివారించాలి, ఎందుకంటే ఇది గర్భాశయాన్ని ప్రేరేపించి, డెలివరీ డేట్ ను ముందుకు నడిపే సూచనలు ఉన్నాయి . ఏదైనా మితంగా తీసుకుంటే అమృతం, అతిగా తీసుకుంటే విషం అన్న విషయాన్ని మాత్రం మరవవద్దు. ఈ వేసవి కాలంలో శరీరం హైడ్రేట్ గా ఉంచుకునే చర్యలలో భాగంగా అనేక రకాల పండ్ల రసాలను ఆశ్రయిస్తాము. అదే విధంగా ఈ కాకరకాయ జ్యూస్ ను కూడా తీసుకోండి. చేదు తగ్గడానికి అనేక మార్గాలు కూడా ఉన్నాయి. రుచి గురించిన ఆలోచనలు చేస్తే, మంచి పోషకాలను దూరం చేసుకున్నట్లే. తినగ తినగ వేము తీయనుండు మరి.

ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా పేజీని తరచూ సందర్శిస్తూ ఉండండి. ఇటువంటి అనేక ఉపయోగపడే అంశాలతో ఎల్లప్పుడూ మా పేజి మీకు సేవలందిస్తుంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే మీస్నేహితులతో భాగస్వామ్యం చేయండి!

English summary

Bitter Gourd Juice For Diabetes And Weight Loss

Bitter Gourd Juice For Diabetes And Weight Loss,Do you know bitter gourd juice helps in treating diabetes? Read the article to know more about how to make bitter gourd juice for diabetes.