For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తేలికగా బరువును తగ్గించే ఐదు రకాల హెల్తీ సలాడ్స్

|

బరువూ, లావూ తగ్గటానికి ఏం చెయ్యాలన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చిస్తున్న అతి పెద్ద అంశం .రోజూ భోజనానికి ముందు సలాడ్లు తింటే మంచి ప్రయోజనం ఉంటుందన్నది తాజా పరిశోధనల సిఫార్సు. ఊబకాయం తగ్గటానికి ఏం తినాలి.? ఎలా తినాలో నిర్ధేశిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎన్నో రకాల ఆహార విధానాలూ (డైట్స్) ఎంతో స్వయం ప్రకటిత ప్రత్యేక నిపుణులూ (ఢైట్ గురూస్) పుట్టుకొస్తున్నారు. అయితే వీళ్లలో ఏ ఇద్దరి సిఫార్సలూ ఒక రకంగా ఉండవు. ప్రతిదానిపైనా బోలెడు వివాధాలు. వీటన్నీటికీ ధైర్యంగా ఏ వివాదాలూ లేని చిన్న చిట్కా ఒకటి చెబుతున్నారు. డైటిక్ అసోసియెషన్ వాళ్లు.

టమోటో సలాడ్

టమోటో సలాడ్

టమోటోలలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చివి తింటే ప్రకృతి అందించిన పోషకాలన్నీ దేహానికి చేరతాయి. కాబట్టి ఈ పచ్చి టమోటో లను సలాడ్స్ రూపంలో..

క్యారట్-శనగల సలాడ్

క్యారట్-శనగల సలాడ్

ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితమైన డైట్ని పాటించాలని తెలిసినా, తినడానికి సమయం లేదంటూ అల్పాహారాన్ని తరచూ బ్రేక్ చేస్తుంటారు. ..

కీరా-టమాటో సలాడ్

కీరా-టమాటో సలాడ్

అదే మరి "కీరదోస " గొప్పదనం. తినడానికి మరెన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ అంతా కీర ముక్కల్న్నే ఎందుకు తింటారు అంటే

మొలకెత్తిన పెసలు-ఎగ్ సలాడ్

మొలకెత్తిన పెసలు-ఎగ్ సలాడ్

బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం ... మొలకెత్తిన విత్తనాలు - పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు,

వెజ్‌ సలాడ్‌

వెజ్‌ సలాడ్‌

రకరకాల వెజిటేబుల్స్ తో , అలాగే రకరకాల పండ్లతోటి రెడీ చేసే సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.మీడైట్ లో తప్పకుండా మసాలాలు, కొవ్వు పదార్థాలు,

వేపుల్లు లేకుండా చేసుకుంటే తప్పకుండా మీరు అతి తక్కువ బరువు కలిగి ఉంటారు.

అదేమటంటే... రోజూ భోజనం చేసే ముందు .. ఒకటి రెండుసార్లు సలాడ్లు తీసుకోవాలి. అంటే క్యారెట్, బీట్ రూట్, ఉల్లి, టమెటో, ముల్లంగి, క్యాబేజీ, వంటి కొన్ని పచ్చికూరముక్కలు, మొలకెత్తిన పెలసు, శెనగల వంటి గింజలు తీసుకోవాలి. ఈ ఒకటిరెండుసార్లు సలాడ్లు తీసుకుంటే ఈ తర్వాత సహజంగానే మనం తీసుకునే ఆహారపరమైన క్యాలరీలు గణనీయంగా తగ్గుతాయి. తర్వాత ఊబకాయానికి కారణమయ్యే కొవ్వు, చక్కెరలు కూడా బాగా తగ్గుతాయి. ఇలా కొద్ది నెలల పాటు చేస్తే క్రమేపీ బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు అంటున్నారు. రకరకాల వెజిటేబుల్స్ తో, అలాగే రకరకాల పండ్లతోటి రెడీ చేసే సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. సలాడ్స్ ను టమోటో, క్యారెట్, బీట్ రూట్, క్యాబేజ్, క్యాప్సికమ్,
లెట్యూస్ మరియు కీర దోసకాయలాంటి కూరగాయలలో బరువును తగ్గించే విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్ ఎక్కువగా కలిగి ఉంటాయి. మన ఆరోగ్యాన్ని శాసించేది ఆహరమే.
శరీరానికి సరిపడినంత ... వీటిని డైరెక్ట్ గాను, జ్యూస్, సలాడ్స్ ల రూపంలోనూ తీసుకోవచ్చు. మరి ఆ సలాడ్స్ ఏంటో చూద్దాం...

1.టమోటో సలాడ్: టమోటోలలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. పచ్చివి తింటే ప్రకృతి అందించిన పోషకాలన్నీ దేహానికి చేరతాయి. కాబట్టి ఈ పచ్చి టమోటో లను సలాడ్స్ రూపంలో తీసుకోవడం చాలా మంచిది.
అందుకు కావలసిన పదార్థాలు: టమోటోలు: 4, కొత్తమీర: ఒక కప్పు,ఉప్పు రుచికి తగినంత, కారం: తగినంత
తయారు చేయు విధానం: ముందుగా ఉప్పును, కారం, కలుపుకోవాలి. పండిన టమోటోలను పెద్ద పెద్ద చక్రాలుగా తరిగి, ఉప్పు, కారం, మిశ్రమాన్ని ఒక్కొక్క టమోటో ముక్క మీద సమంగా పడేటట్లు చల్లుకోవాలి. చివరగా తరిగిన కొత్తమీరతో అలకరించి తినాలి.

2.క్యారట్-శనగల సలాడ్ : ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితమైన డైట్ని పాటించాలని తెలిసినా, తినడానికి సమయం లేదంటూ అల్పాహారాన్ని తరచూ బ్రేక్ చేస్తుంటారు. ... క్యారెట్, బీట్రూట్ ముక్కలు తినడంవల్ల రక్తం బాగా వృద్ధి చెందుతుంది.

కావలసిన పదార్థాలు: క్యారట్ నాలుగు , కాబూలి శనగలు 50గ్రా , క్యాప్సికం 1 ,కొత్తిమీర 2 చెంచాలు ,నిమ్మరసం ఒక చెంచాడు ,ఉప్పు తగినంత ,మిరియాల పొడి అర చెంచా ,నూనె సరిపడా. ఆవాలు చిటికెడు , కరివేపాకు ఒక రెమ్మ .
తయారు చేసే విధానం: శనగలను రాత్రి నానబెట్టి ఉంచుకోవాలి. క్యారెట్ చెక్కు తీసి సన్నగా తరిగి ఆ ముక్కలకు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. కలాయిలో నూనె తీసుకుని వేడి చేసి ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ పోపును క్యారెట్ మిశ్రమంలో కలపాలి. నాన బెట్టిన శనగలు వడకట్టి నీళ్లలో కడిగి సిద్ధంగా ఉంచుకోవాలి. క్యాప్సికమ్‌ను సన్నని ముక్కలుగాతరగాలి. పోపు కలిపిన క్యారెట్ మిశ్రమానికి శనగలు, క్యాప్సికమ్ ముక్కలు, సన్నగా తరిగిన కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి కలిపి వడ్డించాలి.

3. కీరా-టమాటో సలాడ్: అదే మరి "కీరదోస " గొప్పదనం. తినడానికి మరెన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ అంతా కీర ముక్కల్న్నే ఎందుకు తింటారు అంటే, ఇది ఆరోగ్యానికి చక్కని ఒషధం. సౌందర్యానికి ప్రియనేస్తం. ఊబకాయలకు బద్ధ శత్రువు.

కావలసిన పదార్థాలు: కీరా దోసకాయ ఒకటి ,టమాటాలు రెండు, ఉప్పు తగినంత, కొత్తిమీర రెండు స్పూన్‌లు , పచ్చి బఠానీలు రెండు టీస్పూన్‌లు ,వెనిగర్ ఒక టీస్పూన్ ,మిరియాల పొడి అర స్పూన్ .
తయారు చేసే విధానం: కీరా దోసకాయ, టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులో తరిగిన కొత్తిమీర, పచ్చిబఠానీలు, ఉప్పు మిరియాల పొడి, వెనిగర్ అన్నీ బాగా కలిపి కొద్దిసేపు ఫ్రిజ్‌లో చల్లబరచి తింటే బావుంటుంది. కావాలంటే ఇందులో కప్పు చిక్కటి పెరుగు కలిపి కూడా తినొచ్చు.

4. మొలకెత్తిన పెసలు-ఎగ్ సలాడ్ : బరువు తగ్గాలంటూ ఆహారం తినకుండా పస్తులుంటున్నారా? అసలు ఆహారం ... మొలకెత్తిన విత్తనాలు - పెసలు, శనగలు, వేరు శనగ పప్పులు, చందలవంటివి నానపోసి మొలకలు వచ్చిన తర్వాత తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కావలసిన పదార్థాలు: మొలకెత్తిన పెసలు ఒక కప్పు , సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ,ఉడికించిన కోడి గుడ్డు ఒకటి ,సన్నగా తరిగిన టమాటా రెండు ,తరిగిన కొత్తిమీర రెండు స్పూన్‌లు , ఉప్పు తగినంత ,నిమ్మరసం ఒక టీస్పూన్ ,మిరియాల పొడి అర స్పూన్ .
తయారు చేసే విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో మొలకెత్తిన పెసలు టమాటా ముక్కలు ,ఉల్లిపాయల ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం, ఉడికించిన గుడ్డు, టమోటోముక్కలు, మిరియాలు వేసి బాగా మిక్స్ చేసి తినొచ్చు.

5. వెజ్‌ సలాడ్‌ : రకరకాల వెజిటేబుల్స్ తో , అలాగే రకరకాల పండ్లతోటి రెడీ చేసే సలాడ్స్ ఆరోగ్యానికి చాలా మంచిది.మీడైట్ లో తప్పకుండా మసాలాలు, కొవ్వు పదార్థాలు,
వేపుల్లు లేకుండా చేసుకుంటే తప్పకుండా మీరు అతి తక్కువ బరువు కలిగి ఉంటారు.
కావలసిన పదార్థాలు: పచ్చి బఠాణీలు : ఒక కప్పు,బీన్స్‌, క్యారెట్‌ ముక్కలు : చెరో కప్పు,బొప్పాయి, చెర్రీ, ఫైనాఫిల్‌ ముక్కలు : అన్నీ కలిపి 2 కప్పులు,పాలు : ఒక కప్పు,మైదా, వెన్న. : అర టీస్పూన్‌ చొప్పున,మిరియాల పొడి : ఒక టీస్పూన్‌,ఉప్పు : అర టీస్పూన్‌
తయారీ విధానం: ముందుగా పచ్చిబఠాణీ, బీన్స్‌, క్యారెట్‌ ముక్కలను ఉడికించి పెట్టుకోవాలి. పాలల్లో వెన్న, మైదాపిండి కలిపి సన్నటి మంటపై వేడి చేయాలి. ఈ పదార్థం ఉడు కు తుండగా గట్టిపడి క్రీంలాగా తయారవుతుంది. ఇ ప్పుడు దాంట్లో ఉడికించి ఉంచుకున్న కూరగాయ ముక్కలను, పండ్ల ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి. పైన మిరి యాలపొడి, ఉప్ప చల్లి తే పోషకాల సలాడ్‌ తయారైనట్లే..! ఈ పదార్థం పూర్తిగా పండ్లు, కూరగాయలు, పాలతో తయారైనది కాబట్టి పోషకాలు మెండుగా లభిస్తాయి.

English summary

5Types of Salads for Weight Loss... | బరువు తగ్గించే ఐదు రకాల సలాడ్స్...


 Stay slim with this mealtime trick: start your meal with one of these healthy soups and salads. Filling up on fiber- and water-rich foods first can help prevent you weight.
Story first published: Wednesday, September 12, 2012, 16:40 [IST]
Desktop Bottom Promotion