For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక వారంలో పొట్ట కరిగించే 10 ఎఫెక్టివ్ అండ్ సింపుల్ టిప్స్ ..

|

పొట్టతో నలుగురిలో ఇబ్బంది పడుతున్నారా? ఫ్యాట్ టమ్మీ మీ నాజూకైన నడుము అందాన్ని పాడుచేస్తున్నదా? అటువంటి ఫ్యాట్ టమ్మీని ఏవిధంగా తగ్గించుకోవాలని చూస్తున్నారా? ప్రస్తుత రోజుల్లో సెడంట్రీ లైఫ్ స్టైల్ మరియు ఈటింగ్ హ్యాబిట్స్ వంటి ఎన్నో కారణాలు ఫ్యాట్ టమ్మీకి కారణమవుతున్నాయి . ఈ ఫ్యాట్ టమ్మీ వల్ల ఇష్టమైన డ్రెస్సులను వేసుకోలేకపోతున్నారు.

ఇటువంటి ఇబ్బంది కరమైన, అందోళన కలిగించే ఫ్యాట్ టమ్మీని ఒక వరాంలో తగ్గించుకోవచ్చన్న విషయం మీకు తెలుసా? తెలిస్తే ఆశ్చర్యానికి గురి అవుతారు. అమేజింగ్ టిప్స్ కొన్ని ఉన్నాయి? ఒక వారంలో బరువు తగ్గించే ఈ సింపుల్ టిప్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా ఫాలో అయితే చాలు, చాలా త్వరగా ఫ్యాట్ టమ్మీ తగ్గించుకోవచ్చు..మరి అవేంటో తెలుసుకుందాం...

ఆహారాన్ని తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవడం:

ఆహారాన్ని తక్కువగా ఎక్కువ సార్లు తీసుకోవడం:

బరువు తగ్గించుకోవడంలో ఒక గ్రేట్ ఐడియా మనం రోజుకు మూడు సార్లు ఆహారం తీసుకుంటాము. అదే మూడు సార్లు ఎక్కువ తీసుకునే ఆహారాన్ని...నాలుగైదు సార్లు తక్కువతక్కువ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.అంతే కాదు, జీవక్రియలు చురుకుగా పనిచేస్తాయి. పొట్ట వద్ద ఉండే కొవ్వును ఎఫెక్టివ్ గా కరిగిస్తాయి.

హై ఫైబర్ ఫుడ్స్ ను తగ్గించాలి:

హై ఫైబర్ ఫుడ్స్ ను తగ్గించాలి:

కొన్ని సమయంలో మనలో చాలా మంది పొట్ట ఉబ్బరంతో బాధపడుతుంటారు. బెల్లీ పెరిగిపోయి చాలా ఇబ్బందికి గురి అవుతుంటారు . ఇలా పొట్ట ఉబ్బరానికి కారణం హైఫైబర్ ఫుడ్సే ప్రధాణకారణం. హైఫైబర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ శరీర ఆరోగ్ాయనికి మంచిది , కానీ బాడీ షేప్ ను దెబ్బతీస్తుంది. కాబట్టి, ఫ్లాట్ టమ్మీని కోరుకునే వారు ఫైబర్ ఫుడ్ ను మితంగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకోకూడదు . ఇవి గ్యాస్ మరియు స్టొమక్ బ్లోటింగ్ కు కారణమవుతుంది.

పచ్చి పండ్లు మరియు కూరగాయలకు దూరంగా:

పచ్చి పండ్లు మరియు కూరగాయలకు దూరంగా:

ఎక్కువ పచ్చి కూరలు మరియు వెజిటేబుల్స్ తీసుకోకూడదు . పచ్చి కూరలు మరియు పండ్లను చాలా తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. . ఇవి స్టొమక్ స్ట్రెచ్ చేయడానికి దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని కూడా చాల తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

డైరీ ప్రొడక్ట్ ను కట్ చేయాలి:

డైరీ ప్రొడక్ట్ ను కట్ చేయాలి:

ముఖ్యంగా ల్యాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉన్న వారిలో గ్యాస్ అసౌకర్యానికి గురి చేస్తుంది. మరియు కడుపుబ్బరంగా ఉంటుంది. ఎందుకంటే డైరీ ప్రొడక్ట్స్ జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి సమస్య ఉన్నవారు పెరుగు మాత్రమే తీసుకోవాలి. పాలు మరియు ఇతర చీజ్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి.

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి:

పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి:

అవొకాడో, అరటి, బొప్పాయి, మామిడి, కాంటలోప్ మరియు పెరుగు వంటి అధిక పొటాషియం ఉన్న ఆహారాలకు కడుపుబ్బరం తగ్గించే శక్తి ఎక్కువగా ఉంటుంది. పొటాషియం నేచురల్ డ్యూరియాటిక్ . ఇది శరీరంలో నీరు తగ్గిస్తుంది మరియు వాపులను తగ్గిస్తుంది.

బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి:

బెర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి:

బెర్రీస్ గ్రేట్ ఫ్యాట్ ఫైటింగ్ ఫుడ్స్. ఫ్యాట్ సెల్స్ పెరగకుండా బెర్రీస్ స్టాప్ చేస్తుందని పరిశోధనల్లో నిర్ధారించారు . ఇంకా ఇది ఫ్యాట్ సెల్స్ ను ఉత్పత్తి చేసే ఆడిఫోనిస్టిన్' బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించడంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.

అదే విధంగా నట్స్. ఇది పొట్టను ఫ్లాట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది,.వారంలో రెండు సార్లు నట్స్ తినే వారిలో బరువు తగ్గే లక్షణాలు ఎక్కువ.

ఎక్కువ నీరు తాగాలి:

ఎక్కువ నీరు తాగాలి:

నీరు ఆరోగ్యానికి గొప్ప మూలం. ఇంది శరీరానికి తగిన హైడ్రేషన్ అందిస్తుంది , బరువు తగ్గిస్తుంది పొట్టను ఫ్లాట్ గా మార్చుతుంది . మీరు తగినన్ని నీరు తాగడం వల్ల శరీరంలో వాటర్ బ్యాలెన్స్ చేస్తారు దాంతో శరీరంలో వాటర్ రిటన్షన్ మరియు బ్లోటింగ్ వంటి లక్షణాలను తగ్గించుకోవచ్చు.

 గ్రీన్ టీ సహాయపడుతుంది

గ్రీన్ టీ సహాయపడుతుంది

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ‘క్యాటచిన్స్' అనేవి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎటువంటి వ్యాయామాలు లేకుండానే బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

స్మూతీ తీసుకోవాలి:

స్మూతీ తీసుకోవాలి:

స్మూతీస్ శరీరంను హెల్తీగా మరియు హైడ్రేషన్ లో ఉంచుతుంది. . స్మూతీస్ రెడీ చేయడం చాలా సులభ. స్మూతీస్ తో దినచర్యను ప్రారంభించడం చాలా సులభం . అందుకోసం వాటర్ మెలోన్ స్మూతీ గ్రేట్ . ఇందులో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది బాడీ ఫ్యాట్ తగ్గించడంలో మరియు మజిల్ మాస్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

ఫ్రెండ్లీ జింజర్ :

ఫ్రెండ్లీ జింజర్ :

అల్లం పొట్టకు ఉపశమనం కలిగించడం మాత్రమే కాదు , ఇది పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ నివారించడంలో ఎక్సలెంట్ హోం రెమెడీ. అల్లం తురిమి గ్రీన్ టీలో మిక్స్ చేసి తీసుకోవాలి. అల్లం ముక్కను నీటిలో వేసి బాగా మరిగించి గ్రీన్ టీ తీసుకోవాలి.

English summary

10 Simple Ways To Get A Flat Tummy In Just One Week..

Is your fat tummy bothering you? Have you ever wondered if you could achieve an unbelievably flat tummy faster than any of your peers? Owing to today’s sedentary lifestyle and poor eating habits, there is no wonder a fat tummy is something that has been bothering most of us.
Story first published: Monday, July 4, 2016, 17:27 [IST]
Desktop Bottom Promotion