For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

30లలోనే బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుంది ? అసలు కారణాలేంటి ??

By Swathi
|

వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. దీనివల్ల ఆ వయసులో ఉండాల్సిన ఫ్యాట్ కంటే ఎక్కువ ఫ్యాట్ శరీరంలో పేరుకుంటుంది. నడుము చుట్టూ ఫ్యాట్ చేరిందంటే.. త్వరలోనే.. మీరు కొన్ని అనారోగ్య సమస్యలు ఫేస్ చేస్తారని సంకేతం.

ఒకవేళ మీ వయసు 30లలో ఉండి.. ఫ్యాట్ తో బాధపడుతున్నారంటే.. ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ లో మార్పలు తీసుకురావాలి. బెల్లీ ఫ్యాట్ అత్యంత ముఖ్యమైన కారణం.. ఒత్తిడి హార్మోన్స్, ఇన్ల్ఫమేటరీ వంటి సమస్యలు.. ఇన్సులిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతాయి. తర్వాత.. ఒబేసిటీ, డయాబెటిస్, హార్ట్ డిసీజ్ లు ఫేస్ చేయాల్సి వస్తుంది.

ఒకవేళ మీరు బెల్లీ ఫయాట్ కరిగించుకోవాలని 30లలో ట్రై చేస్తున్నారంటే.. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే రిస్క్ ని తగ్గించుకుంటారు. 30లలో మీకు బెల్లీ ఫ్యాట్ రావడానికి కారణం ఏంటి, బెల్లీ ఫ్యాట్ ని ఎఫెక్టివ్ గా తగ్గించుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో చూద్దాం..

ఉప్పు

ఉప్పు

మీరు ఎక్కువగా ఉప్పు తీసుకోవడం వల్ల 30లలోనే బెల్లీ ఫ్యాట్ సమస్య వచ్చింది. కాబట్టి నల్ల మిరియాలు, అల్లం ఇతర స్పైసెస్ చేర్చుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు.

మెగ్నీషియం

మెగ్నీషియం

మీ శరీరానికి కావాల్సినంత మెగ్నీషియం అందడం లేదు. అందుకే.. నడుము చుట్టూ ఫ్యాట్ పేరుకుంది. కాబట్టి గ్రీన్ వెజిటబుల్స్, బీన్స్, నట్స్ ని మీ డైట్ లో చేర్చుకోవాలి.

ఫైబర్ అందకపోవడం

ఫైబర్ అందకపోవడం

మీ శరీరానికి సరైన మోతాదులో ఫైబర్ అందడం లేదు. కాబట్టి ఫ్రూట్స్, సలాడ్స్, తృణధాన్యాలను డైట్ లో చేర్చుకుంటే.. మీ బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

అన్ హెల్తీ ఫ్యాట్స్

అన్ హెల్తీ ఫ్యాట్స్

మీ డైట్ లో అన్ హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల.. మీకు 30లలోనే బెల్లీ ఫ్యాట్ వచ్చింది. ఇది కరిగించుకోవడానికి ఎక్కువగా మోనో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ ఉండే నట్స్, ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి.

ఒకే పద్ధతి

ఒకే పద్ధతి

కొన్ని నెలలుగా ఒకే విధమైన వ్యాయామం, ఒకే రకమైన డైట్ ఫాలో అవుతుంటారు. ఇందులో మార్పులు చేయకుండా ఫాలో అవకూడదు. కొన్ని వారాలకు ఒకసారి వ్యాయామంలో మార్పులు తీసుకురావాలి. డైట్ లోనూ రకరకాల ఆహారాలను చేర్చుకోవాలి.

పొట్ట ఎక్సర్ సైజ్ లపై ఫోకస్

పొట్ట ఎక్సర్ సైజ్ లపై ఫోకస్

కొంతమంది కేవలం పొట్ట ఎక్సర్ సైజ్ లపై మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. కానీ.. శరీరం మొత్తంపై శ్రమపడేలా వ్యాయామం చేయాలి. కార్డియో, పొట్టకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే.. బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

డ్రింక్స్

డ్రింక్స్

ఎక్కువ సోడాలు, ఇతర సాఫ్ట్ డ్రింక్స్ ని ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటుంది. కానీ సోడాలకు బదులు.. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు తాగడం ఆరోగ్యానికి మంచిది. ఫ్యాట్ కరగడానికి కూడా ఈ జ్యూస్ లు సహాయపడతాయి.

ఒత్తిడి

ఒత్తిడి

ఎక్కువగా ఒత్తిడికి గురవడం వల్ల కూడా.. 30లలోనే బెల్లీ ఫ్యాట్ సమస్యను ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి.. ధ్యానం, యోగా వంటి వాటి ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

ఆల్కహాల్

ఆల్కహాల్

పరిమితికి మించి ఆల్కహాల్ సేవించినా కూడా.. 30లలో బెల్లీ ఫ్యాట్ సమస్య ఎదురవుతుంది. కాబట్టి.. కేవలం 2డ్రింక్స్ తీసుకోవడం వల్ల.. టమ్మీ ఫ్యాట్ ని కంట్రోల్ లో పెట్టుకోవచ్చు.

English summary

9 Things You're Doing Wrong at the Age of 30 that Cause Belly Fat

9 Things You're Doing Wrong at the Age of 30 that Cause Belly Fat. Read on to Know more.
Story first published: Tuesday, October 4, 2016, 10:37 [IST]
Desktop Bottom Promotion