For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వయస్సు మీద పడకుండా.. యవ్వనంగా కనిపించేలా..!

|

ప్రస్తుత జనరేషన్ లో వయస్సు ముప్పై దాటిందంటే చాలు వ్యక్తుల్లో అలజడి మొదలవుతుంది...!ఎందుకంటే ముప్పైలోనే వయస్సు ఎక్కువనవారిగా కనబడుతుంటారు. అందుకు ప్రధాన కారణం. జీవనశైలి. తద్వారా శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకోవడం జరగుతుంది. ముఖ్యంగా మొదట ఆ మార్పు కనబడేది ముఖంలోనే. కళ్ళు క్రింద నల్లటి వలయాలు, ముఖంలో, మెడమీద ముడతలు ఏర్పడటం వంటివి వయస్సు మీదపడిందనడానికి స్పష్టమైన సంకేతాలు. చిన్న వయస్సులోనే వయస్సు ఎక్కువగా కనబడకుండా చేయడానికి ఓ అద్భుతమైన పద్దతి ఉంది. ఏటంటే..? అందుకు మంచి పౌష్టికాహారం తీసుకోవడం వల్ల వయస్సు పైబడ్డ వారుగా కనబడనియ్యదు. మరియు ఆరోగ్యంగా ఉండేట్లు చేస్తుంది. అందుకు సహాయపడే అద్భుతమైన ఆహారాలేంటో చూద్దాం....

The Super Foods to Fight Ageing...!

బ్లూ బెర్రీస్: మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీర తత్త్వం ఉంటుంది. అందుకే మన ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా జాగ్రత్త పడాలి. ముఖంలో వృద్దాప్య ఛాయలు కనబడనీయకుండా, రానియ్యకుండా చేసే వాటిలో బ్లూ బెర్రీస్ చాలా అద్భుతమైనటు వంటి ఆహారం. బ్లూ బెర్రీస్‌లో వుండే యాంటీ 'ఆక్సిడేటివ్‌ ఫైటో కెమికల్స్‌', జ్ఞాపక శక్తి పెరుగుదలకి కారణం'' అని, జర్నల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫుడ్‌ కెమిస్ట్రీ'లో ప్రచురితమైన ఒక వ్యాసంలో, శాస్త్రజ్ఞులు వివరించారు.బ్లూ బెర్రీస్ - వీటిలో బీటా కెరోటిన్, లూటీన్ అనే కెరోటినాయిడ్లు, అంథోసియానిన్ అనే ఫ్లావనాయిడ్లు, ఎలాజిక్ అనే పోలీఫినైల్, విటమిన్ సి, ఫోలేట్, కాల్షియం, మెగ్నీషియం,పొటాషియం మరియు పీచు పదార్థము ఉన్నాయి . కాబట్టి ఇవన్నీ వయస్సు సంబంధించిన విటమిన్లు, ప్రోటీన్లే కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉండేదుకు సహాయపడుతుంది.

టమోటో: వయస్సుకు సంబంధించిన మరొక సూపర్ ఫుడ్ టమోటో. టమోటోను ఆహారంలో తీసుకోవడం వలల్ల ముఖంలో ముడతలను పోగొడుతుంది. టమోటో పుల్లగాను, జ్యూస్ గాను కలిగి ఉండటం చేత వీటిని రోజూ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న వయ్యస్సుల్లోనే మీలో వృద్దాప్యఛాయలు వెంటాడుతుంటే కనుక టమోటో ఉన్న లైకోఫిన్ అనే కెమికల్ ఆ లక్షణాలు దరిచేరనియ్యకుండా చేస్తుంది. దీనిలో "లైకోపీన్ (Lycopene)" అనే పదార్ధము శక్తి వంతమైన anti- oxydent గా పనిచీస్తుంది. టమోటోలోని లైకోపిన్ చర్య రంద్రాలను పూడ్చివేసి, చర్మ వ్యాదులు రాకుండా కాపాడుతుంది.

చేపనూనె: తీరప్రాంతాల్లో నివసించే మహిళలు చాలా అందంగా ఉంటారు. వారి అందానికి ఓ సీక్రెట్ ఉంది? అదేంటంటే తీర ప్రాంతాల్లో నివసించే వారు తరచూ చేపలు, చేపనూనెను ఆహారంగా తీసుకోవడం వల్ల వారి చర్మం దృడంగా, మెరుసేట్లు చేస్తుంది. కోల్డ్ వాటర్ ఫిష్ అంటే సాల్మన్ మరియు తున అనే చేపలు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను అధికంగా కలిగి ఉండటం వల్ల అవి చర్మాన్నికి బాగా ఉపయోగపడుతాయి. చర్మంలో ముడుతలు రాకుండా, కాంతివంతంగా ఉండేందుకు బాగా సహాయపడుతుంది.

గ్రీన్ టీ: ఇది ఆరోగ్యకరమైన పానీయం. దీంతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. గ్రీన్ టీని తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. బరువును తగ్గించడానికి బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా వృద్దాప్య ఛాయలు కనబడనియ్యకుండా చేస్తుంది. గ్రీన్ టీ తాగేవారిలో వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా దరిచేరవు. ఆయుష్షును పెంచే గుణం గ్రీన్ టీకి ఉంది. కాబట్టి ప్రతి రోజూ గ్రీన్ టీ సేవించి ముఖంలో ముడతుల, వలయాలు, హెయిర్ ఫాల్, బరువు పెరగం వంటి వాటికి దూరంగా ఉండండి.

చాక్లెట్స్: మీకు చాక్లెట్స్ తినే అలవాటుంటే మరీ మంచిది. చాక్లెట్స్ లో అంత అద్భుతమైన గుణాలున్నాయి. వయస్సును తెలియనియ్యకుండా చేసే లక్షణం చాక్లెట్స్ లో అధికంగా ఉన్నాయి. అనేక అధ్యయనాల ప్రకారం, చాక్లెట్స్ లో ఉపయోగించి కోకో, చాక్లెట్ మిల్క్ చర్మ కణజాలాలు సురక్షింతంగా ఉంచుతాయి. మరియు కణాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో చర్మంలో గరుకుదనం పోయి, చర్మం సున్నితంగా తయారువుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న ఆహారనియమాలను పాటించి వయస్సు మీద పడకుండా.. యవ్వనంగా కనబడేందుకు ప్రయత్నం చేయండి..!

English summary

The Super Foods to Fight Ageing...! | వయస్సు మీద పడకుండా..యవ్వనంగా ఉంచే ఫుడ్

Ageing is a nightmare for every individual who crosses 30! Wrinkles are fine lines that appear on your face and neck (especially near eyes) and, these are clear signs of ageing. Well, the good news is, right choice of foods can make you fight ageing in a natural and healthy way. Let's check out few super foods that help you fight ageing. These foods will not stop ageing from coming on your face, but can delay it to a greater extent.
Story first published: Monday, August 20, 2012, 13:30 [IST]
Desktop Bottom Promotion