For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీలో కొలెస్ట్రాల్ ను ఎఫెక్టివ్ గా తగ్గించే 10 సూపర్ పవర్ ఫుడ్స్ ..!!

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డిఎల్) పెరిగితే హెల్త్ రిస్క్ లో పడ్డట్లే, హార్ట్ డిసీజ్, ఓబేసిటి, డయాబెటిస్ వంటి సీరియస్ హెల్త్ రిస్క్ లు ఉంటాయి . రీసెంట్ గా మీరు బ్లడ్ టెస్ట్ చేయించి ఉంటే కనుక కొలెస్

|

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య హై కొలెస్ట్రాల్ . సహజంగా మానవ శరీరంలో నార్మల్ గా ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉంటే హై కొలెస్ట్రాల్ గా గుర్తిస్తారు. అయితే అన్ని కొలెస్ట్రాల్స్ చెడు కొలెస్ట్రాల్ కాదు. మంచి కొలెస్ట్రాల్ (హెడ్ డిఎల్) అనేది మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక పదార్ధం. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉన్నాయి: హెచ్ డి ఎల్, సాధారణంగా మంచి కొలెస్ట్రాల్ అంటారు, ఎల్ డి ఎల్, సాధారణంగా చెడు కొలెస్ట్రాల్ గా సూచిస్తారు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటె, తీవ్రమైన సమస్యలు వస్తాయి.

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డిఎల్) పెరిగితే హెల్త్ రిస్క్ లో పడ్డట్లే, హార్ట్ డిసీజ్, ఓబేసిటి, డయాబెటిస్ వంటి సీరియస్ హెల్త్ రిస్క్ లు ఉంటాయి . రీసెంట్ గా మీరు బ్లడ్ టెస్ట్ చేయించి ఉంటే కనుక కొలెస్ట్రాల్ లెవల్స్ స్థాయిలను బట్టి వెంటనే కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మొదట కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి. శరీరంలో హై కొలెస్ట్రాల్ లేదా చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడానికి 10 కామన్ ఫుడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి..

మెంతులు:

మెంతులు:

మెంతుల్లో స్టెరిడోల్ సపోనిన్స్ అధికంగా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ శరీరం గ్రహించకుండా నివారిస్తుంది. అందువల్ల మెంతులను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మెంతుల్లో ఉండే హైలెవల్ కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్స్ తో పోరాడుతుంది. మెంతులు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటు, చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మెంతులను డ్రైగా రోస్ట్ చేసి, చల్లారిన తర్వాత పొడి చేసి గోరువెచ్చని నీటిలో వేసి రోజూ ఒక గ్లాసు నీళ్ళు తాగాలి.

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండటం వల్ల హార్ట్ కు రక్షణ కల్పిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీరం హై ఫ్యాట్ కంటెంట్ గ్రహించకుండా నివారిస్తుంది. రెగ్యులర్ గా ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవచ్చు. ఇది కరోనరీ హార్ట్ డిసీజ్ హైపర్ టెన్షన్ ను తగ్గిస్తుంది. ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ను ఒక గ్లాసు వేడి నీటిలో మిక్స్ చేసి రోజూ ఉదయం పరగడుపున తీసుకోవాలి.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లిని ఇండియన్ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వెల్లుల్లి ఎల్ డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల ద్వారా వెల్లడిస్తున్నారు. ఇది బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది. ఇది ధమనుల్లో ప్లాక్ ను విచ్ఛిన్నం చేస్తుంది. దాంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి రిస్క్ ను తగ్గించుకోవచ్చు. వెల్లుల్లిలో సల్ఫర్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. డయాబెటిస్ ను దూరం చేస్తుంది, బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది. రోజూ వెల్లుల్లిని ఉదయం పరగడపున తినాలి.

ఉల్లిపాయాలు:

ఉల్లిపాయాలు:

ఉల్లిపాయల్లో స్ట్రాంగ్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల కణాలు డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది. ఉల్లిపాయలను రెగ్యులర్ గా తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ (హెచ్ డిఎల్ )ను పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. రెగ్యులర్ వంటకాల్లో మరియు సలాడ్స్, సూప్స్ లో పచ్చిఉల్లిపాయల్లి జోడించడం మంచిది.

నట్స్ :

నట్స్ :

బాదం, పిస్తా, హాజల్ నట్స్, వాల్ నట్స్ లో ఫాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇది ధమనులను హెల్తీగా ఉంచుతుంది. అదేవిధంగా వీటిని సాల్ట్ లేదా షుగర్ జోడించకుండా తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరగుతుంది. ఇవి హార్ట్ ను హెల్తీగా ఉంచడం మాత్రమే కాదు, ప్రాణాంతకమైన క్యాన్సర్, శ్వాస సంబంధిత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . కొన్ని డ్రై నట్స్ ను నీళ్ళలో నానెబట్టి తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు . కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించుకోవచ్చు.

చేపలు:

చేపలు:

చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్ డిఎల్ ను నివారించి, హార్ట్ కు రక్షణ కల్పిస్తాయి . సీ ఫిష్ లో సాల్మన్, మకరెల్, సార్డిన్స్ , హల్బట్ వంటివి తీసుకోవడం మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఇది డయాబెటిస్ రిస్క్ ను తగ్గిస్తుంది. చేపలను గ్రిల్ చేసి, స్టీమ్ చేసి, లేదా ఉడికించి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల పూర్తి పోషకాలు శరీరానికి అంది, చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.

ఓట్స్ అండ్ బీన్స్ :

ఓట్స్ అండ్ బీన్స్ :

ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ మరియు బీటా గ్లూకాన్ అధికంగా ఉంటుంది. ఈ రెండూ శరీరంలో ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. బీన్స్ లో కూడా ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను మరియు కొలెస్ట్రాల్ క్వాలిటీని తగ్గిస్తుంది.

ఓట్స్

ఓట్స్

ఓట్స్ కొవ్వును తగ్గించడంలో ఓట్స్ చాలా శక్తివంతంగా పని చేస్తాయి. వీటి ద్వారా రోజుకి 25 నుంచి 35 గ్రాముల ఫైబర్ పొంద‌వ‌చ్చు. కాబ‌ట్టి వీటిని రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువుకి చెక్ పెట్ట‌వ‌చ్చు.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ బ్యాడ్ కొలెస్టాల్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి. రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడంతో పాటు, బ్లడ్ క్లాట్స్ కాకుండా నివారిస్తుంది. బ్లడ్ వెజల్స్ రిలాక్స్ చేస్తుంది. టీలో ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉంటాయి. బ్లడ్ ప్లెజర్ లెవల్స్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

సిట్రస్ పండ్లు:

సిట్రస్ పండ్లు:

నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.

English summary

10 cholesterol lowering foods

A common health issue most people face these days is higher than normal cholesterol levels. But not all cholesterol is bad. High levels of good (HDL) cholesterol is exactly what you need to stay healthy, and increased amounts of bad cholesterol (LDL) can put you at risk of a number of serious ailments like heart disease.
Story first published: Tuesday, November 8, 2016, 13:28 [IST]
Desktop Bottom Promotion