For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవన విధానాలు - శారీరక ధృఢత్వం!

By B N Sharma
|

 Body Fitness In Changing Lifestyles!
నేటి రోజులలో శరీర వ్యాయామాలకు ప్రాధాన్యతలనిచ్చే నేటి యువత తమ పొట్ట భాగం సిక్స్ ప్యాక్ లేదా ఎయుట్ ప్యాక్ గా వుండాలని తీవ్ర కృషి చేస్తున్నారు. దానికొరకు జిమ్ లలో చేరటం, వివిధ పోషక పదార్ధాలు కల తిండ్లు తినటం కూడా చేస్తున్నారు. బలంగా వుండే పొట్ట కండరాలు వెన్నెముకకు కూడా బలాన్నిస్తాయి. జిమ్ లకు వెళ్ళకుండా ఇంటివద్దే చేసుకోదగిన కొన్ని పొట్ట వ్యాయామాలు చేసుకోవచ్చు.

వ్యాయామాలే కాక ఆహారం కూడా శరీర సౌష్టవం పొందటంలో ప్రాధాన్యత వహిస్తుంది. వ్యాయామం తర్వాత బ్లాక్ టీ తాగితే శక్తి పుంజుకోవచ్చు. రోజంతా చురుకుగా వుంటారు. నైట్రిక్ యాసిడ్ లెవెల్ పెరిగి బలాన్ని పొంది వెయిట్ లిఫ్టింగ్ వంటివి తేలికగా చేయగలరు. వర్కవుట్ల తర్వాత జింజర్ టీ తాగితే కూడా అది సహజమైన మెడిసిన్ లా పనిచేస్తుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. జీర్ణక్రియ పెరుగుతుంది. కనుక కండల నొప్పులు తగ్గాలంటే జింజర్ టీ మంచిది. తీపిలేని, ఐస్ వేసిన టీ వ్యాయామం తర్వాత తాగితే బాడీ ఎనర్జీ స్ధాయి పెరిగి శరీరం చల్లగా వుంటుంది. దీనిలో కేలరీలు తక్కువ. స్ట్రెచింగ్ లేదా కార్డియో వర్కవుట్లు చేసేవారికి ఇది సూచించదగినది. కనుక మీ వర్కవుట్ల తర్వాత ఫిట్, ఆరోగ్యం, చురుకుదనం పొందడానికి పైన తెలుపబడిన టీలు తాగి మరింత శక్తి సామర్ధ్యాలను పొందండి.

మారుతున్న జీవన విధానం కారణంగా మనిషి తీసుకునే ఆహారంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు సరైన ఆహారం తీసుకోకుండా ఆ సమయానికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకుని భోజనం అయిందని అనిపిస్తాం. నిజానికి ఇలాంటి ఆహారం వల్లే స్థూలకాయం బారిన పడుతున్నట్టు అనేక అధ్యయాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కసారి స్థూలం కాయం బారిన పడిన తర్వాత దాన్ని తగ్గించేందుకు యోగా, వ్యాయామం, వాకింగ్ ఇలా ఎన్నో చేస్తుంటాం.

అయితే, అయినప్పటికీ.. శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇలాంటి కొవ్వును తగ్గించడానికి ప్రతి దినం వేగంగా నడక సాగిస్తే తొడలు, పిరుదులు, కాళ్ళ భాగంలోని కొవ్వు బాగా కరిగిపోతుంది. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, స్విమ్మింగ్, లాన్ టెన్నిస్ వంటివి కాళ్ళకు, శరీరానికి మంచి బలాన్నివ్వటమే కాక తొడ కొవ్వును కూడా తగ్గించి శరీర ధారుఢ్యాన్ని పెంచుతాయి.

English summary

Body Fitness In Changing Lifestyles! | జీవన విధానాలు - శారీరక ధృఢత్వం!

Because of the changing lifestyles, the food taken by us is also under going changes. City life made us to forget the food timings and we are consuming whatever food is available to us even at odd hours. Because of these irregular eatings most of the people are gaining weight and for shedding weight once again we are following some more irregular habits.
Story first published:Saturday, April 7, 2012, 11:35 [IST]
Desktop Bottom Promotion