For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిజమా లేదా అబద్దమా: వేప నిజంగా మధుమేహాన్ని తొలగిస్తుందా?మీకు సమాధానం ఇక్కడ ఉంది!!

|

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అంచనా ప్రకారం, ప్రతి సంవత్సరం ప్రపంచంలో 1.6 మిలియన్ల మంది డయాబెటిస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. 2030 నాటికి డయాబెటిస్ ప్రపంచంలో 7 వ అతిపెద్ద ప్రాణాంతక వ్యాధిగా మారుతుందని WHO పేర్కొంది. డయాబెటిస్ అంటే శాశ్వత వ్యాధి, దీని వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. మరియు దీనికి చికిత్స చేయకపోతే ఇది మీ గుండె, రక్త నాళాలు, కళ్ళు మరియు మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. దాని గుర్తింపులో ఆలస్యం మరియు అవగాహన లేకపోవడం వల్ల, నియంత్రించడం చాలా కష్టం అవుతుంది.

డయాబెటిస్‌తో పోరాడుతున్న వారు తమ ఆహారం గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి. తీపి ఆహారాలకు, కూల్ డ్రింక్స్ కు మరియు ప్రశాంతతలకు దూరంగా ఉండటం ఎల్లప్పుడూ మంచిది. డయాబెటిక్ వారు తీసుకునే ఆహారంలో ఎల్లప్పుడూ అధిక ఫైబర్ ఆహారం, పిండి పదార్థాలు తక్కువగా మరియు ప్రోటీన్ల సమతుల్య మిశ్రమంగా ఉండాలి. ఈ వ్యాధితో పోరాడటానికి మీకు సహాయపడే అనేక మూలికలు మరియు సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. ఉదాహరణకు, మెంతులు మీ శరీరంలోని రక్తంలో పెరిగిన చక్కెర స్థాయిని తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ఈ కథనంలో మరొక పేరు వేప, ఇది ఈ వ్యాధితో పోరాడటానికి ఇది చాలా ప్రసిద్ది చెందింది.

వేప పవిత్ర భారతదేశం అంతటా కనిపించే ఒక మొక్క

వేప పవిత్ర భారతదేశం అంతటా కనిపించే ఒక మొక్క

వేప పవిత్ర భారతదేశం అంతటా కనిపించే ఒక మొక్క లేదా చెట్టు. వేప చెట్టు సుమారు 30 నుండి 35 అడుగుల ఎత్తు ఉంటుంది మరియు దానిలోని ప్రతి భాగం వైద్య లక్షణాలతో నిండి ఉంటుంది. ప్రాచీన కాలం నుండి భారతదేశం మరియు చైనా ఔషధాలలో వేప ఒక అంతర్భాగం. వేప చెట్ల ఆకులు, పువ్వులు, విత్తనాలు, పండ్లు, మూలాలు మరియు బెరడు అన్నీ ఔషధ ఉపయోగంలో ఏదో ఒక విధంగా ఉపయోగిస్తారు. అంటువ్యాధుల, మంట, జ్వరం, చర్మ వ్యాధులు లేదా దంతాల సమస్య వల్ల అన్ని వ్యాధులలో వేపను ఉపయోగిస్తారు.

కొన్ని అధ్యయనాల ప్రకారం, మధుమేహాన్ని నియంత్రించడంలో

కొన్ని అధ్యయనాల ప్రకారం, మధుమేహాన్ని నియంత్రించడంలో

కొన్ని అధ్యయనాల ప్రకారం, మధుమేహాన్ని నియంత్రించడంలో వేప కూడా సహాయపడుతుంది. ఇండియన్ జనరల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మకాలజీలో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం, అనేక వ్యాధుల రాకను నివారించడంలో లేదా ఆలస్యం చేయడంలో వేప ప్రభావవంతంగా ఉంటుంది.

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో వేప

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో వేప

అయితే రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో వేప నిజంగా సహాయపడుతుందనే వాదనపై ఇంకా చాలా పరిశోధనలు చేయాల్సి ఉంది. కానీ చాలా మంది నిపుణులు దీనికి మద్దతుగా నిలబడ్డారు. మీకు డయాబెటిస్ ఉన్నట్లయితే, మీరు రోజూ వేప రసం త్రాగవచ్చు లేదా వేప ఆకులను మాత్రమే నమలవచ్చు. కానీ మితంగా మాత్రం తీసుకోవాలి. పరిమితికి మించి తీసుకోకూడదున్న విషయం గుర్తుంచుకోండి మరియు దీనిని ఉపయోగించే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.

వేప ఆకులు గ్లైకోసైడ్లు మరియు యాంటీ వైరల్ లక్షణాలు

వేప ఆకులు గ్లైకోసైడ్లు మరియు యాంటీ వైరల్ లక్షణాలు

వేప ఆకులు గ్లైకోసైడ్లు మరియు యాంటీ వైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మీ రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడతాయి.

డయాబెటిస్ వారి కోసం వేప నీరు లేదా వేప రసం ఎలా తయారు చేయాలి:

డయాబెటిస్ వారి కోసం వేప నీరు లేదా వేప రసం ఎలా తయారు చేయాలి:

డయాబెటిస్ ఉన్నవారు వారు తినే ఆహారంలో తరచుగా చేదు పదార్థాలను ఉపయోగిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం వేప రసంలో యాంటీ బయోటిక్ లక్షణాలతో క్రియాశీల పదార్థాలు కూడా ఉన్నాయి.

తయారీ

తయారీ

1. 20 వేప ఆకులను అర లీటరు నీటిలో వేసి 5 నిమిషాలు ఉడకబెట్టండి.

2. ఆకులు మృదువుగా ఉడకడం ప్రారంభమవుతాయి మరియు నీరు ముదురు ఆకుపచ్చగా మారుతుంది.

3. ఈ నీటిని వడగట్టి మరియు దానిని ఒక కంటైనర్‌లో నింపి పెట్టుకుని రోజుకు కనీసం 2 సార్లు త్రాగండి.

న్యూట్రిహెల్త్ వ్యవస్థాపకుడు

న్యూట్రిహెల్త్ వ్యవస్థాపకుడు

న్యూట్రిహెల్త్ వ్యవస్థాపకుడు మరియు సంరక్షణ నిపుణుడు డాక్టర్ శిఖా శర్మ కూడా ఆరోగ్యకరమైన కషాయాలను వినియోగించాలని సిఫార్సు చేస్తున్నారు. వారి ప్రకారం, మీరు మెంతి పొడి, నేరేడు విత్తనాల పొడి, వేప పొడి మరియు వేపకాయ పొడులతో ఆరోగ్యకరమైన కషాయాలను తయారు చేయవచ్చు. మధ్యహ్నాం భోజనం ముందు మరియు రాత్రి భోజనానికి అరగంట ముందు వీటిలో ఏదో ఒక దానిని ఒక చెంచా పొడిని నీటితో కలిపి తీసుకోండి.

 డయాబెటిస్‌ను నియంత్రించడం అంత తేలికైన పని కాదు

డయాబెటిస్‌ను నియంత్రించడం అంత తేలికైన పని కాదు

డయాబెటిస్‌ను నియంత్రించడం అంత తేలికైన పని కాదు, కానీ ఆరోగ్యకరమైన అలవాట్లను అవలంబించడం ద్వారా మీరు కనీసం మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యంగా ఉంచుకోవచ్చు. అయితే మీరు మీ ఔషధాలను వదిలివేసి ఈ ప్రిస్క్రిప్షన్లపై పూర్తిగా ఆధారపడాలని మేము సూచించము. మీ ఆహారంలో ఏదైనా పెద్ద మార్పులు చేసే ముందు మీరు ఒకసారి మీ ఆరోగ్య నిపుణుడిని సంప్రదించాలని గుర్తుంచుకోండి.

English summary

Neem For Diabetes: How Does The Wonder Herb Help Manage Blood Sugar Levels

Neem is one of the most versatile plants ever. According to Ayurveda, it is a powerful herb capable of curing various ailments. In fact, there is strong evidence about the herb being used for healing purposes for as long as 4,500 years ago.
Story first published: Saturday, October 26, 2019, 15:31 [IST]