For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బరువు తగ్గడానికి 6 ఎఫెక్టివ్ చిట్కాలు

|

చాలా మంది కొంచెం లావు అయితే చాలు అయ్యే చాలా లావు అయిపోయాను అని హైరానా పడిపోతూ బరువు తగ్గడానికి చిట్కాలను వెదుకుతారు. సాధారణంగా ఎందుకు బరువు తగ్గాలనుకొంటారు..?శరీరం నాజుగ్గా ఉంచుకోడం కోసం కొంత మంది ప్రయత్నిస్తే మరి కొంత మంది ఆరోగ్యం కోసమంటారు. మరికొంత మంది సెక్సీగా కనబడటానికి అంటారు.

ఏదైమైన వయస్సుకు మిచ్చిన బరువు ఉండటం ఇలా శరీరానికే కాకుండా అలా ఆరోగ్యానికి కూడా హానికరమే. అయితే ఆ బరువును తగ్గించుకోవడానికి గంటల తరబడి జిమ్ కెలుతుంటారు. అలా వెళ్ళాల్సిన అవసరం. ఈ క్రింది తెలిపిన చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు శరీర బరువును తేలికగా తగ్గించుకోవచ్చు...

నీళ్ళు:

నీళ్ళు:

సాధారణంగా డ్రింక్స్ అంటే మీరు ఎక్కువగా పంచదార కలపిన జ్యూసులు, సోడా మరియు ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల పూర్తిగా వాటి మీద ఆధారపడుతారు. దాంతో శరీరంలో అధనంగా మరి కొంత కొవ్వు ఏర్పడుతుంది. అలా కాకుండా నీళ్ళను ఎక్కువగా సేవించడం మంచిది. నీరు తాగడము వల్ల సైడు ఎఫెక్ట్సు ఉండవు . ఎక్కువగా తాగితే మూత్రపిండాలకు శ్రమ ఎక్కువవుతుంది. తక్తం లొని సోడియం నిల్వలు పల్చబడతాయి. అందువలన ఒకేసారి ఎక్కువ నీరు తాగకూడదు . దఫ దఫాలు గా కొంచెం కొంచం గా తాగుతూ ఉండాలి. అన్నింటి కి దివ్య ఔషధం నీరు .

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

అధికబరువు తగ్గేందుకు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంచుకునేవారు గ్రీన్ టీ తప్పనిసరిగా తాగాలి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. శరీరంలో అధికకెలోరీలను తగ్గించడమే కాదు. దృడమైన ఆరోగ్యాన్నీ అందిస్తుంది ఈ గ్రీన్ టీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది .

తేనె:

తేనె:

పంచదారతో పోలిస్తే తేనెలో కెలొరీలు అధికంగా ఉన్నా..వేడినీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకొన్న కొవ్వు కరుగుతుంది. క్రమంగా బరువూ తగ్గుతాం. అలాగే తేనె, నిమ్మరసం, దాల్చిన చెక్క...కలిపి తీసుకోవడం వల్ల శరీర బరువులో ఎంతో తేడా ఉంటుంది. ఊబకాయం ఉన్నవారు వంటకాల్లో బెల్లం, పంచదారకు బదులు తేనెను వాడితే మంచిది. అందుకు గ్లాసు గోరువెచ్చటి నీటిలో చెంచా తేనె, కలిపి పరకడుపున తీసుకుంటే ఎంతో మార్పు ఉంటుంది.

మొలకెత్తిన పెసలు:

మొలకెత్తిన పెసలు:

వీటిలో ఎ, బి, సి, ఇ, విటమిన్లు ఖనిజ లవణాలు, క్యాల్షియం, ఇనుము, పొటాషియం..మాంసకృత్తులు, పీచు..వంటివెన్నో పోషకాలు లభిస్తాయి. కొవ్వును కరిగించడంతోపాటు..శరీర బరువును అదుపులో ఉంచుతాయి. అలాగే చాలా త్వరగా జీర్ణమవుతాయి కూడా. పైగా వీటిలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ శాతం అదుపులో ఉంటుంది. అందుకే వీటిని రోజూ తీసుకోవాలి.

బ్రేక్ ఫాస్ట్ లో బనానా(అరటిపండు)తప్పని సరి:

బ్రేక్ ఫాస్ట్ లో బనానా(అరటిపండు)తప్పని సరి:

ప్రతిరోజూ ఉదయం తీసుకొనే అల్పాహారంతో పాటు ఒక అరటి పండును తినడం చాలా మంచిది. డైట్ లో ఐరన్ కంటెంట్ తప్పనిసరి: ఫ్యాట్ బర్నింగ్ టిప్స్ లో ఐరన్ కలిగినటువంటి పదార్థాలు తీసుకోవడం చాలా మంచిది.

 వ్యాయామం:

వ్యాయామం:

వ్యాయామం తప్పనిసరి. రోజులో కనీసం కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలి. అలా కేటాయించడం కుదరని వారు ఇంట్లోని మెట్లు ఎక్కడం, దిగడం, ఇంట్లోనే ఇటూ అటూ అరగంట పాటు ఆపకుండా నడవడం లాంటివి చేయాలి. నిద్ర లేచిన వెంటనే ఇలాంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఉదయం, సాయంత్రం ఓ అరగంట పాటు నడవడం అలవాటు చేసుకోవాలి.

Story first published: Wednesday, May 27, 2015, 12:44 [IST]
Desktop Bottom Promotion