బ‌రువు త‌గ్గే ప్రాసెస్ లో ప్ర‌తి ఒక్క‌రూ తెలియ‌కుండా చేసే పెద్ద పొర‌పాట్లు

By Swathi

బ‌రువు త‌గ్గాల‌నుకునేవాళ్లు చాలా బ‌ల‌మైన‌, చేయ‌గ‌లిగే వెయిట్ లాస్ ప్లాన్ రూపొందించుకోవాలి. కొన్ని రోజుల్లో చాలా ఎక్కువ కేజీలు త‌గ్గిపోవాల‌నే టార్గెట్ పెట్టుకోకూడ‌దు. చాలా వేగంగా బ‌రువు త‌గ్గే ప్లాన్స్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబ‌ట్టి నెమ్మ‌దిగా , హెల్తీగా బ‌రువు త‌గ్గాలి.

బ‌రువు త‌గ్గాల‌ని కోరుకునే వాళ్ల సంఖ్య ఎక్కువ‌. బ‌రువు త‌గ్గ‌డం కోసం ఈజీ ప్రాసెస్‌లు, సుల‌భ డైట్ టిప్స్ ఫాలో అవుతుంటారు. అలాగే కొంత‌మంది వెంట‌నే బ‌రువు త‌గ్గిపోవాల‌నే తొంద‌ర‌లో అనేక పొర‌పాట్లు చేస్తుంటారు. ఈ పొర‌పాట్లు చిన్న‌వే అయినే ప‌రిణామాలు చాలా పెద్ద‌గా ఉంటాయి. కాబ‌ట్టి బ‌రువు త‌గ్గే ప్రాసెస్‌లో చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ప్రొటీన్

ప్రొటీన్

బ‌రువు త‌గ్గేవాళ్ల‌కు ప్రొటీన్ చాలా ఇంపార్టెంట్. కానీ మ‌రీ ఎక్కువ‌గా తీసుకుంటే అది ఫ్యాట్ గా మారుతుంది. హైప్రొటీన్ షేక్స్, బార్స్ లో ఎక్కువ మొత్తంలో షుగ‌ర్ ఉంటుంది. కాబ‌ట్టి.. సాధ్య‌మైనంత‌వ‌ర‌కు ఇలాంటివాటికి దూరంగా ఉండాలి. ప్రొటీన్ ల‌భించే న్యాచుర‌ల్ ఫుడ్స్ ని డైట్ లో చేర్చుకోవాలి.

వెజిట‌బుల్స్ తిన‌క‌పోవ‌డం

వెజిట‌బుల్స్ తిన‌క‌పోవ‌డం

చాలామంది వెజిట‌బుల్స్ ని మిస్ అవుతూ ఉంటారు. కానీ బ‌రువు త‌గ్గేట‌ప్పుడు ఖ‌చ్చితంగా వెజిట‌బుల్స్ ని డైట్ లో చేర్చుకోవాలి. ప్ర‌తిరోజూ రెండున్న‌ర క‌ప్పుల కూర‌గాయ‌ల‌ను డైట్ లో చేర్చుకోవాలి. ప్ర‌తిపూట ఫుడ్ లో ట‌మోటా ముక్క‌ల‌ను, దోస‌కాయ ముక్క‌లు చేర్చుకోవ‌డం వ‌ల్ల మెరుగైన ఫ‌లితాలు పొంద‌వ‌చ్చు.

బ్రేక్ ఫాస్ట్ కి జ్యూస్

బ్రేక్ ఫాస్ట్ కి జ్యూస్

బ‌రువు త‌గ్గాల‌నుకునేవాళ్లు చాలామంది ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ లో ఒక పెద్ద గ్లాసు జ్యూస్ తీసుకుంటారు. చాలా ర‌కాల జ్యూస్ లు బ్ల‌డ్ షుగ‌ర్ ని పెంచుతాయి. కాబ‌ట్టి దీనివ‌ల్ల శ‌రీరం ఇన్సులిన్ ని ఉత్ప‌త్తి చేస్తుంది. దీనివ‌ల్ల ఆక‌లి పెరిగి.. ఎక్కువ‌గా తింటారు. కాబ‌ట్టి ఫైబ‌ర్, ప్రొటీన్ ల‌భించే ఆహారాల‌ను డైట్ లో చేర్చుకోవాలి. ఎగ్స్, వోల్ గ్రెయిన్ బ్రెడ్ బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలి.

ఒకేర‌క‌మైన వ్యాయామాలు

ఒకేర‌క‌మైన వ్యాయామాలు

ఒకేర‌క‌మైన వ్యాయామాలు ఎప్పుడూ చేయ‌డం వ‌ల్ల‌.. ఒకే ర‌క‌మైన ప్ర‌యోజ‌నాలు పొందుతారు. మెరుగైన ఫ‌లితాలు పొందాలంటే.. త‌ర‌చుగా వ్యాయామాల‌ను మారుస్తూ ఉండాలి. ఎప్పుడూ ఒకేర‌క‌మైన వ్యాయామాలు చేయ‌కూడ‌దు.

టార్గెట్

టార్గెట్

బ‌రువు త‌గ్గాలంటే.. స‌రైన నియ‌మాలు పాటించాలి. అంతేకాని.. వారంలో నాలుగు కేజీలు, 15 రోజుల్లో 10 కేజీలు అన్న టార్గెట్స్ పెట్టుకోకూడ‌దు. ఇలాంటి టార్గెట్స్.. మీ బ‌రువు త‌గ్గించ‌క‌పోగా.. బ‌రువు పెరిగేలా చేస్తాయి.

ఎక్స‌ర్‌సైజ్

ఎక్స‌ర్‌సైజ్

బ‌రువు త‌గ్గే ప్రాసెస్‌లో వ్యాయామం చాలా ముఖ్య‌మైన‌ది. త‌క్కువ క్యాల‌రీలు తీసుకుని.. ఎక్కువ క్యాల‌రీలు ఖ‌ర్చు పెట్టాలి. కానీ కొంత‌మంది ఎక్కువ క్యాల‌రీలు తీసుకుని.. త‌క్కువ ఖ‌ర్చు పెడుతుంటారు. కాబ‌ట్టి రెగ్యుల‌ర్‌గా వ్యాయామం చేయ‌డం వ‌ల్ల ఈ పొర‌పాటు జ‌ర‌గ‌కుండా ఉంటుంది.

నిద్ర‌, టీవీ

నిద్ర‌, టీవీ

బ‌రువు త‌గ్గాల‌నుకునేవాళ్లు నిద్ర‌ను బాగా కంట్రోల్ చేసుకుంటారు. కానీ.. ఇది చాలా పెద్ద పొర‌పాటు. ఎందుకంటే రోజుకి 7 నుంచి 9 గంట‌ల విశ్రాంతి అవ‌స‌రం. ఈ క్యాలిక్యులేష‌న్ మిస్స‌య్యితే.. మీరు అనూహ్యంగా బ‌రువు పెరిగిపోతారు. మ‌రో పొర‌పాటు ఏంటంటే.. టీవీల ముందు కూర్చుని తిన‌డం. టీవీ షోల‌లో నిమ‌గ్న‌మై.. ఎక్కువ ఆహారాన్ని తిన‌డం వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌డం కాదు.. పెరిగిపోతారు.

ఫుడ్ విష‌యంలో

ఫుడ్ విష‌యంలో

బ‌రువు త‌గ్గాల‌ని కోరుకుంటారు. కానీ.. స‌రైన నియ‌మాలు పాటించ‌రు. ఫుడ్ విష‌యంలో కేర్ తీసుకోరు. బ‌రువు త‌గ్గాల‌నే కోరిక ఉన్న‌ప్పుడు హెల్తీ ఫుడ్, స్నాక్స్ ఎంచుకోవాలి. రోజంత‌టికి స‌రిపోయే శ‌క్తిని పొందే ఫుడ్‌ని ఒకేసారి కాకుండా.. అప్పుడ‌ప్పుడు తీసుకోవ‌డం వ‌ల్ల త‌క్కువ‌గా తింటారు. ఆక‌లి కూడా త‌క్కువ‌గా అనిపిస్తుంది.

Story first published: Monday, July 25, 2016, 9:00 [IST]
Desktop Bottom Promotion