Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
వేగంగా బరువు తగ్గడం వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాలు
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ వేగంగా బరువు తగ్గాలనుకుంటారు. అయితే అలా త్వరగా బరువు తగ్గడం వల్ల కొన్ని హెల్త్ రిస్కులు కూడా ఉన్నాయి. ఈ హెల్త్ రిస్క్ లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. త్వరగా బరువు తగ్గడం వల్ల డీహైడ్రేషన్, శరీరంలో కొవ్వుచేరడం మరియు స్ట్రెస్ పెరగడం జరుగుతుంది.
త్వరగా బరువు తగ్గించుకోవాలనే ఆత్రుత ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అయితే ఎలా పడితే అలా ఫాలో అవ్వకూడదు. హెల్తీగా బరువు తగ్గించుకోవడానికి కొంత ఓపిక కలిగి ఉండాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా కొన్ని కిలో బరువు తగ్గించుకోవడానికి హెల్తీ ప్లాన్స్ ను ముందుగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఆ ప్రకారం మాత్రమే కొన్నిక్యాలరీలను కరెక్ట్ గా తగ్గించుకోగలుగుతారు అంతే కాదు బరువు తగ్గే కొద్ది శరీరంలో కొంత ఎనర్జీని నిల్వ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఎనర్జీ మీరు రోజులో పనిచేయడానికి ఎంతో సహాయపడుతాయి.
త్వరగా అదనపు క్యాలరీలను తగ్గించుకోవాలనుకొనే వారు, వారి శరీరంను బాధకు గురిచేస్తారు. మీ శరీరం ఆకలితో ఉండటం వల్ల అది అనొరెక్సియా మరియు ఇతర స్టొమక్ డిజార్డర్స్ గురిచేస్తుంది. అంతే కాదు త్వరగా బరువు తగ్గడం వల్ల ఎదురయ్యే మరికొన్ని ఆరోగ్య దుష్ప్రభాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి...

డీహైడ్రేషన్
శరీరంలో నీరు చేరడం వల్లే తాము అధిక బరువుతో ఉన్నామని నమ్ముతారు. దాంతో అదనపు క్యాలరీను తగ్గించుకోవడం కోసం నీరు త్రాగడం తగ్గిస్తారు. దాని వల్ల కళ్ళు తిరగడం మరియు మలబద్దకం వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

అధిక కొవ్వు
అదనపు క్యాలరీలను తగ్గించుకోవడానికి మీరు ఎప్పుడైతే ఆకలితో ఉంటారో, మీ శరీరం ఎక్కువ ఆహారపు నిల్వలను కోరుకుంటుంది. కాబట్టి, ఎప్పుడైతే మీరు నార్మల్ డైట్ కు మారుతారో, వెంటనే అదనపు బరువు పెరగడానికి దారితీస్తుంది.

శరీరంలోని కొవ్వును ఎప్పటికీ కరిగించుకోలేరు
మీ శరీరం తాత్కాలికంగా మార్పుల చేసుకోవడం వల్ల, తిరిగి మీరు ఆహారంను నార్మల్ గా తీసుకొన్నప్పుడు కొవ్వునిల్వలు తిరిగి పెరగడంతో, వాటిని కరిగించుకోలేరు. అందుకే వేగంగా అన్ హెల్తీగా బరువు తగ్గాలని ఆలోచింపకూడదు.

నిద్రను కోల్పోతారు
డైటర్స్ కొవ్వును కరిగించుకోవడానికి బదులుగా వారు తీసుకొనే క్యాలరీలను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది శరీరం యొక్క మెటబాలిక్ రేటును అమాంతం తగ్గించేస్తుంది. దాంతో మీరు అలసటగా ఫీలవుతారు. దాంతో మీరు సరిగా నిద్రపొందడానికి కష్టంగా భావిస్తారు.

గాల్ స్టోన్
చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు, కానీ, వేగంగా బరువు తగ్గించుకోవాలనుకొన్నప్పుడు, ఇది పొట్టయొక్క ఉదర భాగంలో ప్రభావం చూపుతుంది. దాంతో గాల్ స్టోన్ (పిత్తాశయంలో రాళ్ళ)కు కారణం అవుతుంది.

న్యూట్రీషియన్ లోపం
వేగంగా బరువు తగ్గించుకొనే ప్లాన్ చేసినప్పుడు, మీరు తీసుకొనే ఆహారాల మీద కఠినంగా ఉండటం వల్ల ప్రోటీన్స్ మరియు న్యూట్రీషియన్స్ కలిగిన ఆహారాలను తక్కువగా తీసుకుంటారు. దాంతో శరీరంలో న్యూట్రీషియన్స్ లోపం ఏర్పడుతుంది. వేగంగా బరువు తగ్గడం వల్ల ఇది ఒక చెడు దుష్ప్రభావం.

ఒత్తిడి పెరగుతుంది
వేగంగా బరువు తగ్గడం వల్ల శరీరంలో హార్మోన్ల మార్పుతో ఒత్తిడి స్థాయిలు పెరుగుతాయి.

జుట్టు ఎక్కువగా రాలుతుంది
వేగంగా బరువు తగ్గడం వల్ల అది జుట్టు మీద కూడా ప్రభావం చూపుతుంది. యవ్వనంలోనే బట్టతలను చూడాల్సి వస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువ ప్రోటీన్స్ అవసరం అవుతుంది .

మెటబాలిజం మీద ప్రభావం చూపుతుంది
ఎవరైతే త్వరగా బరువు తగ్గించుకోవాలనుకుంటారు. అప్పుడు, డైట్ విషయంలో సరిగా లేకపోతే, మెటబాలిక్ రేటు క్రమంగా తగ్గిపోతుంది.

మరెన్నో ఇతర సమస్యలు
మీ శరీరం ఎప్పుడైతే సరైనా ప్రోటీన్స్, మినిరల్స్, మరియు న్యూట్రీషియన్స్ అందకుండా పోతాయో, అప్పుడు మీ శరీరం బలహీనంగా మారుతుంది. వేగంగా బరువు తగ్గడం వల్ల మహిళలు అనీమీయాకు గురి అవుతారు.



Click it and Unblock the Notifications
