For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సహజంగానే మధుమేహ లక్షణాలను నియంత్రించే గృహ వైద్య పానీయం గురించి మీకు తెలుసా!

|

మనుషులుగా మనం, ఏ వ్యాధి అయినా మనను సోకుంతుందేమో అని భయపడుతుంటాం కదా!

మనం స్వతహాగా ఆలోచించడం నేర్చుకున్నప్పటి నుండి, మనలో వ్యాధులు మరియు మరణం యెడల భయం అనేది మెల్లగా అభివృద్ధి చెందటం మొదలవుతుంది. మనుగడ కోసం అనుక్షణం తపించే విధమైన స్వభావం ఉన్నందున, మానవులు ఇటువంటి విషయాలకు భయపడడం సహజమే!

మన చుట్టూ ఉన్న మనుషులు వివిధ వ్యాధులతో బాధపడుతుండటం, కొన్ని వ్యాధుల వలన వారు ప్రాణాలను కోల్పోవడాన్ని కూడా మనం చూస్తుంటాము. కనుక, మనకు ఏ వ్యాధులు, ఇతర వ్యాధుల కంటే వ్యాధులు ప్రమాదకరమైనవి అనే అవగాహన ఉంటుంది. ఉదాహరణకు, హృద్రోగాలు, క్యాన్సర్, ఎయిడ్స్ మరియు మధుమేహం వంటివి ప్రమాదకర వ్యాధులలో కొన్ని.

This Homemade Drink Can Reduce Diabetes Symptoms Naturally!

మధుమేహం అనేది ఒక జీవక్రియ లోపము అని మనందరికీ తెలిసిందే! మధుమేహ వ్యాధిగ్రస్తులకు శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గులు ఉన్న కారణంగా, రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. అధిక దాహం, మాటిమాటికి మూత్రవిసర్జన చేయటం, గాయాలు నెమ్మదిగా తగ్గడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, బరువు తగ్గిపోవడం, అలసట మొదలైనవి మధుమేహ వ్యాధి యొక్క లక్షణాలు.

మధుమేహానికి శాశ్వత నివారణ లేదు, కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, తేలికపాటి వ్యాయామం చేస్తూ, క్రమం తప్పకుండా మందులను వాడుతూ చికిత్స తీసుకోవడం వలన, దాని లక్షణాలను నియంత్రించవచ్చు. సాధారణ మందులు, . రోగులు వారి జీవితాంతం ప్రతిరోజు మందులు తీసుకోవలసి ఉంటుంది.

కొన్ని రకాల వ్యాధి లక్షణాల నియంత్రణ కొరకు, దీర్ఘకాలికంగా ప్రతిరోజు శక్తివంతమైన రసాయనాల నుంచి తయారయ్యే ఔషధాలను వాడటం వలన, మన ఆరోగ్యం దెబ్బతింటుందని మనందరికీ తెలిసిందే! కనుక, మనం సహజ పద్ధతుల ద్వారా వీలైనంత వరకు మనకున్న వ్యాధి లక్షణాలను నియంత్రించడానికి ప్రయత్నించాలి. సహజ పద్ధతులను పాటిస్తూ, మీరు వాడే రసాయన మందులు మోతాదు తగ్గించడం గురించి, మీ డాక్టర్ తో మాట్లాడి సలహా తీసుకోండి.

మన వంటగది మరియు పెరటితోటలో, అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్న, అనేక సహజ పదార్థాలు ఉంటాయి. ఇవి వివిధ వ్యాధులను నివారించడానికి మాత్రమే కాకుండా చికిత్స కొరకు కూడా పనిచేస్తాయి.

సహజ నివారణలు, చిన్న తలనొప్పిని మొదలుకొని, క్యాన్సర్ మరియు మధుమేహం వంటి ఒక శ్రేణిలో ఉండే తీవ్రమైన వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగపడతాయి. కనుక, మీ కొరకు ఇప్పుడు, మధుమేహ లక్షణాలను సహజ పద్దతిలో తగ్గించే, ఇంట్లో తయారు చేసుకోగలిగే పానీయం గురించి తెలుపబోతున్నాం.

సహజ ఔషధాల శక్తి:

మనలో చాలామంది భారతీయ పురాతన వైద్య విధానం అయిన ఆయుర్వేదం గురించి వినే ఉంటాం. ఇది భారతదేశం లో ఉద్భవించింది. ఆయుర్వేదం వైద్య విధానంలో వివిధ వ్యాధుల చికిత్స కొరకు సహజ పదార్ధాలను ఉపయోగించి, శక్తివంతమైన మందులను తయారు చేస్తారు.

ఆధునిక మందులతో పోల్చి చూస్తే, సహజ ఔషధాలలో పలు ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో రసాయనాలు లేకపోవడం వలన, ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు.

కనుక,దుష్ప్రభావాల గురించి భయపడకుండా. సహజ ఔషధాలను దీర్ఘకాలికంగా ఉపయోగించవచ్చు.

ఇప్పుడు, మధుమేహ లక్షణాల చికిత్స కొరకు ఉపయోగపడే సహజమైన పానీయం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

తాజా ఉసిరికాయ రసం- 4 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క పొడి - 1 టేబుల్ స్పూన్

కరివేపాకు - 5-6 ఆకులు

తయారీ విధానం:

ఉసిరికాయ రసం, దాల్చిన చెక్క పొడి, కరివేపాకులు మరియు ½ కప్పు నీటిని ఒక బ్లెండర్ లో వేయండి. బ్లెండ్ చేసి రసం తయారు చెయ్యండి. ఈ రసం ప్రతిరోజు ఉదయం అల్పాహారం తినే ముందు త్రాగండి. ఈ రసంలో చక్కెర లేదా ఉప్పును వేయవద్దు.

మధుమేహ లక్షణాల చికిత్సకు, ఈ గృహ నివారణ క్రమం తప్పకుండా సరైన పరిమాణంలో ఉపయోగించినప్పుడు, అత్యద్భుతంగా పనిచేస్తుంది. అయితే,మన జీవనశైలిలో నిర్దిష్టమైన ఆరోగ్యకర మార్పులు చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సహజ ఔషధ వినియోగం ప్రభావవంతంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.

ఆహారంలో పిండిపదార్ధాలను పూర్తిగా తీసుకోకపోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామాలు చేయటం, ధూమపానం మరియు మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం, వంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి.

ఉసిరికాయ రసంలో, అధిక మోతాదులో విటమిన్ సి కలిగి ఉన్నందున, ఇది మీ శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచి, తద్వారా మధుమేహం లక్షణాలను నయం చేస్తుంది.

అనేక అధ్యయనాలలో, మరో సహజ పదార్ధమైన దాల్చినచెక్క, మధుమేహ రోగుల రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకురాగలిగే శక్తివంతమైన ఎంజైమ్లను కలిగి ఉంది అని తేలింది.

మన వంటలకు సువాసన చేకూర్చడానికి విరివిగా వాడే కరివేపాకులో కూడా ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. అంతేకాక, ఫాస్ఫరస్ మరియు విటమిన్ సి సమృద్ధిగా ఉన్నందున, ఇవి మధుమేహ చికిత్సలో ఉపయోగపడతాయి.

English summary

This Homemade Drink Can Reduce Diabetes Symptoms Naturally!

Diabetes is a metabolic disorder that has no permanent cure, but its symptoms can be treated. Many ingredients in our kitchen have medicinal properties & can treat diabetes. To make a natural drink, add 4 tbsp of gooseberry juice, 1 tbsp of cinnamon powder & 4-5 curry leaves in a blender, grind well.
Story first published: Thursday, August 2, 2018, 16:10 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more