For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: శృంగారం మీద కోరికలు తగ్గించే డేంజర్ ఫుడ్స్

|

భార్య భర్తల మధ్య దృఢమైన దాంపత్య బంధానికి తోడ్పడేది నమ్మకం, ప్రేమ, స్నేహం.. మాత్రమే కాదు, వీటన్నింటి కంటే వరుసలో ముందు వచ్చేది శృంగారం. ఇదే దాంపత్య బంధాన్ని రోజు రోజుకూ బలంగా తయారు చేస్తుంది. సంతృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించే వారి దాంపత్యంలో అడుగడుగునా ఆనందం వెల్లివిరుస్తుంది. పరస్పరం తోడుగా ఉన్నామనే నమ్మకం కలుగుతుంది. ప్రతస్తుత ఆధునిక జీవనశైలిలో భాగమైన పని ఒత్తిడి, అలసట, ఆందోళన మొదలైన వాటి ప్రభావం శృంగార జీవితం పై పడకుండా జాగ్రత్తపడాలి. అందుకు ఆహారనియమాలు, వ్యాయామాలు చాలా అవసరం.

లైంగిక సామర్థ్యం బాగుండాలంటే అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం మానుకోవాలి. పూర్ డైట్ మరియు బరువును పెంచే ఆహారాలు తీసుకోవడం వల్ల అవి మీ వ్యక్తిగత ఇమేజ్ ను దెబ్బతియ్యడమే కాకుండా, బ్లడ్ ఫ్లో, మరియు శరీరం యొక్క సామర్థ్యంను కూడా తగ్గించేస్తాయి. తాజా అధ్యయనాల ప్రకారం, కొన్ని రకాల ఆహారాలు మరియు న్యూట్రీషియన్స్ లిబిడో బూస్టింగ్ లో ప్రధాన పాత్రపోషిస్తాయి. కాబట్టి ముఖ్యమైన విషయమేటంటే, సెక్స్ లైఫ్ ను మెరుగుపరచుకోవడానికి కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి.

సోడ మరియు కోలాస్

సోడ మరియు కోలాస్

రెగ్యులర్ సోడాలు మరియు రుచికరమైన పానీయాలు(కోకో కోలా)మీ బరువు హెచ్చుతగ్గులు మరియు మీ మానసిక స్థితి ఒడిదుడులకులకు కారణం కావచ్చు. ఇటువంటి పానీయాలు అనేక ఆరోగ్యసమస్యలకు కారణం కావచ్చు. ఉదా: ఊబకాయం, దంతక్షయ సమస్యలు, మధుమేహం, మరియు మరొకన్ని ఇతరములు..ఈ లక్షణాలతో మీరు కనుక బాధపడుతున్నట్లైతే ఇప్పటికి మీరు మీ లైంగి సమస్యలతో బాధపడుతున్నట్లు గ్రహించాలి.

పాస్తా:

పాస్తా:

పాస్తా తినడానికి చాలా బాగుంటుంది. అయితే ఒక సారి పాస్తా తిన్నతర్వాత, పాస్తాను గ్లూకోజ్ గా మార్చుకోవడానికి ఆరోజు మీశరీరం ఫిజికల్ గా చురుకుగా ఉండదు. దాంతో ఫ్యాట్ నిల్వచేరుతుంది . ముఖ్యంగా ఇది అలసటకు మరియు కడుపు ఉబ్బరానికి దారితీస్తుంది . కాబట్టి, లైంగిక సామర్థ్యం మెరుగుపడాలంటే, పాస్తాకు దూరంగా ఉండాలి.

కాఫీ:

కాఫీ:

ఉదయం ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల సంతోషకరమై మూడ్ ను ప్రేరేపిస్తుంది. కానీ, ఎక్కువగా తీసుకోవడం వల్లకాఫీలో ఉండే కెఫిన్ వల్ల స్ట్రెస్ మార్మోన్ల కార్టిసాల్ వంటి స్ట్రెస్ మరియు హార్మోన్ల అసమతౌల్యానికి కారణం కావచ్చు. కాబట్టి మీ అందమైన, సంతోషకరమైన లైంగిక జీవితం పొందడం కోసం మీరు మరియు మీ పాట్నర్ కాఫీకి దూరంగా ఉండాలి.

బర్గర్స్ అండ్ పరోటాలు:

బర్గర్స్ అండ్ పరోటాలు:

ఫ్రైడ్ ఫుడ్ ఉదా: ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు బర్గర్ వంటివి చాలా తీవ్రంగా లైంగికసామర్థ్యాన్ని నాశనం చేస్తాయి. వీటిలో ఉండే హైడ్రోజెనేటడ్ ఫ్యాట్స్ టెస్టోస్టెరాన్ లెవల్స్ ను తగ్గించేస్తాయి. మరియు పురుషుల్లో తక్కువ నాణ్యత గల స్పెర్మ్ మరియు జీవం లేని స్పెర్మ్ ప్రొడక్షన్ కు కారణం కావచ్చు. కాబట్టి మీ పాట్నర్ తో బయట డిన్నర్ చేసి వారి ఇంప్రెస్ చేయాలనుకుంటే అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ జాయిట్స్ కు దూరంగా ఉండాలి. ముక్యంగా మీరు లైంగిక జీవితానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు.

ఆల్కహాల్ -

ఆల్కహాల్ -

ఆల్కహాల్ తాగితే, ఆనందం మరియు నొప్పి రెండూ ఉంటాయి.ఆల్కహాల్ అధికమైతే, కామవాంఛ నశిస్తుంది. అంతేకాదు, ఆల్కహాల్ అధికమైతే, తలనొప్పి మరియు హేంగోవరు మూడ్ వచ్చేసి మీ రతివాంఛలు వెనుకపడతాయి.

చీజ్(జున్ను):

చీజ్(జున్ను):

అధిక క్రొవ్వు ఉన్న డైరీ ప్రొడక్ట్స్(పాల ఉత్పత్తులు) మీ శరీరానికి హాని కలుగజేయడంలో చాలా కారణాలున్నాయి. ఈ ప్రొడక్ట్స్ ను అత్యధికంగా తీసుకోవడం వల్ల ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మరియు టెస్టొస్టెరాన్ వంటి సహజ ఉత్పత్తులకు అంతరాయం కలిగించి టాక్సిన్స్ (శరీరంలో విషాలను)ప్రేరేపించడానికి కారణం అవుతుంది.

పుదీనా:

పుదీనా:

పుదీనా నోటిలోకి వేసుకొనే ముందు ఒక సారి ఆలోచించండి!ఇది జీర్ణ వ్యవస్థ ప్రయోజనాలు మరియు చెడు శ్వాస నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకా ఇది మీ లిబిడోకు ప్రతి కూలా ప్రభావాలను కలిగి ఉంటుంది. మీలో సెక్స్ డ్రైవ్ ను చల్లబరిచే మెంతోల్ గుణం ఇందులో ఉంటుంది. కాబట్టి చెడు శ్వాసను వదిలించుకోవడానికి, సహజ మూలికలును తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుంది.

కార్న్ ఫ్లేక్స్ -

కార్న్ ఫ్లేక్స్ -

కార్న్ ఫ్లేక్స్ లేదా మొక్క జొన్న పొత్తులు రెగ్యులర్ గా తింటూ వుంటే కూడా మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు పడిపోతాయి. మొదటగా జొన్న పొత్తులను ఆహారంలో ప్రవేశ పెట్టేటపుడే, ఈ విషయాన్ని అది కనిపెట్టిన జాన్ హార్వే కెల్లాగ్ ప్రచారం చేశారు. ఈ ఆహారాన్ని కామ వాంఛ తగ్గించేందుకే ప్రవేశ పెట్టారు. అతని మేరకు, తమ కామవాంఛలు అధికంగా వుండి, మానసిక, శారీరక సమస్యలు తగ్గాలని కోరే వారికి ఈ ఆహారం ఎంతో సహకరిస్తుంది.

కార్న్ ఫ్లేక్స్ -

కార్న్ ఫ్లేక్స్ -

కార్న్ ఫ్లేక్స్ లేదా మొక్క జొన్న పొత్తులు రెగ్యులర్ గా తింటూ వుంటే కూడా మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు పడిపోతాయి. మొదటగా జొన్న పొత్తులను ఆహారంలో ప్రవేశ పెట్టేటపుడే, ఈ విషయాన్ని అది కనిపెట్టిన జాన్ హార్వే కెల్లాగ్ ప్రచారం చేశారు. ఈ ఆహారాన్ని కామ వాంఛ తగ్గించేందుకే ప్రవేశ పెట్టారు. అతని మేరకు, తమ కామవాంఛలు అధికంగా వుండి, మానసిక, శారీరక సమస్యలు తగ్గాలని కోరే వారికి ఈ ఆహారం ఎంతో సహకరిస్తుంది.

 కూల్ డ్రింకులు, టానిక్ లు -

కూల్ డ్రింకులు, టానిక్ లు -

కొన్ని కూల్ డ్రింక్ లలో క్వినైన్ ఉంటుంది. ఈ క్వినైన్ అనే పదార్ధాన్ని సింకోనా చెట్టు బెరడునుండి తీస్తారు. దీనిని మలేరియా వ్యాధి నివారణలో వాడతారు. అది మీ కామ కోర్కెలను కూడా తగ్గిస్తుంది. కనుక ఏదేని పానీయం లేదా క్వినైన్ కల టానిక్ తాగేముందు ఆలోచించండి.

సోయా -

సోయా -

సోయా గింజలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. పోషకాలు ఈ గింజలలో పుష్కలంగా వుంటాయి. అయితే వీటిని అధికంగా తింటే, మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయిలు తగ్గిపోతాయి. ఫలితంగా వాంఛ నశిస్తుంది. కనుక సోయా లేదా టోఫు వంటివి కామ కొర్కెలను తగ్గిస్తాయనేది తెలుసుకోండి.

ధనియాలు -

ధనియాలు -

ధనియం ప్రధానంగా మసాలాలో వాడతారు. కాని ఇది టెస్టోస్టిరోన్ హార్మోన్ బాగా తగ్గించేస్తుంది. అయితే, తక్కువ మొత్తాలలో వాడితే ఈ సమస్య ఉండబోదని చెప్పవచ్చు.

సోపు విత్తనాలు -

సోపు విత్తనాలు -

ప్రతివారికి భోజనం తర్వాత నోటి రుచి మారాలంటూ సోపు వేయటం అలవాటుగా వుంటుంది. ఈ సోపు విత్తనాలు కనుక అధికం అయితే, ఎంతో హాని. అవి మీ కామ వాంఛను కుదించేస్తాయి. ఇవి మీలోని టెస్టోస్టిరోన్ స్ధాయి తగ్గిస్తాయి.

రెడ్ మీట్:

రెడ్ మీట్:

మాంసాహార ప్రియులు బయట అందంగా అలంకరించిన నాన్ వెజ్ ఐటమ్స్ ను చూసి ఆకర్షింపబడి రాత్రి డిన్నర్ కి కొంచెం ఎక్కువగా లాగించేస్తారు. దాంతో ఏమవుతుంది? మాంసాహారంలో అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల రాత్రి సమయంలో జీర్ణం అవడానికి కష్టం అవుతుంది. కాబట్టి రాత్రి సమయంలో అతి తక్కువగా తినడం లేదా పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ముఖ్యంగా డిన్నర్ బెగ్గర్ లా తినాలి. బ్రేక్ ఫాస్ట్ కింగ్ లా తినాలి. అప్పుడే మీ ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యం అవుతుంది.

English summary

14 Foods That Kill Your Sex Life

If you are not able to perform at your bed, then you and your partner are in from the worst sex session of your lives. There are a lot of aphrodisiacs that are available in the market that can help you to boost your libido and make you a big performer in bed.
Story first published: Thursday, May 12, 2016, 17:54 [IST]
Desktop Bottom Promotion