For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మధుమేహంతో ఇబ్బందిపడేవారంతా ఈ ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే చాలు షుగర్ నియంత్రణలో ఉంటుంది

డయాబెటిక్స్, షుగర్ వ్యాధితో బాధపడే వారికి వేప చాలా మంచి చేస్తుంది. వేపఆకులో ఉండే ప్రత్యేక గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించగలవు. షుగర్ ఎక్కువ కావడానికి కారణం అయ్యే గ్లూకోజ్- హైపర్గ్లైస

|

చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. ఎన్ని రకాల మందులు ఉపయోగించినా కూడా షుగర్ అదుపులోకి వస్తుండదు. కానీ ఆయుర్వేదం ప్రకారం కొన్ని రకాల వాటిని ఉపయోగించడం వల్ల మీ మధుమేహం అదుపులోకి వచ్చే అవకాశం ఉంది. మరి అవి ఏమిటో ఒకసారి చూడండి.

అజాడిరాచాటా ఇండికా (వేప)

అజాడిరాచాటా ఇండికా (వేప)

డయాబెటిక్స్, షుగర్ వ్యాధితో బాధపడే వారికి వేప చాలా మంచి చేస్తుంది. వేపఆకులో ఉండే ప్రత్యేక గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను గణనీయంగా తగ్గించగలవు. షుగర్ ఎక్కువ కావడానికి కారణం అయ్యే గ్లూకోజ్- హైపర్గ్లైసీమియా, ఆడ్రెనాలిన్ ను తగ్గించే గుణాలు వేపలో ఉంటాయి.

వేప ఆకుల ద్వారా టీ తయారు చేసుకుని దాన్ని తాగితే కూడా మీకు చాలా ప్రయోజనాలున్నాయి. దీని వల్ల డయాబెటీస్ అదుపులోకి రావడమే కాకుండా, చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు. అలాగే వేప ఆకులను డైరెక్ట్ గా తింటే కూడా మంచి ఫలితాలుంటాయి.

సిన్నమోమం కాసియా (దాల్చిన చెక్క)

సిన్నమోమం కాసియా (దాల్చిన చెక్క)

దాల్చిన చెక్క కూడా మధుమేహం వ్యాధిని నివారించగలుగుతుంది. , వాస్తవానికి దాల్చినచెక్కను రోజూ 1-6 గ్రాముల ప్రకారం తీసుకోవడం మంచిది. దీంతో ట్రైగ్లిజరైడ్స్, చెడ్డ కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా అదుపులో ఉంచగల శక్తి కూడా దాల్చిన చెక్కకు ఉంటుంది. అందువల్ల దాల్చిన చెక్కను తరుచుగా తీసుకోవడం వల్ల మీరు షుగర్ బారినపడకుండా ఉంటారు.

ట్రిగోన్నెల్ల ఫినెం-గ్రేక్ (మెంతులు)

ట్రిగోన్నెల్ల ఫినెం-గ్రేక్ (మెంతులు)

మెంతులు కూడా డయాబెటీస్ ను అదుపులో ఉంచగలవు. వీటిలోని ఆల్కలాయిడ్స్ గోన్నెలైన్, నికోటినిక్ యాసిడ్, కమారిన్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మెంతుల్లోని ఫైబర్ మధుమేహాన్ని నియంత్రించగలదు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే గుణాలు మెంతుల్లో ఉంటాయి. అందువల్ల తరచు మెంతులను తీసుకోవడం మంచిది.

Most Read :రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుందిMost Read :రోజూ రాత్రి వైన్ తాగితే చాలా ప్రయోజనాలు, యవ్వనంగా ఉండొచ్చు, ఆ వ్యాధులేమీ రావు, ఆ శక్తి పెరుగుతుంది

కాకరకాయ

కాకరకాయ

కాకరకాయ మధుమేహాన్ని త్వరగా నివారించగలదు. కాకరకాయతో తయారు చేసిన పదార్థాలను తరచుగా తినడం మంచిది. అలాగే వీలైతే కాకర రసాన్ని తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది.

మరిన్ని సలహాలు

మరిన్ని సలహాలు

అలాగే మరికొన్ని సూచనలు కూడా పాటించాలి. మీరు బరువు నియంత్రణలో ఉంచుకోండి. తీపి ఆహారపదార్థాలు (కార్బోహైడ్రేట్లు, పక్వానికి వచ్చిన పండ్లు )లాంటివి తక్కువగా తింటూ ఉండి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రోజూ ప్రోటీన్స్ తో కూడిన ఆహారపదార్థాలను తినాలి.

ఇవి తినాలి

ఇవి తినాలి

తృణధాన్యాలు తినాలి. కాయధాన్యాలు, బీన్స్ వంటి ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్ధాలను తీసుకోండి. పసుపు, మిరియాలు, వెల్లుల్లి వంటి మసాలా దినుసులను తినాలి, వంకాయ, ఉల్లిపాయ వంటివి కూడా తినొచ్చు. మద్యం తాగకూడదు. అలాగే రోజూ రెండు నిమిషాల పాటు

యోగ చేయాలి. ఈ ట్రిక్స్ పాటిస్తే మీరు షుగర్ ను నియంత్రణలో ఉంచుకోవొచ్చు.

Most Read :రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయి,Most Read :రోజూ సెక్స్ లో పాల్గొంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు, మగవారికి సుఖంతో పాటు మంచి లాభాలున్నాయి,

English summary

siddhar ayurvedic remedies for diabetes

siddhar ayurvedic remedies for diabetes
Desktop Bottom Promotion