For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ‌రీరంలో పేరుకున్న కొవ్వు క‌రిగించే.. ఆహారాలు

By Nutheti
|

ప్ర‌స్తుత జ‌న‌రేష‌న్‌లో అంద‌రినీ వేధిస్తున్న స‌మ‌స్య కొలెస్ర్టాల్, బెల్లీ ఫ్యాట్. స‌రైన ఆహార నియ‌మాలు పాటించ‌క‌పోవ‌డం, రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరిగిపోతున్నారు. ఒక్క‌సారి బ‌రువు పెరిగిన త‌ర్వాత త‌గ్గ‌డం చాలా క‌ష్ట‌మైన‌ప‌ని.

కొన్ని సంద‌ర్భాల్లో కొంత‌మంది ఎన్ని విధాలుగా ప్ర‌య‌త్నించినా.. బ‌రువు త‌గ్గ‌క‌పోవ‌డంతో చాలా ఇబ్బందిప‌డుతుంటారు. అయితే శ‌రీరంలో కొవ్వు పేరుకుపోవ‌డానికి కార‌ణ‌మ‌య్యే ఆహార‌ప‌దార్థాల గురించి తెలుసుకుంటే.. బ‌రువు పెర‌గ‌కుండా.. కొలెస్ర్టాల్‌కి దూరంగా ఉండ‌వ‌చ్చు. అలాగే కొన్ని ఆహారాల ద్వారా కొవ్వు క‌రిగించుకోవ‌డం చాలా ఈజీ. శ‌రీరంలో కొలెస్ట్రాల్ క‌రిగించే ఎఫెక్టివ్ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

బీన్స్

బీన్స్

బీన్స్‌లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. ర‌క‌ర‌కాల రూపాల్లో ల‌భించే బీన్స్ తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీర బ‌రువు త‌గ్గించుకోవచ్చు. కొవ్వు ప‌దార్థాల‌ను క‌రిగించుకోవ‌చ్చు.

గ్రెయిన్స్

గ్రెయిన్స్

బార్లీ, ఓట్స్ వంటి ఓల్ గ్రైన్స్‌ గుండె సంబంధిత వ్యాధుల నుంచి కాపాడ‌తాయి. గ్రైన్స్ వల్ల‌ శరీరంలో చెడు కొవ్వు పదార్థాలు త‌గ్గుతాయి. దీనివ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయి త‌గ్గుతుంది.

ఓట్స్

ఓట్స్

కొవ్వును తగ్గించడంలో ఓట్స్ చాలా శక్తివంతంగా పని చేస్తాయి. వీటి ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి వీటిని రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకి చెక్ పెట్ట‌వ‌చ్చు.

అవకాడో

అవకాడో

అవ‌కాడోలో గుండె ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శరీరంలో మంచి కొవ్వు పదార్థాలను పెంచి, చెడు కొవ్వు పదార్థాలను తగ్గిస్తాయి.

డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్

బాదం, వాల్ నట్స్, వేరుశ‌న‌గ గింజలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. రోజు కొన్ని గింజలు తినటం వల్ల శరీరంలోని చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తాయి.

పండ్లు

పండ్లు

యాపిల్, గ్రేప్స్, స్ట్రాబెర్రీ, సిట్రస్ వంటి పండ్లు రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో చెడు కొవ్వు ప‌దార్థాల స్థాయిలు త‌గ్గుతాయి. అలాగే ఆహారం ఈజీగా జీర్ణ‌మ‌వుతుంది.

సోయా

సోయా

సోయా గింజలను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను త‌గ్గిస్తుంది. రోజుకి 25గ్రాముల సోయా తీసుకోవ‌డం వ‌ల్ల చెడు కొవ్వు ప‌దార్థాల‌ను 5 నుంచి 6 శాతం త‌గ్గించుకోవ‌చ్చు.

వెజిటబుల్ ఆయిల్

వెజిటబుల్ ఆయిల్

స‌న్ ఫ్ల‌వ‌ర్ సీడ్ ఆయిల్, వెన్న‌, క్యానో ఆయిల్ వాడ‌టం వ‌ల్ల చెడు కొవ్వు ప‌దార్థాల స్థాయిలు త‌గ్గించుట‌లో స‌హాయ‌ప‌డ‌తాయి. కాబ‌ట్టి వంటల్లో వెజిట‌బుల్ ఆయిల్స్ వాడ‌టం వ‌ల్ల బ‌రువు త‌గ్గించుకోవ‌చ్చు.

English summary

Foods To Reduce Bad Cholesterol

What you eat is what you are. If your diet can give you high cholesterol, it can lower it, too. But taking heart healthy foods to decrease your bad cholesterol levels will guarantee you a healthy heart.
Story first published: Saturday, December 26, 2015, 18:45 [IST]
Desktop Bottom Promotion