Latest Updates
-
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి!
బరువు తగ్గించుకోవడానికి ఉదయం తీసుకొనే టాప్ 10 ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ...
నిత్య జీవితంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటానికి మరియు అనారోగ్యాలకు దూరంగా ఉండటానికి ప్రోటీన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. కావున మనం రోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ల స్థాయిలు తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. శరీరానికి అవసరమయ్యే స్థాయిలో ప్రోటీన్ లను తీసుకునే వారిని, ప్రోటీన్లను తీసుకోని వారితో పోలిస్తే, తీసుకునే వారు ఎక్కువ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవటం మంచి అలవాటుగా, మార్గంగా చెప్పవచ్చు. వీటి వలన కడుపు నిండినట్లుగా అనిపించి, రోజంతా లోరీలు ఎక్కువగా అందించే ఆహార సేకరణకు దూరంగా ఉండేలా చేస్తాయి.
అంతేకాకుండా, ప్రోటీన్లు శరీరాన్ని మరమ్మత్తులకు గురి చేసి, బాడీ మెటబాలిజంను మెరుగుపరుస్తాయి. మీ శరీర కండరాలను పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ప్రోటీన్లు మంచి మార్గంగా చెప్పవచ్చు. అదేవిధంగా మీ శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?అయితే రోజు ఉదయాన్నే ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి, శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, కండర అభివృద్ధిని ప్రోత్సహిస్తాయి.
మరీసన్నగా ఉంటే, మీబరువును పెంచే టాప్ 25 ఫుడ్స్!
అంతే కాదు ఈ వెయిట్ లాస్ ఫుడ్ వల్ల పొట్ట ఉదరంలో మరియు తొడల వద్ద మరియు నడుము భాగంలో కొవ్వును త్వరగా కరిగించుకోవచ్చు . ఈ ప్రోటీన్ ఫుడ్స్ శరీరానికి కావల్సిన ఎనర్జీని అందిస్తూనే వ్యాధులను దూరం చేస్తుంది . ప్రోటీన్ ఫుడ్స్ మన శరీరంలో వ్యాధినిరోధకశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . కాబట్టి వీటిని ప్రతి రోజూ ఉదయం తీసుకొనే ఆహారాల్లో చేర్చుకోవడం ఇటు ఆరోగ్యానికి, అటు బరువు తగ్గించుకోవడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. శరీర బరువు తగ్గించే పరిపూర్ణ ప్రోటీన్లను కలిగి ఉండే, మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోగల ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం...

1. బాదం:
బాదం ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఇందులో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం సాల్ట్ లేని బాదంపప్పును తీసుకోవడం వల్ల బరువు తగ్గడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం తీసుకుంటే మరింత ప్రయోజనకరం.

2. గుమ్మడి విత్తనాలు:
గుప్పెడు గుమ్మడి విత్తనాలను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గించుకోవచ్చు . గుమ్మడి విత్తనాలు ఆకలికోరికలను తగ్గిస్తుంది.

3. గుడ్డు:
బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు. గుడ్డులోని పచ్చసొన కంటే తెల్ల సొన ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా అంది, ఎనర్జినీ అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తాయి.

4. పెరుగు:
ప్రోబయోటిక్ ఫుడ్స్ డైట్ లో ఎనర్జిటిక్ ఫుడ్స్ . అంతే కాదు బరువు తగ్గించడంలో కూడా ముఖ్యపాత్రపోషిస్తుంది. ఉదయం తీసుకోవడం వల్ల డైజెస్టివ్ ట్రాక్ శుభ్రపడుతుంది . దాంతో వ్యాధులను దూరం చేస్తుంది.

5. చికెన్ :
లీన్ మీట్ సింపుల్ గా బెస్ట్ ఫుడ్ . ఇది రిచ్ ప్రోటీన్ ఫుడ్ . చిన్న మొత్తంలో తీసుకుంటే చాలు శరీరానికి తగిన ఎనర్జీ అందివ్వడంతో పాటు ఫ్యాట్ ను కరిగిస్తుంది.

6. ఫిష్ :
సాల్మన్ ఫిస్ ప్రోటీన్ ఫుడ్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎనర్జీ అందిస్తుంది బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి మరియు బరువు తగ్గుతారు .

7. లెంటిల్స్:
లెంటిల్స్ డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల బరువు తగ్గించడంతో పాటు బ్లడ్ షుగర్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది.

8. హుమ్స్:
హుమ్స్ న్యూట్రీషియన్ డిప్ ఫుడ్ . వీటిని మార్నింగ్ ఫుడ్ గా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్, క్యాల్షియం, ఎనర్జీ లెవల్స్ అందిస్తుంది. హుమ్స్ లో క్యాలరీలు తక్కవు కాబట్టి, బరువు తగ్గడానికి సహాయపడుతాయి.

9. క్వీనా:
క్వీనా హెల్తీ ప్రోటీన్ ఫుడ్ . ఒక సర్వింగ్ తోను పొట్ట నిండిపోతుంది . అంతే కాదు, ఫైబర్ అధికంగా ఉంటుంది మరియు క్యాలరీలు తక్కువగా ఉండటం వల్ల ఉదయం తీసుకోవడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు.

10. బ్రౌన్ రైస్:
బ్రౌన్ రైస్ ను డైలీ డైట్లో చేర్చుకవోడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు . ప్రోటీనులు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా బ్యాలెన్స్ చేసుకోచ్చు.



Click it and Unblock the Notifications
