For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్తనాల సైజ్ ను నేచురల్ గా తగ్గించుకోవడానికి 10 మార్గాలు

|

స్తనాలు(బ్రెస్ట్) బాగా పెద్దవిగా వుంటే కొద్దిపాటి అసౌకర్యంగానే కాక చూచేవారికి అసహ్యంగా కూడా వుంటాయి. మహిళల వక్షోజాలు పెద్దవిగా వున్నాయంటే వాటిలో కొవ్వు బాగా పేరుకున్నదని చెప్పాలి. దీనికి కారణం వంశపారంపర్యం కావచ్చు లేదా అధిక బరువు ఎక్కటం వల్ల కావచ్చు. శరీరంలో ఈస్ట్రోజన్ స్ధాయిలు అధికంగా వుంటే బ్రెస్ట్ సైజ్ పెరిగే అవకాశముంది. స్తనాలు పెద్దగా ఉంటే, అసౌకర్యంను కలిగి ఉండటం మాత్రమే కాదు, ఆరోగ్యపరంగా కూడా సమస్య ఉంటుంది.

అందానికి మారుపేరు అయిన అమ్మయిలు,ఎన్నో రకముల ఇబ్బందులు పడుతూ ఉంటారు,అందులో ఆరోగ్య సమస్యలు కొన్ని అయితే, మరికొన్ని శారీరక సమస్యలు,అందులో అధిక చాతి భాగం(బ్రెస్ట్) కలిగి ఉన్న స్త్రీలు అందరికి ఆకర్షితులై,ఆకతాయుల పిచ్చి పిచ్చి వ్యాఖ్యలకు

నలిగిపోతూ,ఎన్నో ఆటు,పోట్లు అనుభవిస్తూ,ఇబ్బందికి గురి అవుతూ ఉంటారు.అంతేకాకుండా శారీరకంగా కూడా అధిక భరువు కలిగిన చాతి వల్ల నడుము,భుజాలు,మెడ ప్రాంతంలో నొప్పితో బాదపడుతూ ఉంటారు.

ఈ అధికమైన చాతి కలిగి ఉండడం వల్ల మీరు మీకు నచ్చినవి,అందమైన దుస్తులు వేసుకోవడానికి ఇబ్బంది కలుగుతుంది అంతే కాకుండా ఇది మీ సౌందర్యం పై కూడా ప్రబావం చూపించి మీరు సరదాగ, బయటకు వెళ్ళాలన్నా,షాపింగ్ కి వెళ్ళాలన్న,ఎంతో ఇబ్బంది పడుతూఉంటారు.

READ MORE: స్తనాల (వక్షోజ) సైజు పెద్దగా పెరగాలంటే ఇవి తినాల్సిందే.!

అయితే, ప్రతీ సమస్యకు పరిష్కారం ఉంటుంది, అలానే మీ చేతి సమస్యను దూరం చేసి మీరు కూడా అందరిలా సరిసమానమైన చాతితో ఉండాలంటే శస్త్రచికిత్స లేకుండా,మీ ఇంట్లోనే సహజ పద్దతులు కొన్ని ఉన్నాయి, బారీ స్తన సౌందర్యంతో బాధపడే వారికోసం ఈ క్రింది స్లైడ్ ద్వారా కొన్ని మార్గాలను సూచించండం జరిగినది. వీటిను క్రమం తప్పకుండా అనుసరించినట్లైతే, బారీగా ఉన్న స్తనసౌందర్యంను మీకు నచ్చిన సైజులో, మరియు ఆకారంలో తీర్చిదిద్దుకోవచ్చు. అవి ఎంటో చూసేద్దామా.

READ MORE: భారీ స్తన సౌందర్యం కలిగిన పాపులర్ సెలబ్రెటీలు.!

సూచన: ఈ వ్యాయామాలను చేసేప్పుడు మీ భుజాలు, బ్యాక్ ఎక్కువగా నొప్పికి గురి అవుతుంది. మరియు మీ బ్రెస్ట్ వ్యాయామాలతో పాటు, మీ వెన్నుకు బలాన్ని చేకూర్చే వ్యాయామాలను ఎంపిక చేసుకోవాలి .

1. కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలు:

1. కార్డియో వ్యాస్కులర్ వ్యాయామాలు:

వక్షోజాలలో గుత్తులుగా వుండే కొవ్వు కణజాలాలుంటాయి.ఈ కొవ్వు కణాలను తగ్గించటం ద్వారా బ్రెస్ట్ సైజును సహజంగా తగ్గించవచ్చు. పరుగెత్తడం, సైకిలు తొక్కడం, మెట్లు ఎక్కటం, స్విమ్మింగ్ చేయటం వంటి సులభమైన వ్యాయామాలు కేలరీలను వ్యయం చేసి స్తనాల సైజును తగ్గిస్తాయి.

2. ఏరోబిక్స్:

2. ఏరోబిక్స్:

బ్రెస్ట్ సైజ్ ను తగ్గించుకోవడానికి ఏరోబిక్స్ చాలా సులభమైన పద్దతి. నేలపైనకాని లేదా ఒక బెంచిపైన కాని పడుకోండి. డంబ్ బెల్ లేదా బార్ బెల్ మీ చేతులలోకి తీసుకొని వాటిని పైకి ఎత్తటం,మోచేతులను వంచి కిందకు దించటం చేయండి. ఈ వ్యాయామం వక్షోజాల సైజులు తగ్గటానికి తోడ్పడుతుంది.

3. డాన్స్:

3. డాన్స్:

బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవడానికి డాన్స్ కూడా ఒక ఉత్తమ మార్గం. డ్యాన్స్ చేసేప్పుడు, మీ బ్రెస్ట్ కదలికలున్న డ్యాన్స్ ను ఎంపిక చేసుకుంటే, బ్రెస్ట్ వద్ద ఉండే కొవ్వు కణాలను కరింగించుకోవచ్చు.

4. మసాజ్ చేయాలి:

4. మసాజ్ చేయాలి:

హెవీ బ్రెస్ట్ ఉన్న వారు, సున్నితమైన మసాజ్ చేయడం వల్ల బ్రెస్ట్ ఫ్యాట్ క్రమంగా తగ్గుతుంది . అందువల్ల, ఈ నేచురల్ టిప్ వల్ల కాస్త నిధానంగానైనా, బెస్ట్ ఫలితాలను పొందవచ్చు. స్తనాలు మసాజ్ చేయడానికి నేచురల్ ఆయిల్స్ ను ఎంపిక చేసుకోవాలి.

5. అల్లం:

5. అల్లం:

అల్లం ఫ్యాట్ కరిగించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అల్లం తురుమును, ఒక కప్పు గోరువెచ్చని నీటిలో వేసి, ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి , త్రాగడం వల్ల చెస్ట్ చుట్టూ ఉన్న కొవ్వును కరిగిపోతుంది.

6. గ్రీన్ టీ :

6. గ్రీన్ టీ :

గ్రీన్ టీ ఒక ఎఫెక్టివ్ వెయిట్ లాస్ మరియు బ్రెస్ట్ సైజ్ తగ్గించే హోం రెమడీ . కాబట్టి, రోజుకు కనీసం రెండు మూడు కప్పుల గ్రీన్ టీ త్రాగాలి . ఇది బ్రెస్ట్ సైజ్ నేచురల్ గా తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

7. ఫ్లాక్ సీడ్స్:

7. ఫ్లాక్ సీడ్స్:

ఫ్లాక్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఈస్ట్రోజెన్ లెవల్స్ ను తగ్గిస్తుంది . ఒక గ్లాసు నీళ్ళలో ఫ్లాక్స్ సీడ్స్ నానబెట్టుకోవాలి. ఆ నీటిని త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

8. ఎగ్ వైట్:

8. ఎగ్ వైట్:

ఎగ్ వైట్ ఒక ఉత్తమ నేచురల్ మార్గం . ఎగ్ వైట్ లో కొద్దిగా ఉల్లిపాయ జ్యూస్ ను మిక్స్ చేసి, బ్రెస్ట్ మీద మాస్క్ లా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ ను బిగుతుగా మార్చుతుంది . దాంతో బ్రెస్ట్ సైజ్ చిన్నగా కనబడుతుంది . ఈ రెమెడీని వారానికి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. వేపఆకు ఎఫెక్ట్:

9. వేపఆకు ఎఫెక్ట్:

బ్రెస్ట్ సైజ్ ను నేచురల్ గా తగ్గించుకోవాలనుకుంటే, వేపఆకు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది . ఒక గుప్పుడు వేపఆకులను నీటిలో వేసి బాయిల్ చేయాలి. అందులో కొద్దిగా పసుపు , తేనె మిక్స్ చేసి త్రాగాలి. ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ సైజ్ క్రమంగా తగ్గడం మీరు గమనించవచ్చు.

10. ఫిష్ ఆయిల్:

10. ఫిష్ ఆయిల్:

ఫిష్ ఆయిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఇది బ్రెస్ట్ సైజ్ తగ్గించుకోవాలనుకొనే వారికి ఇది ఒక ఉత్తమ మార్గం.

English summary

10 Ways To Naturally Decrease Breast Size

Naturally Decrease Breast Size in Telugu: The heaviness of your chest, does it pull you down to your toes? If yes, then it is time to naturally reduce your breast size. When you have heavy breast your back begins to pain and so does your shoulders over a period of time.