For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిర్యానీలో వాడే ‘ఈ’ ఆకు మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది..!!

బిర్యానీలో వాడే ‘ఈ’ ఆకు మీ చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది..!!

|

మన భారతీయులకు బిర్యానీ అంటే మహా ప్రీతి. ఎక్కువ మంది బిర్యానీని ఇష్టపడటానికి కారణం సాధారణ వంటకాల కంటే భిన్నంగా తయారుచేయడం. బిర్యానీ అంత రుచిగా రావడానికి అందులో ఉపయోగించే వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు. మూలికలు. మూలికల్లో బిర్యానీ ఆకు ఒకటి. ఇది భారతీయ వంటకాల్లో విస్తృతంగా ఉపయోగించే ఒక రుచికరమైన పాక మూలిక. ఇది లారస్ నోబిలిస్ చెట్టు నుండి వచ్చినది. దీనిని తేజ్ పట్టా, మలబార్ లీఫ్, ఇండియన్ కాసియా, లారెల్ లీఫ్ మరియు ఇండియన్ బిర్యానీ లీఫ్ వంటి రకరకాల పేర్లతో పిలుస్తారు.

Can Tej Patta (Bay Leaves) Help improve Glucose Levels In People With Type 2 Diabetes

ఈ ఆకులో మీకు ఆశ్చర్యం కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ రోగుల్లో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయంటే నమ్ముతారా? అవును ఇది నిజం. జర్నల్ ఆఫ్ క్లినికల్ బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, 1-3 గ్రాముల బిర్యానీ ఆకులు నెల రోజుల్లో మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడతాయి.

భారతీయ వంటకాలలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ మసాలా సుగంధ ద్రవ్యంలో వివిధ ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ వ్యాసంలో, మధుమేహ వ్యాధిగ్రస్తులలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో బిర్యానీ ఆకు ఎలా సహాయపడుతుందో? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

 బిర్యానీ ఆకుల్లో పోషకాలు

బిర్యానీ ఆకుల్లో పోషకాలు

ఈ బిర్యానీ ఆకులో టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, ఫ్లేవోన్లు, లినాలూల్, యూజినాల్, ఆంథోసైనిన్స్ మరియు మిథైల్ చావికోల్ వంటి ఫైటోకెమికల్ సమ్మేళనాలు పుష్కలంగా ఉన్నాయి. బిర్యానీ ఆకులలో విటమిన్ ఎ, ప్రొటీన్, ఐరన్, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, డైటరీ ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, సోడియం, కాపర్, జింక్, సెలీనియం, మాంగనీస్ మరియు ఫోలేట్ వంటి కొన్ని ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి.

HDL లేదా 'మంచి' కొలెస్ట్రాల్‌ను పెంచవచ్చు

HDL లేదా 'మంచి' కొలెస్ట్రాల్‌ను పెంచవచ్చు

ఈ బిర్యానీ ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు, LDL లేదా చెడు కొలెస్ట్రాల్ మరియు మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులలో హెచ్‌డిఎల్ స్థాయిలను పెంచడంలో కూడా ఇది సహాయపడుతుందని ఒక అధ్యయనంలో తెలిపింది. ఈ బిర్యానీ ఆకులల్లో ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ డయాబెటిక్ సమ్మేళనాలు ఉండటం దీనికి కారణం. 1-3 గ్రాముల బిర్యానీ ఆకులను నెల రోజుల పాటు తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు జరుగుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. బిర్యానీ ఆకులను నేరుగా తిననప్పటికీ,ఈ హెర్బ్ ను వంటల్లో అదనపు రుచి , సువాసన కోసం జోడించడం వల్ల యాంటీ-డయాబెటిక్ ప్రభావం తదుపరి 10 రోజుల వరకు ఉంటుంది. అందువల్ల గ్లూకోజ్ స్థాయిలపై దాని దీర్ఘకాలిక ప్రభావాన్ని సూచిస్తుంది.

డయాబెటిక్ రోగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు

డయాబెటిక్ రోగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు

డయాబెటిక్ రోగుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది నిర్దిష్ట ఆహారం లేదా భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్‌ హెచ్చుతగ్గులపై ప్రభావాన్ని సూచిస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం, ఆరు శాతం బిర్యానీ ఆకుల పొడిని కలిగి ఉన్న కుకీలు మధుమేహ వ్యాధిగ్రస్తులకు గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించడంతో రుచికరమైన మరియు సంతృప్తికరమైన ఆహార పదార్థంగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గిస్తుంది, ఇంకా కడుపుకు సంబంధించి జీర్ణశయాంతర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. దాని వినియోగం తర్వాత షుగర్ స్పైక్‌లను నివారిస్తుంది. అందువల్ల, ఇంట్లో వండే ఆహారాల్లో బిర్యానీ ఆకు లేదా దాని పొడి రూపాన్ని జోడించడం వలన దాదాపు అదే ప్రభావాన్ని అందించవచ్చు మరియు మధుమేహాన్ని నియంత్రించడంలో లేదా షుగర్ లెవల్స్ పెరగకుండా మెయింటైన్ చేయడంలో సహాయపడుతుంది.

ఇన్సులిన్ విడుదలకు సహాయపడవచ్చు

ఇన్సులిన్ విడుదలకు సహాయపడవచ్చు

శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్యాంక్రియాటిక్ బీటా కణాలను దెబ్బతీస్తాయి మరియు హైపర్గ్లైసీమియాకు దారితీస్తాయి. శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిలని నిర్వహించడానికి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడానికి ప్యాంక్రియాస్ బాధ్యత వహిస్తుంది. మరియు ప్యాంక్రియాటిక్ బీటా కణాలు నశించినప్పుడు, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గవచ్చు. దెబ్బతిన్న బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను ప్రోత్సహించడంలో మరియు ఇన్సులిన్ లభ్యతను పెంచడంలో బిర్యానీ ఆకు సంబంధం కలిగి ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్స్ నుండి ప్యాంక్రియాస్‌కు నష్టం జరగకుండా కూడా నివారిస్తుంది.

మధుమేహంతో వచ్చే ఇతర సమస్యలను నివారించవచ్చు

మధుమేహంతో వచ్చే ఇతర సమస్యలను నివారించవచ్చు

శరీరంలోని రక్తంలో గ్లూకోజ్ స్థాయిలో అదుపు తప్పితే అది నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గుండె జబ్బులు, కళ్ళు మసకబారడం, కంట్లో శుక్లాలు రావడం మరియు మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి సాంప్రదాయ మూలికైన బిర్యానీ రెగ్యులర్ వంటకాల్లో ఒక బాగం చేయండి. ఎందుకంటే ఇందులో ట్రైటెర్పెనాయిడ్స్, యూజినాల్ మరియు లినాలూల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. అవి యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.ఇవి రక్తంలో ఇన్సులిన్ లోపం మరియు తాపజనక కారకాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఇది మధుమేహాన్నిమంచిగా నిర్వహించడంలో సంబంధం కలిగి ఉంటుంది. మధుమేహాన్ని సరిగ్గా నిర్వహించినప్పుడు, దాని సమస్యల ప్రమాదం వాటంతట అవే తగ్గుతాయి.

బిర్యానీ ఆకుతో పాటు ఇతర యాంటీ డయాబెటిక్ మూలికలు

బిర్యానీ ఆకుతో పాటు ఇతర యాంటీ డయాబెటిక్ మూలికలు

కొన్ని సాధారణ మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలలో ఉండే యాంటీ-డయాబెటిక్ ప్రభావాల మూల్యాంకనంపై ఆధారపడిన ఒక అధ్యయనంలో కేవలం బిర్యానీ ఆకు, లికోరైస్ మరియు థైమ్ మాత్రమే ప్రధాన సమ్మేళనాలుగా గుర్తించబడ్డాయి. అవి శరీర కణాలలోని మొత్తం 18 ప్రోటీన్ లక్ష్యాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి. మధుమేహం ప్రభావాలు, గ్లూకోజ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తాయి. ఇది మధుమేహం నివారణ మరియు నిర్వహణలో బిర్యానీ ఆకుల యాంటీ-డయాబెటిక్ మెకానిజమ్స్ గురించి మాట్లాడవచ్చు.

బిర్యానీ ఆకు టీ

బిర్యానీ ఆకు టీ

బిర్యానీ లీఫ్ టీ మధుమేహ వ్యాధిగ్రస్తులకు వారి షుగర్ లెవల్స్‌ను నియంత్రించడానికి ఒక ఆరోగ్యకరమైన ఎంపిక. దీన్ని దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం.

కావల్సినవి:

2-3 బిర్యానీ ఆకులు

2 - కప్పుల నీరు

1/4 స్పూన్ పంచదార లేదా తేనె లేదా బెల్లం

పాలు (అవసరం అయితే)

తయారుచేయు విధానం:

తయారుచేయు విధానం:

1. ఒక గిన్నెలో నీరు పోసి, బిర్యానీ ఆకులు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

2. ఈ మిశ్రమాన్ని సుమారు 5-10 నిమిషాలు ఉడకబెట్టండి.

3. మీరు బిర్యానీ ఆకులకు బదులుగా ఒక టీస్పూన్ బిర్యానీ ఆకుల పొడిని కూడా ఉపయోగించవచ్చు.

4. మూత మూసివేసి, మంట తగ్గించి, మీడియం మంట మీద 10 నిమిషాలు ఉడకనివ్వండి.

5. 10 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి, టీని 2-3 నిమిషాలు చల్లబరచండి.

6. తరువాత, ఆకులను వడకట్టి టీని ఒక కప్పులో పోయాలి.

7. మీరు ప్లెయిన్ గా తాగడం ఇష్టపడకపోతే, మీకు కావాలంటే అందులో చక్కెర మరియు పాలు జోడించండి. అంతే ఇప్పుడు వేడి వేడి బిర్యానీ లీఫ్ టీ సిద్ధంగా ఉంది. వేడిగా త్రాగండి.

ముగింపు గమనిక

ముగింపు గమనిక

గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి డయాబెటిక్ డైట్‌లో బిర్యానీ ఆకులు గొప్ప ప్రయోజనకారిగా ఉంటుంది.. ఈ హీలింగ్ హెర్బ్‌ని ఎలా జోడించాలి మరియు దాని ప్రయోజనాలను ఎలా పొందాలి, అనే విషయంపై మీ వైద్యుడిని సంప్రదించండి.

English summary

Can Tej Patta (Bay Leaves) Help improve Glucose Levels In People With Type 2 Diabetes

Here we are talking about the Can Tej Patta (Bay Leaves) Help improve Glucose Levels In People With Type 2 Diabetes.
Story first published:Tuesday, January 17, 2023, 16:45 [IST]
Desktop Bottom Promotion